చిత్ర పరిశ్రమలో అండదండలు లేకపోయినా అంచలంచెలుగా అగ్ర కథానాయకుడిగా ఎదిగిన నటుడు రవితేజా. తన తరువాత ఇండస్ట్రీకి వచ్చిన వారికి స్పూర్తిగా నిలిచిన నేపథ్యం రవితేజాకి ఉంది. అలాంటి రవితేజాకి ఇప్పుడు వరుస పరాజయాలు ఎదురౌతున్నాయి. 'మిరపకాయ్' చిత్రం తర్వాత వచ్చిన 'వీర' ... 'నిప్పు' ... తాజాగా విడుదలైన 'దరువు' చిత్రాలు పరాజయాలుగా వచ్చి ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎప్పుడూ ఎంతో ఉత్సాహంతో తెరపై సందడి చేసే రవితేజాతో జట్టు కట్టాలని గతంలో కథానాయికలంతా ఆశపడేవారు. అలాంటి హీరోతో జోడీ కట్టేందుకు ఇప్పుడు వాళ్లు వెనుకడుగు వేస్తుండటం నిజంగా విచారించదగిన విషయమే.
దానికి తోడు, బిజినెస్ వర్గాలలో కూడా అతని సినిమాలకు అంతగా ప్రోత్సాహం వుండడం లేదంటూ వార్తలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి పూరీజగన్నాథ్ మాత్రమే తిరిగి సక్సెస్ ఇవ్వగలడని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం రూపొందుతోంది. జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. మరి, మిత్రుడి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అతని అభిమానుల ఆశను పూరీ నేరవేరుస్తాడా ...? లేదా? అనేదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న!
Post a Comment