
భారతీయ సంప్రదాయ దుస్తుల్లో మిలమిల మెరుస్తూ, అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది అందాలతార ఐశ్వర్యారాయ్. ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో అందాలతార ఐశ్వర్యా రాయ్ రెడ్ కార్పెట్ వాక్ చేసే సమయంలో ఎటువంటి దుస్తులు ధరిస్తుందంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన నేపథ్యంలో, ఐష్ ఎంచుకున్న డ్రెస్ అందర్నీ ఆకట్టుకుంది.
అబూ జానీ- సందీప్ ఖోశ్లా సంయుక్తంగా డిజైన్ చేసిన ఎత్నిక్ వేర్ ధరించిన ఐశ్వర్య నవ్వులు చిందిస్తూ, అందరికీ హాయ్ చెబుతూ దర్శనమివ్వడంతో... అతిధులు కన్నార్పకుండా ఆమెనలాగే చూస్తుండిపోయారు. జరీ అంచుతో కూడిన తెల్లని చీరపై, వర్క్ తో కూడిన ఫుల్ స్లీవ్స్ నారింజ రంగు బ్లౌజ్ ధరించిన ఐష్ నిండు భారతీయ మహిళకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. తనతో బాటు కూతురు ఆరాధ్య కూడా కేన్స్ వచ్చిందని ఐష్ మీడియాకు చెప్పింది.
Post a Comment