నాయకుడు, భారతీయుడు, మహానది, దశావతారం, ఆకలి రాజ్యం, ఎర్రగులాబీలు, స్వాతిముత్యం, విచిత్ర సోదరులు, పుష్పక విమానం, ఇంద్రుడు చంద్రుడు ఇలా చెప్పుకుంటూ విలక్షణ నటుడు కమల్ హాసన్ చిత్రాలకు, ఆయా చిత్రాలలో ఆయన నటనకు మనం దాసోహం కాక తప్పదు.
కమల్ హాసన్ పేరు చెబితే ఆయన చిత్రాలు, నటన గురించి గడగడా చెప్పుకుంటూ పోతాం. మరి కమల్ హాసన్ అసలు పేరేంటో మీకు తెలుసా ? మీకేంటి ఆయన కూతురు, హీరోయిన్ శ్రుతి హాసన్ కే తన తండ్రి అసలు పేరు తెలియదు. అవును ఇది నిజంగా నిజం. కమల్ హాసన్ అసలు పేరు పార్ధసారధి. కమల్ తల్లి చనిపోయేంత వరకు కమల్ ను పార్ధసారధి అనే పిలిచేది.
అయితే ఇటీవల శ్రుతి హాసన్ ఓ రియాల్టీషోలో పాల్గొంది. అందులో కమల్ హాసన్ అసలు పేరు అడిగారు. దీంతో అమ్మడు తెలీదంటూ తెల్లమొఖం వేసిందట. చివరికి ఫోన్ ఎ ఫ్రెండ్ ఆప్షన్‌లో తన తండ్రి కమల్ హాసన్ కే ఫోన్ చేసి ఆయన అసలు పేరు తెలుసుకుని చెప్పిందట.
Post a Comment