
విడుదల తేది :05 ఏప్రిల్ 2012 |
దర్శకుడు : సంపత్ నంది |
నిర్మాత : ఎన్ .వి .ప్రసాద్, పారస్ జైన్ |
సంగీత దర్శకుడు : మణి శర్మ |
తారాగణం : రామ్ చరణ్ తేజ, తమన్న |
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,తమన్నా జంటగా నటించిన చిత్రం ‘రచ్చ’. సంపత్ నంది దర్శకత్వంలో మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్వి ప్రసాద్ మరియు పారస్ జైన్ నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. రచ్చ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రచ్చ చిత్రం మాస్ ఆడియెన్సుని దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమా. చిరు ల నటించాడు రామ్ చరణ్ నటన చిరు ని అనుకరించినట్టు కనిపిస్తుంది డాన్సులు సూపర్ గా చేసాడు చిత్ర కథలో కొత్తదనం లేకపోవడం మైనస్ అని చెప్పుకోవాలి.కంత్రి బన్నీ ఇలా గతంలో వచ్చిన చాలా సినిమాల కథల్ని కలిపి దర్శకుడు రచ్చ కథని తయారు చేసాడు అని చెప్పక తప్పదు పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగులు అభిమానులని అలరిస్తాయి. రసూల్ ఎల్లోర్సి నిమాటోగ్రఫీ బావుంది.
ఈ సినిమా కధ విషయానికి వస్తే పాత సారా కొత్త సీసాలో అన్నట్లు వుంటుంది తమన్నా నటన అందరిని ఆకట్టు కుంటుంది రామ్ చరణ్ నటన డాన్సు లు సినిమా కి బాగా కలిసివచ్చిన విషయాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మణిశర్మ పెట్టింది పేరు అని ఈ సినిమా తో మరోసారి రుజువయ్యింది ఈ సినిమా ఫాన్స్ కి పండగ అని చెప్పాలి సగటు ప్రేక్షకుడు తో పరవాలేదు అనిపించుకునే సినిమా ఇది కాబట్టి ఒక సారి చూసి ఎంజాయ్ చేయండి
రేటింగ్: 3/5
Post a Comment