ధనుష్ - శృతిహాసన్ కాంబినేషన్లో రూపొందిన '3 ' సినిమా కోసం చేసిన కొలవెరి పాట ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ పాటని ధనుష్ స్వయంగా రాసి పాడాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మాత్రం పాట స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడీ సినిమాలోని కొలవెరి సాంగును వెంటనే తొలగించాలంటూ కేరళా హైకోర్టులో ఎం. మాదస్వామి అనే వ్యక్తి 'పిల్' దాఖలు చేశాడు.
ఇప్పటికే తమిళనాడు - కేరళ ప్రాంతంలోని అమ్మాయిలను ఈ పాటతో కుర్రాళ్లు టీజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అమెరికా సైకలాజికల్ అసోషియేషన్ వారు జరిపిన ఓ అధ్యయనంలో ... ఈ పాట హింసాత్మకమైన ఆలోచనలను, ఉద్రేక స్వభావాన్ని కలిగిస్తున్నట్టుగా తేలిందని ఆయన తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. 'పిల్' దాఖలు చేసిన మాదస్వామి కేరళాలోని ఇదుక్కి ప్రాంతానికి చెందినవాడు. పైగా ఆయన 30 గంటల 6 నిమిషాలపాటు ఏకధాటిగా ప్రసంగించి గిన్నిస్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్న ఘనుడు. మరి ఈ విషయం పట్ల కోర్టు ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.
Post a Comment