సిల్క్‌స్మిత జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని తీయబడిన ‘ది డర్టీ పిక్చర్’ బాక్సాఫీస్ వద్ద సంచలన ...
సిల్క్‌స్మిత జీవితచరిత్రను ఆధారం చేసుకుని (అని ప్రచారం సాగినట్లు) తీయబడిన ‘ది డర్టీ పిక్చర్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం పొందడంతో ఇప్పుడు మరో సంచలన దివంగత తార దివ్యభారతి నిజజీవితకథను ఆధారం చేసుకుని సినిమా రాబోతున్నట్లు తెలిసింది. ‘భగత్‌సింగ్’ ఫేమ్ విక్రమ్ సాంథూ ఈ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారు. అయితే విక్రమ్ మాత్రం... ‘‘చిన్న వయసులో స్టార్ అయిన ఒక నటి జీవితాన్ని కథగా తెరకెక్కిస్తున్నాం. అంతేతప్ప మీరనుకున్నట్లు అది దివ్యభారతి రీ(య)ల్ స్టోరీ కాదు’’ అని చెబుతున్నారు.
ఒక పాపులర్ నటి లేదా టోటల్‌గా కొత్త అమ్మాయి కానీ ఈ చిత్రంలో నటించే అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు. జూలై నుంచి ఈ చిత్రం సెట్స్‌మీదికి వెళ్తుందని, భారతదేశం, దుబాయ్‌లలో షూటింగ్ జరుగుతుందని సమాచారం. దివ్యభారతిలాంటి పోలికలున్న అమ్మాయికోసం దర్శక నిర్మాత వెదకులాట మొదలుపెట్టినట్లు ముంబైలో ప్రచారం జరుగుతోంది.
Post a Comment