'గబ్బర్ సింగ్' ఆడియో వేడుక జరిగిన దగ్గరనుంచి అందరి నోటా అదేపనిగా 'కెవ్వు కేక' వినిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట ఇప్పుడు యువతని ఓ ఊపు ఊపేస్తోంది. ఆడియో ఫంక్షన్లో వచ్చిన రెస్పాన్స్ చూస్తే ... ఈ ఆల్బం లో ఎక్కువ మార్కులు ఈ పాటకే దక్కాయని అందరూ అంటున్నారు. అందుకేనేమో మలైకా అరోరాకి కోటి రూపాయల వరకూ ముట్టజెప్పారనే గుసగుసలు సైతం వినిపించాయి.
పోతే, ఈ ఐటంసాంగుకి సంబంధించిన చిత్రీకరణ ఈ రోజు నుంచి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లోని ఏడెకరాల స్థలంలో జరుగుతోంది. మలైకా అరోరాతో పాటు మరికొందరు జూనియర్లపై ఈ పాటని ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆ తరువాత పవన్ ఈ పాట చిత్రీకరణలో జాయిన్ అవుతాడని చెబుతున్నారు. అన్ని హంగులూ అద్దడం పూర్తైన తరువాత ఈ సినిమాని మే రెండవవారంలో విడుదల చేయవచ్చని అంటున్నారు.

Post a Comment