Gabbarsingh on may9 గబ్బర్ సింగ్ మే 9న విడుదల


పవన్‌కళ్యాణ్‌ - హరీశ్‌శంకర్‌ కాంబినేషన్లో వస్తున్న గబ్బర్ సింగ్ మే 9 వ తేదీన విడుదల కానుంది.  పరమేశ్వర ఆర్ట్స్‌ అధినేత బండ్ల గణేశ్‌ నిర్మిస్తున్నఈ భారీ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ చాలా అంచనాలు పెట్టుకున్నారు. పంజా, పులి వంటి రెండు భారీ ఫ్లాపుల తర్వా వస్తున్న సినిమా కావడంతో పవన్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు.
‘మా సినిమా మీద అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. వాటికి తగ్గట్లుగా చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. పవన్‌కళ్యాణ్‌గారి కెరీర్‌లోనే నెంబర్‌వన్‌ హిట్‌గా నిలవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం ఉంది' ఆడియో ఫంక్షన్లో నిర్మాత గణేష్ సినిమాగురించి వ్యాఖ్యానించారు.
తాజాగా హరీష్ శంకర్ ఈసినిమా విడుదల గురించి ట్విటర్ లో ప్రస్తావించారు. ఆయన ట్వీటు:  “GabbarSingh almost finished ; Guys super excited to release on May 9th''.
చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ సినిమాలు కూడా ఇదే తేదీన విడుదలై భారీ హిట్ కొట్టాయని, గబ్బర్ సింగ్ కూడా అలా హిట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మంచి టాక్ వచ్చిన గబ్బర్ సింగ్ పాటు ఆన్ లైన్లో దుమ్ము రేపుతున్నాయి

Post a Comment

Previous Post Next Post