ఆ సినిమా డౌన్లోడ్ చేస్తే కోర్టుకేనట!-

    
సాధారణంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వాళ్లు చాలామంది పైరసీ సినిమాలు డౌన్ లోడ్ చేస్తుంటారు. అయితే ఇక పై ఇలా చేస్తే లేని పోని చిక్కుల్లో ఇరుక్కోవడం ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే ధనుష్ - శృతి హాసన్ నటించిన '3 ' సినిమా విషయంలో జరుగుతోన్న ప్రయత్నాలు చూస్తుంటే ఈ సంగతి మరింత స్పష్టమౌతోంది. పైరసీ విషయంలో '3 ' సినిమా నిర్మాతలు అందరికన్నా ఓ మూడడుగులు ముందేవున్నారు. ఈ సినిమాని ఎవరైనా డౌన్లోడ్ చేస్తే వాళ్లు మద్రాస్ హైకోర్టు నుంచి నోటీసులు అందుకోవలసి వస్తుందని నిర్మాతలు హెచ్చరిస్తున్నారు.
       ఐపీ అడ్రెస్ ఆధారంగా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఈ సినిమాని డౌన్లోడ్ చేశారో తెలుసుకోవచ్చనీ ... దీని ఆధారంగానే సదరు వ్యక్తులకి మద్రాస్ హైకోర్టు నుంచి నేరుగా నోటీసులు అందుతాయని వాళ్లు చెబుతున్నారు. ఇప్పటికే కొంత మందికి నోటీసులు పంపించామనీ ... మరి కొంత మందికి త్వరలో అందుతాయని అన్నారు. సో... బీ కేర్ ఫుల్ అన్నమాట!

Post a Comment

Previous Post Next Post