అక్కినేని పేరును ప్రస్తావించకుండా తెలుగు సినీ చరిత్రను చెప్పుకోవడం అసాధ్యమే అవుతుంది. తెలుగు తెరపై నవరసాలను నడిపించి, అశేష ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్ననటసామ్రాట్ ఆయన. అక్కినేని నట జీవితంలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ... మరెన్నో మరువలేని మైలురాళ్ళు కనిపిస్తాయి. చిన్నతనం నుంచే నాటకాలను తనదైన శైలిలో ప్రభావితం చేసిన ఆయన, బహుదూరపు నట బాటసారిగా 75 వసంతాలను పూర్తి చేశారు. ఇంతటి సుధీర్గమైన ప్రయాణాన్ని కొనసాగించిన నటుడు మరొకరు లేరని గర్వంగా చెప్పుకోవచ్చు.
ఈ సందర్భంగా ఆయన్ని సుబ్బిరామిరెడ్డి కళాపీఠం వారు సత్కరించబోతున్నట్టు ఇంతకు క్రితమే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలియజేశారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ నెల 9 వ తేదీన ఈ సత్కారాన్ని నిర్వహించనున్నట్టు వారు చెప్పారు. ఈ కార్యక్రమానికి భారతీయ సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులంతా హాజరౌతారని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో, టి.సుబ్బిరామిరెడ్డి ... మురళీమోహన్ ... జమున ... వాణిశ్రీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Post a Comment