ఇప్పుడు టాలీవుడ్ లోనూ, అభిమానుల్లోనూ ఇదే డిస్కషన్. ఇటీవల హైదరాబాదులో జరిగిన 'రచ్చ' ఆడియో వేడుకలో పవన్ కల్యాణ్ కనపడలేదు. దాంతో అభిమానులంతా 'పవర్ స్టార్ ...పవర్ స్టార్' అంటూ నినాదాలు చేయడంతో, 'పవన్ అమెరికాలో ఉన్నాడంటూ' చరణ్ తో బాటుగా చిరంజీవి కూడా వివరణ ఇచ్చారు. అయితే, పవన్ కల్యాణ్ అమెరికా వెళ్ళలేదనీ, హైదరాబాదులోనే వుండి రాలేదనీ మీడియాలో వార్తలొచ్చాయి. చిరంజీవికీ, పవన్ కల్యాణ్ కూ మధ్య ఏర్పడిన మనస్పర్ధల వల్లే పవన్ ఈ వేడుకకి హాజరు కాలేదంటూ మీడియా గాసిప్స్ ఇచ్చింది. ఆ సమయంలో హైదరాబాదులో జరిగిన 'గబ్బర్ సింగ్' క్లైమాక్స్ షూటింగులో పవన్ పాల్గొన్నాడంటూ, ఫైట్ మాస్టర్లు రాం- లక్ష్మణ్ ల కామెంట్స్ ను ఉటంకిస్తూ మీడియా కథనాలు ఇచ్చింది. దానికి తోడు, ఫంక్షన్ అయిన రెండు రోజులకే పవన్ హైదరాబాదులో మీడియాకు దొరికాడు. దీంతో ఇదేదో పెద్ద గొడవయ్యేలా వుందనుకున్నారేమో... తాజాగా 'గబ్బర్ సింగ్' చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ చేత వివరణ ఇప్పించారు. ఆ సమయంలో పవన్ అమెరికాలోనే ఉన్నాడనీ, అతను లేని షూటింగును చేశామనీ చెప్పుకొచ్చాడు. అయితే, అసలు వ్యక్తి పవన్ కల్యాణ్ మాత్రం మౌనంగా ఉండడంతో అందరికీ అనుమానం వస్తోంది. ఆయన దీనికి సరైన వివరణ ఎందుకు ఇవ్వడం లేదన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. దాంతో గాసిప్స్ కి మరింత ఆజ్యం పోసినట్టు అవుతోంది. ఏమైనా, దీనిని ఇంతగా సాగదీయడం కూడా మంచిది కాదేమో? వీటన్నిటికి గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ సమాధానం చేపుతుందేమో చూడాలి |
Post a Comment