లీగల్ నోటీసులు పంపిన సమీరారెడ్డి sameera reddy sent legal notice


 
సమీరా రెడ్డి కేరళకు చెందిన ఓ మ్యాగజైన్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. తన ఫోటోను అసందర్భంగా వాడిన సదరు మేగజైన్‌కు లీగల్ నోటీసులు పంపింది.
వివరాల్లోకి వెళితే…
లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్యా వ్యాపారంలో చాలా నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పూర్తిగా దివాలా తీసింది కూడా. ప్రభుత్వ రాయితీలు, బ్యాంకులు ఇచ్చిన అప్పులతోనే ప్రస్తుతం ఆ సంస్థ మనుగడ సాగిస్తోంది. ఈనేపథ్యంలో కేరళకు చెందిన ఓ మేగజన్ కవర్ పేజీపై ‘మాల్యా-సమీరారెడ్డి’ కలిసి ఉన్న ఫోటోను ప్రచురించి ‘ఎండ్ ఆఫ్ గుడ్ టైమ్’ పేరుతో ఓ కథనాన్ని ప్రచురించింది.
దీంతో చిర్రెత్తిన సమీరా సదరు మేగజైన్‌కు లీగల్ నోటీసులు పంపింది. తన పాత ఫోటోను వాడి తప్పు చేశారని, విజయ్ మాల్యాతో తన ఫోటో ప్రచురించడం వల్ల…అతనితో, అతని వ్యాపారాలతో సంబంధాల ఉన్నట్లు తనపై తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని అంటోంది సమీరారెడ్డి.

Post a Comment

Previous Post Next Post