
తెలుగులో ఆ మధ్య కాలంలో వచ్చిన ' బిందాస్' ... ఈ మధ్య వచ్చిన 'అహ నా పెళ్ళంట', 'దూకుడు' చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన అనిల్ సుంకర దర్శకుడిగా కూడా మారుతున్నాడు. ఎ. కె. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందించనున్న ఓ 3 డి సినిమాకి ఆయనే దర్శక నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఉగాది రోజున (23 న) ఉదయం 7 గంటలకి ఈ సినిమా షూటింగ్ ని లాంఛనంగా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. చెన్నైలో జరగనున్నఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హీరో రవితేజా హాజరౌతున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లరి నరేష్, వైభవ్, రాజు సుందరం, 'కిక్' శ్యాం, స్నేహా ఉల్లాల్, విమలారామన్, కామ్నజత్మలానీ, నీలమ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నారు. నిర్మాతగా సక్సెస్ చూసిన అనిల్, దర్శకుడగా ఎంతవరకూ రాణించగలడనే విషయం గురించే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది.
Post a Comment