రవితేజ హీరోగా శివ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న ‘దరువు’ చిత్రం షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. ప్రోగ్రెస్‌ను నిర్మాత వివరిస్తూ ‘పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం సెట్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 25 వరకూ హైదరాబాద్, బెంగుళూరులో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ఏప్రిల్‌లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి మే 4న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. రవితేజ కెరీర్‌లోనే ఇదొక డిఫరెంట్ కమర్షియల్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది’ అన్నారు. తాప్సీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరగపల్లి శివరామకృష్ణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ.
Post a Comment