సెన్సార్ పూర్తి చేసుకున్న 'నా ఇష్టం' rana naistam censor completed


 
రానా - జెనీలియా జంటగా నటిస్తోన్న'నా ఇష్టం' చిత్రం సెన్సార్  కారర్యక్రమాల్ని పూర్తి చేసుకుంది.సుకుమార్ శిష్యుడు ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఉగాది సందర్భంగా ఈ నెల  23 న విడుదల కానుంది. ఈ సినిమాలో  రానా తన గురించి మాత్రమే ఆలోచించే స్వార్ధపరుడిగా కనిపించనున్నారు. నలుగురి గురించి ఆలోచించే మనసున్న మనిషిగా జెనీలియా నటిస్తోంది. భిన్న మనస్తత్వాలు గల వీళ్లిద్దరూ ప్రేమలో పడటం, వాళ్ల మధ్య చోటుచేసుకునే ఆసక్తి కరమైన పరిణామాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. చిత్ర నిర్మాత పరుచూరి  కిరీటి మాట్లాడుతూ ... ఉగాదికి రిలీజ్ కానున్న ఈ సినిమాలో  ప్రేక్షకులు కోరుకునే అన్ని రుచులూ  ఉంటాయని    అన్నారు. మరి ఈ సినిమాతో అయినా రానాకి  సక్సెస్ ఇస్తారో లేదో అనేది 'ఆడియన్స్ ఇష్టం పై' ఆధారపడివుంది.ఈ  సినిమా  కి  u/a సర్టిఫికేట్  వచ్చింది  
 
 

Post a Comment

Previous Post Next Post