
రామ్ చరణ్ - తమన్నా హీరో హీరొయిన్ గ రూపొందిన 'రచ్చ' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఆది నుంచి కూడా అనేక సంచలనాలను నమోదు చేసుకుంటునేవుంది. కథ - కథనాల రీత్యా ... రామ్ చరణ్ పై కంపోజ్ చేసిన ఫైట్లు - డాన్సుల రీత్యా ఇప్పటికే ఈ సినిమా ఎక్కువ మార్కుల్నికొట్టేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఇతర భాషా చిత్ర నిర్మాతలను విపరీతంగా ఆకర్షిస్తోంది. తమిళ్ లో ఈ సినిమాని 'రాగలై' పేరుతో విడుదల చేస్తుండగా, మలయాళంలో 'రక్ష' పేరుతో చేస్తున్నారు. తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా ఈ సినిమా పై అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లోని అభిమానులంతా ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి, ఈ సినిమా ఇక్కడ ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో ... ఇతర భాషల్లో ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.గతం లో రామ్ చరణ్ మగధీర తమిళ్ లో విడుదలయి సంచలనం సృష్టించిన విషయం మనకు తెలిసిందే

Post a Comment