
తెలుగు తెరపై నట వారసత్వం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అలా మెగాఫ్యామిలీ నుంచి నట వారసత్వాన్ని భుజాన వేసుకుని నడిపిస్తోన్న యువ కథానాయకుడు రామ్ చరణ్. నిజానికి ఓ సాధారణ నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టడం వేరు ... చిరంజీవి కొడుకుగా తెరకి పరిచయంకావడం వేరు. ఎందుకంటే తెలుగు తెర పై చిరంజీవి తనదైన స్టైల్ తో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు. ఆయన కొడుకుగా చరణ్ ని కూడా ఆ స్థాయిలోనే అందరూ ఊహించుకుంటారు. అలాంటి అభిమానులు నిరాశ పడకుండా ఉండాలంటే చరణ్ నటనలో నాణ్యత చూపించాలి ... ముఖ్యంగా ఫైట్స్ లోనూ ... డాన్స్ లోను ఆరితేరాలి. ఇలాంటి వాటన్నిటిలో శిక్షణ పొందిన చరణ్, 'చిరుత' సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో డాన్స్ - ఫైట్స్ విషయంలో తండ్రినీ ... స్టైల్లో బాబాయి ని మరిపించడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు చరణ్. భారీ అంచనాలతో ... రికార్డ్ కలక్షన్ల తో తన తెరంగేట్రాన్నిఅవలీలగా పూర్తి చేశాడు. చరణ్ రెండో సినిమా 'మగధీర' గీతాఆర్ట్స్ బ్యానర్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందింది. పునర్జన్మ కి సంబంధించిన ఈ ప్రేమకథా చిత్రంలో శత్రువులని చీల్చి చెండాడే ధీరుడుగా అద్భుతంగా నటించిన చరణ్, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు. అటు మాస్ ఆడియన్స్ నూ ... ఇటు క్లాస్ ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకున్నాడు. ఇక చరణ్ మూడో సినిమా 'ఆరెంజ్ ' అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కింది .ఈ సినిమా విజయాన్ని అందించకపోయినా, లవర్ బాయ్ గా అతను ప్రేక్షకుల హృదయాలపై తనదైన ముద్ర వేయగలిగాడు .
ప్రస్తుతం చరణ్ తన నాలుగో సినిమా 'రచ్చ'తో మరోసారి అభిమానులను అలరించనున్నాడు .సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదలకానుంది. ఇలా చరణ్ నటించింది నాలుగు సినిమాలే అయినప్పటికీ 40 సినిమాల హీరో అంతటి క్రేజ్ నీ, ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. డాన్స్ లోనూ ... ఫైట్స్ లోను రాణిస్తూ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి తండ్రికున్న పేరు ప్రతిష్టలు రెడ్ కార్పెట్ లా ఉపయోగపడినప్పటికీ, కేవలం తన టాలెంట్ తో ఆయన అభిమానుల నీరాజనాలు అందుకుంటున్నాడు. రామ్ చరణ్ వినాయక కలయిక లో కూడా ఓ సినిమా వస్తోంది ఈ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు. అయన ఈరోజు 27 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు ఇది చెర్రీ కి ఆఖరి బచ్లేర్ బర్త్డే డే ఎందుకు అంటే ఈ సంవత్సరం చెర్రీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు సో ఈ రచ్చ కుర్రోడుకి ఈ సంవత్సరం అద్భుతం గ వుండాలని కోరుకుంటూ TELUGUCINEMAS .IN శుభాకాంక్షలు తెలియజేస్తోంది మెనీ హ్యాపీ రిటర్న్స్! టు చెర్రీ
Post a Comment