రాజమౌళి నెక్స్ట్ మూవీ లో ప్రభాస్ సిక్స్ ప్యాక్..! prabhas six pack in rajamouli movie

   
సునీల్ తాజాగా పూల రంగడు చిత్రంలో సిక్స్ ప్యాక్ బాడీ చూపి అందరిని ఆశ్చర్య పరిచాడు . ఇప్పుడు ప్రభాస్ సిక్స్ ప్యాక్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం. రాజమౌళి దర్సకత్వంలో రూపొందబోయే చిత్రం కోసం ఈ బాడీని రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లా సమయంలో తన బాడీ షేప్ పై దృష్టి పెట్టిన ప్రభాస్ మరోసారి  సిక్స్ ప్యాక్ చూపించేందుకు సిద్దపడుతున్నాడు .  ఇక ఇప్పటికే ప్రభాస్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ప్లాన్ జరిగిపోయినట్టు తెలుస్తుంది.  ఈగ   తరువాత ఈ  సినిమాను వీలయినంత తక్కువ టైంలో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది 
దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ పంజా చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ప్రభాస్-రాజమౌళిల చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ ల వచ్చిన ఛత్రపతి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాని హీరోగా రాజమౌళి తీస్తున్న ఈగ సినిమా దియేటర్లలో సందడి చేయడానికి ముస్తాబు అవుతోంది. 'ఈగ' స్టిల్స్‌ కొన్ని ఈ మధ్యనే విడుదల కాగా ఈ చిత్రంపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఎం ఎం కీరవాణి బాణీలు సమకూర్చిన ఈ సౌండ్‌ ట్రాక్‌ని మార్చి 22న మార్కెట్‌లోకి విడుదల చేస్తారని తెలిసింది. 

read more at telugucinemas.in 

Post a Comment

Previous Post Next Post