
మొన్న చిరు నిన్న చరణ్ నేడు పవన్ అవును త్వరలో రాబోతున్న 'గబ్బర్ సింగ్' సినిమా పవన్ కల్యాణ్ అభిమానులకు ఎన్నో రకాలుగా వినోదాన్ని పంచనుంది. పవన్ కల్యాణ్ హార్స్ రైడింగ్ చేసే దృశ్యాలు కూడా ఇందులో వున్నాయట. కొండవీడు ప్రాంతపు పోలీస్ ఆఫీసర్ గా కనిపించే పవన్ గుర్రంపై దౌడు తీసే సన్నివేశాలు సుపర్బ్ గా వచ్చాయని అంటున్నారు. ఈ దృశ్యాలు ప్రేక్షకులకు ఎంతో థ్రిల్ నిస్తాయని యూనిట్ సబ్యులు అంటున్నారు. గతంలో చిరంజీవి చాలా సినిమాలలో హార్స్ రైడ్ చేశారు. అలాగే, ఆమధ్య వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'మగధీర'లో రామ్ చరణ్ కూడా హార్స్ రైడ్ చేశాడు. సెంటిమెంటుగా ఇవన్నీ హిట్టవడంతో 'గబ్బర్ సింగ్' కూడా ఆకోవలో చేరుతుందని నిర్మాత నమ్మకంతో వున్నారు.
Post a Comment