
నాగార్జున ఇప్పుడు గోవా మీద కన్నేశాడు. ఎందుకనుకుంటున్నారా ... తన వ్యాపారాన్ని విస్తరించడానికి! అవును... గోవాలో ఓ కాసినో (గ్యాంబ్లింగ్ గేమ్స్ తో కూడిన ఎమ్యూజ్ మెంట్ ప్లేస్) ఏర్పాటు చేసే ఆలోచనలో నాగ్ ఉన్నాడని తెలుస్తోంది. నిత్యం దేశ విదేశీ పర్యాటకులతో కళకళలాడే సముద్రతీరం గోవాలో ఈ తరహా వ్యాపారానికి మంచి ఆదరణ ఉండడంతో నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటికే హైదరాబాదులో రెస్టారెంట్ బిజినెస్ లో తనదైన ముద్ర వేసిన ఈ టాలీవుడ్ 'మన్మధుడు', తన బిజినెస్ సామ్రాజ్యాన్ని ఇతర ప్రదేశాలకు కూడా విస్తరించాలనుకుంటున్నాడు . అందులో భాగంగా ముందుగా గోవాను ఎంచుకున్నాడనీ, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రాజక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారనీ నాగ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నాగ్ ఏం చేసినా అది రిచ్ గా, అల్టిమేట్ గా వుంటుంది. ఇప్పుడీ కాసినో కూడా అలాగే ఉంటుందని మనం ఆశించవచ్చు!
Post a Comment