అభిమానులకు మాట ఇచ్చిన నాగార్జున NAGARJUNA PROMISES TO HIS FANS

 

అక్కినేని అభిమానులకు సుభవార్త  అక్కినేని నాగేశ్వరరావు ... నాగార్జున ... నాగ చైతన్యల కాంబినేషన్లో  కృష్ణ వంశీ దర్శకుడిగా ఓ సినిమా రానుందనే ప్రచారం అప్పట్లో బాగా జరిగింది. అయితే అనుకోని కారణాల వలన అప్పుడా ప్రాజక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఆరోజు నుంచి కూడా అభిమానులు ఈ కాంబినేషన్ కి సంబంధించిన సమాచారం కోసమే ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రోజున నెల్లూరు వెళ్లిన నాగార్జున మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం తాను 'శిరిడీ సాయి' చిత్రంలో నటిస్తున్నాననీ ... ఈ సినిమా తరువాత దశరథ్ డైరెక్షన్లో ఓ సినిమా ఉంటుందని చెప్పారు. ఈ రెండు సినిమాల తరువాత  అటు తండ్రితోనూ ... ఇటు కొడుకుతోను కలిసి నటించనున్న సినిమా ప్రారంభమౌతుందని అన్నారు. ప్రస్తుతం ...  తమ కాంబినేషన్లో రానున్న ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్స్ వింటున్నామని ఆయన చెప్పారు. 'ఇష్క్' సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే ఆ సినిమా ఉంటుందనే వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. ఏదేవైనా నాగార్జున చెప్పాడు కాబట్టి ఆ సినిమా వచ్చి తీరుతుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. 

Post a Comment

Previous Post Next Post