
నాగార్జున హీరోగా వీరభద్రం దర్శకత్వంలో 'భాయ్' చిత్రం రూపొందనుందనే వార్తలు కొంత కాలంగా హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. అయితే వీరభద్రం మాటలతో ఇప్పుడీ విషయంలో ఓ స్పష్టత వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు నుంచి ప్రారంభం కానుందనీ ... స్క్రిప్ట్ సిద్ధంగా వుందని దర్శకుడు వీరభద్రం చెప్పారు. 'అహ నా పెళ్లంట' ... 'పూలరంగడు' వంటి విజయాలతో మాంఛి జోష్ మీదున్న వీరభద్రం, 'భాయ్' చిత్రంతో హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున 'శిరిడీసాయి' షూటింగ్లో బిజీగా ఉన్నందువలన, 'భాయ్' సినిమాకి సంబంధించిన ప్లానింగ్ పక్కాగా ఉండేలా చూసుకునే సమయం దొరికిందని వీరభద్రం అంటున్నారు.
మాఫియా నేపథ్యంలోతెరకెక్కనున్న ఈ సినిమాకి ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. పోతే, గతంలో నాగార్జున చేసిన 'డాన్' సినిమా కూడా మాఫియా నేపథ్యంలో తెరకెక్కినదే. ఇక రీసెంట్ గా వచ్చిన 'బిజినెస్ మేన్' ... ప్రస్తుతం తెరకెక్కుతోన్న వెంకటేష్ 'షాడో' కూడా మాఫియా నేపథ్యానికి సంబంధించినవే. ఇప్పుడు మళ్లీ అలాంటి కథతో రానున్న 'భాయ్' కి ప్రేక్షకుల ఆదరణ ఎంతవరకూ లభిస్తుందనేది ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది.
Post a Comment