
మంచు మనోజ్ హీరోగా రూపొందిన 'మిష్టర్ నోకియా' చిత్రం తీరా విడుదల సమయం దగ్గర పడుతుండగా 'మిష్టర్ నూకయ్య'గా పేరు మార్చుకుంది. నోకియా సంస్థనుంచి ఎదురైన సమస్యల కారణంగానే దర్శక నిర్మాతలు ఆ నిర్ణయం తీసుకున్నట్టు ఆ తరువాత చెప్పారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హోలీ రోజున విడుదలైన ఈ సినిమాకి ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. నూకయ్యలో కూడా నోకియో సౌండ్ ఉందంటూ ఆ సంస్థ కోర్టుకి వెళ్లడంతో కొన్ని మల్టీప్లెక్స్ ల్లో ఈ సినిమాని నిలుపుదల చేశారు. ఇంత కష్టపడి జనంలోకి వెళ్లిన 'మిష్టర్ నూకయ్య' మంచి మార్కులు సంపాదించుకోలేక పోయాడు. సినిమాలో అక్కడక్కడా సాగతీత ఎక్కువైందన్న కామెంట్స్ రావడంతో, తిరిగి ఈ సినిమాని రీ ఎడిట్ చేసి కథని మరింత స్పీడ్ గా ప్రెజెంట్ చేస్తున్నామని మనోజ్ అన్నారు. అలాగే ఈ సినిమా పేరును 'మిష్టర్ నూకయ్య ... రీ లోడెడ్ ' గా మార్చి ఈ నెల 16 న గానీ, 17 న గాని మళ్లీ విడుదల చేయనున్నట్టు చెప్పారు. కొత్తగా ముస్తాబై ప్రేక్షకుల ముందుకొస్తోన్నఈ సినిమా అందరినీ అలరిస్తుందని ఆయన చెప్పారు.
Post a Comment