ప్రేక్షకుల ముందుకి మరో జల్సా వస్తోంది కొన్నాళ్ల క్రితం వచ్చిన 'జల్సా' చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించిన పవన్ కల్యాణ్-ఇలియానా జంట మరోసారి జోడీ కట్టనుంది. వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విశేషమేమిటంటే, 'జల్సా' చిత్రానికి దర్శకత్వం వహించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోందనీ, త్రివిక్రమ్-పవన్ స్టయిల్ మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుందనీ అంటున్నారు. బి.వి.యస్.ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ప్రస్తుతం అల్లు అర్జున్ తో తాను చేస్తున్న చిత్రం పూర్తి కాగానే ఈ చిత్రంపై త్రివిక్రమ్ పూర్తిగా దృష్టి పెడతారని అంటున్నారు. అక్టోబర్ నుంచి దీని షూటింగ్ మొదలవ్వచ్చని తెలుస్తోంది.అయితే ప్రేక్షకులు జల్సా చేసుకోవడానికి రెడీ అవ్వలసిందే

Post a Comment