నెలాఖరున వస్తున్న బాలరాజు ఆడి బామ్మర్ధి



డా.శ్రీహరి, ఆర్యన్ రాజేష్, శ్రద్దా ఆర్య కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘బాలరాజు ఆడి బామ్మర్ది’. రామకృష్ణ దర్శకత్వం వహించారు. సుధా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీనివాస్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు నిర్మాత చెప్పారు. ఈ సినిమాలో శ్రీహరి, ఆర్యన్ రాజేష్ పాత్రలు కొత్తగా ఉంటాయి’ అన్నారు.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ముత్యాల రాందాస్ మాట్లాడుతూ “ఇందులో బాలరాజు పాత్రను శ్రీహరి పోషించారు. అతనికి సోదరిగా శ్రద్ధా ఆర్య నటించింది. బామ్మర్దిగా ఆర్యన్ రాజేష్ నటించారు. చక్కటి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు మలచారు” అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ “శ్రీహరి ఇందులో బాలరాజుగా ఓ ఛాలెంజింగ్ పాత్రను పోషించారు. టామ్ అండ్ జెర్రీలా అందరినీ అలరింపజేసే చిత్రమిది.
చక్కటి సిస్టర్ సెంటిమెంట్ ఉంది. ఐదు పాటలతో పాటు ఐదు ఫైట్స్ ఉన్నాయి” అని తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చరణ్‌రాజ్, రఘుబాబు, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, హర్ష తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అగస్త్య, కెమెరా: రాజేంద్ర, కూర్పు: శంకర్, కళ: మురళి, సమర్పణ: సి.వి.రావు, ముత్యాల రాందాస్, నిర్మాత: శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రామకృష్ణ.


Post a Comment

Previous Post Next Post