సశేషం పూర్తి.మార్చి రెండవ వారంలో సశేషం ఆడియో విడుదల



విక్రం శేఖర్ , సుప్రియ జంటగా శ్రీ కిషోర్  దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సశేషం . క్లాప్ బోర్డ్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాతలు శ్రీ కిషోర్, మురళీ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది.  ఈ  చిత్రం ఆడియో మధుర ఆడియో ద్వారా  ఈ నెల రెండవ వారం లో విడుదల కానుంది . వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బం గా హీరో విక్రం శేఖర్ మాట్లాడుతూ తొలిచిత్రంతోనే నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర రావడం సంతోషం గా ఉందని కచ్చితంగా ఈ చిత్రం నటుడిగా, హీరోగా తనకి మంచి గుర్తింపు తెస్తున్దన్నారు . దర్శకుడు శ్రీ కిషోర్ మాట్లాడుతూ ఆద్యంతం సశేషం చిత్రం ఉద్వేగభరితంగా  ఉంటుందని , అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సస్పెంస్స్ థ్రిల్లర్ గా సశేషం చిత్రం రూపొందిందని అన్నారు. నిర్మాత మురళీ కృష్ణ  మాట్లాడుతూ రెగ్యులర్ సినిమాలకు బిన్నంగా సశేషం సినిమా ఉంటుందని , ఈ చిత్రం చాల సంతృప్తి కరంగా వచిందని అన్నారు. ఈ చిత్రం లో నటించిన నటీ నటులకు, పనిచేసిన సాంకేతిక నిపుణులకు సశేషం చిత్రం మంచి గుర్తిపు తెస్తుందని అన్నారు.  ఈ చిత్రానికి ఆర్ట్ శ్రీను , స్టైలింగ్ సూర్య రెడ్డి , మాటలు అనిల్ చోడిసెట్టి, ఎడిటింగ్  సూదన్ మదు, సంగీతం కే.సి.మౌళి, కేమెర సతీష్ , జి.ఎల్.బాబు, పాటలు సదా చంద్ర ,  కధ, స్క్రీన్ ప్లే  బాలాజీ సనాల ,  ఎక్సిక్యూటివ్  ప్రొడ్యూసర్ సిరాజ్ అహ్మద్ , నిర్మాతలు శ్రీకిశోర్ , మురళీ కృష్ణ , దర్శకత్వం శ్రీ కిషోర్ .

Post a Comment

Previous Post Next Post