Home » » భారి రేటు పలికిన ఈగ

భారి రేటు పలికిన ఈగ


 శాటిలైట్ హక్కుల అమ్మకంలో 'ఈగ' రికార్డ్ సృష్టించింది  విడుదలకి ముందే 'ఈగ' సినిమా  సంచలనాలు నమోదు చేస్తూ వస్తోంది. ఇప్పుడదే ప్రత్యేకతను శాటిలైట్ హక్కుల అమ్మకంలోనూ మరో సారి చాటుకుంది. కథాపరంగానూ గ్రాఫిక్స్ పరంగాను ఆదినుంచి ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తూనే వుంది. ఈ కారణంగానే ఈ హక్కులు పొందేందుకు పెద్ద మొత్తంలో డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడ్డారు. దాంతో 5 కోట్ల 50 లక్షలకి ఈ సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది. అగ్ర కథానాయకుల సినిమాలకి జరిగే రేంజ్ లో ఈ సినిమాకి బిజినెస్ జరగడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ స్థాయిలో బిజినెస్ కావడానికి దర్శకుడిగా రాజమౌళి సాధిస్తోన్న సక్సెస్ లే  కారణమని అంటున్నారు. ఓ వైపున విభిన్నమైన కథ ... మరో వైపున గ్రాఫిక్స్ మాయాజాలం ... ఇంకో వైపున సమంతా అందచందాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్న ఈ సినిమా మార్చ్ 22 న ఆడియో వేడుకని జరుపుకోనున్నట్టు తెలుస్తోంది.  

Share this article :