Home » » Raghu Kunche Trendingo Song Launched by Chandra Bose

Raghu Kunche Trendingo Song Launched by Chandra Bose

 నేటి ట్రెండ్ కు తగ్గట్టు "రఘు కుంచె" చేసిన "ట్రెండింగో" సాంగ్ ను  లాంచ్ చేసిన "చంద్ర బోస్"



 మనం ఉదయం లేచిన దగ్గర నుండి మనకు ఎక్కువగా వినిపించే పదం  ట్రెండింగ్..మన నిత్య జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ ట్రెండ్ చేయాలాని తపన పడే మనస్తత్వం మనలో ఉంటుంది. దీనిమీద సెటైరికల్ గా చేసినటువంటి పాటే "ట్రెండింగో".. ఈ పాటకు సంగీత దర్శకుడు రఘు కుంచె. సంగీతం లిరిక్స్, కాన్సెప్ట్, అందించి పాడి నటించటం  విశేషం.ఈ పాటను కె.వి.కె. దర్శకత్వం వహించారు.శ్రీ నందన్  ఇన్ఫ్రా డెవలప్మెంట్  టి.విజయలక్ష్మి నిర్మించిన ఈ పాటను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి సీనియర్ హీరోయిన్ లయ, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, లిరిసిస్ట్ చంద్ర బోస్, దర్శకులు అనిల్ కన్నెగంటి, కరుణ కుమార్, రైటర్ లక్ష్మీ భూపాల్, ముఖ్య అతిధులుగా పాల్గొని ట్రెండింగో సాంగ్ ను విడుదల చేయడం చేసారు.  


నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ.. ఈ  పాటలో ఎక్కువగా ఫన్ ఎలిమెంట్ ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో విషయాలు మనం రోజూ చూస్తూ ఉంటాం..అందులో కొన్ని ట్రెండ్ అవుతాయి..కొన్నింటికి మాత్రం ట్రెండింగ్ అని పేరు పెట్టి దీన్ని ఎలా వైరల్ చేయాలని ప్రతి రోజు తపన పడుతుంటాము. అలాగే ప్రతి రోజు మనకు వినిపించే పదం ట్రెండింగ్. ఇవన్నీ చూసిన తరువాత ఇప్పుడున్న ట్రెండింగ్ మీద ఒక సాంగ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన రావడంతో ఈ పాటకు లిరిక్స్ రాయడం జరిగింది.రాసిన తరువాత  నా ఫ్రెండ్ శ్రీను ద్వారా ఈ సాంగ్ రిలీక్స్ ను శ్రీ నందన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్  టి.విజయలక్ష్మి గారికి వినిపించగా ఈ పాటకు నేను ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు రావడం జరిగింది.ఆ తరువాత అమెరికా వెళ్లిన నాకు అక్కడ ఉండే  కె.వి.కె ఈ పాటను దర్శకత్వం చేస్తానని ముందుకు రావడంతో వరల్డ్ ఫెమస్ టిక్ టాకర్ తో మరియు అభిషేక్  తో కలసి దీన్ని అమెరికా లోని డాలస్ నగరంలో షూట్ చేయడం జరిగింది.మేము చేసిన "ట్రెండింగో" పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.


సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్ మాట్లాడుతూ..రఘు అంటే నాకు చాలా ఇష్టం. తను చేసిన ఈ పాట చాలా బాగుంది. ఇది అన్నీ భాషల్లో తీయగలిగే పాట..అన్నీ తానై  చేసిన  ఈ పాట పెద్ద ట్రెండింగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి పాటకు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించడానికి ముందుకు వచ్చిన విజయలక్ష్మి  గారికి నా ధన్యవాదాలు.ఈ రోజు ఈ సాంగ్ లాంచ్ కు వచ్చిన చంద్రబోస్ తెలుగు వారు గర్వించె  విధంగా పాటలు రాస్తున్నాడు. ఇప్పుడు తన ద్వారా మన తెలుగు సినిమా ఆస్కార్ కు వెళ్లడం ఎంతో సంతోషంగా ఉంది. అన్నారు.


ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ..ఆస్కార్ రావాలని  ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అభినందిస్తుంటే  చాలా సంతోషంగా ఉంది.వారికీ నా ధన్యవాదాలు.రఘు అన్న నేను అవకాశాలు కోసం ఆటోలో తిరిగే వాళ్లము. ఇప్పుడు ఈ అన్నతో సన్మానం చేసుకోవడం చాలా సంతోషం గా ఉంది. "ట్రెండింగ్" సాంగ్ చాలా బాగుంది. ఈ పాట చెయ్యడానికి ముందుకు వచ్చిన విజయలక్ష్మి గారికి  ధన్యవాదాలు. మీరు చేసిన  "ట్రెండింగో" పాట బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నారు.


సీనియర్ హీరోయిన్ నటి లయ మాట్లాడుతూ.. సినిమాలు మానేసిన నేను చాలా ఏళ్ల తరువాత.   " ట్రెండింగో" సాంగ్ లాంచ్ కు రావడం చాలా సంతోషంగా ఉంది.  రఘు కుంచె   నాకు ఎప్పటినుండో పరిచయం. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ , లిరిక్స్, కాన్సెప్ట్, డ్యాన్స్ ఇలా అన్నీ తానే అయి చాలా మంచి సాంగ్ చేశాడు.ఈ పాట బిగ్ ట్రెండింగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత  శ్రీ నందన్  ఇన్ఫ్రా డెవలప్మెంట్  టి.విజయలక్ష్మి..మాట్లాడుతూ... బేసిగ్ గా నేను టీచర్ నాకు సినిమా ఇండస్ట్రీ తో ఎలాంటి పరిచయాలు  లేవు. అయితే అనుకోకుండా శ్రీను గారి ద్వారా నాకు రఘు కుంచె గారు పరిచయం అవ్వడం. తను చెప్పిన ఈ పాట గురించి చెప్పడంతో  నచ్చి ఈ సాంగ్ చెయ్యడం జరిగింది. చూసిన ప్రతి ఒక్కరూ సాంగ్ బాగుందని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా "ట్రెండింగో" పాటను అందరూ ఆదరించి బిగ్ హిట్ చెయ్యాలి అన్నారు.


దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ.. ఒక తెలుగు పాటకు అంతర్జాతీయంగా  పేరు తెచ్చిన చంద్రబోస్ గారికి ధన్యవాదములు. రఘు కుంచె చేసిన ." ట్రెండింగ్" సాంగ్ చాలా బాగుంది. తను ఇలాగే ఇంకా అనేక పాటలు చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.


డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ..హిందీలో మాత్రమే ఇలాంటి ఆల్బమ్స్ మాత్రమే వస్తున్నాయి తెలుగులో ఎందుకు రావడం లేదు అనుకునే వాన్ని. అలాంటిది ఇప్పుడు తెలుగులో ఇలాంటి ఆల్బమ్ రావడం చాలా సంతోషంగా ఉంది.1995 నుండి రఘు తో ప్రయాణం. ఈ పాటకు అన్నీ తనే  అయ్యి చేయడం గొప్ప విషయం.  ఈ పాట బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 


 "శ్రీని ఇన్ఫ్రా" శ్రీను మాట్లాడుతూ..రఘు అన్న మంచి సాంగ్ చేస్తున్నాడని విజయలక్ష్మి గారికి చెప్పడంతో వెంటనే ఈ పాట చెయ్యడానికి ముందుకు రావడం జరిగింది. దాంతో రఘు అన్న అమెరికా వెళ్లి ఈ సాంగ్ చేసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఈ సాంగ్ చూసిన తరువాత టైటిల్ కు తగ్గట్టే "ట్రేండింగో" సాంగ్ కచ్చితంగా ట్రెండింగ్ అవుతుంది.. అన్నారు.


నటీ నటులు 

రఘు కుంచె, అభిషేక్ తదితరులు..


సాంకేతిక నిపుణులు:

బ్యానర్ : శ్రీ నందన్  ఇన్ఫ్రా డెవలప్మెంట్ 

నిర్మాత ::టి.విజయలక్ష్మి 

డైరెక్టర్ :  కె. వి. కె.

కెమెరామెన్ : ఉదయ్ వంశీ,

సంగీతం, లిరిక్స్,కాన్సెప్ట్ : రఘు కుంచె.

ఎడిటర్ : సాయి కృష్ణ 

కోరియోగ్రఫీ : సందీప్ నాయర్, చరణ్  & కె. వి. కె 

పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్


Share this article :