Home » » Bhagath Singh Nagar Movie Song Launched

Bhagath Singh Nagar Movie Song Launched

 *భగత్ సింగ్ నగర్' చిత్రం నుండి 'యుగ యుగమైన తరగని వేదన' ఈ పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్* 



గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ ,ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో  వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం "భగత్ సింగ్ నగర్" . తెలుగు మరియు తమిళ  బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా లోని యుగ యుగమైన తరగని వేదన'  పాటను  చిత్ర యూనిట్  విడుదల చేశారు  


 *ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు మాట్లాడుతూ* ... ఇంతకు ముందు మేము విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్ర యూనిట్ సమక్షంలో ఈ పాటను విడుదల చేస్తున్నాము. ప్రొడ్యూసర్ గా నాకు ఇంత మంచి టీమ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ గానీ ఆర్టిస్టులు గానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక ఫ్రెండ్లీ నేచర్ లో కమిట్మెంట్ ప్రకారంగా చాలా ఇంట్రెస్ట్ తో ఈ సినిమా చేశారు. నేను లండన్ ఉన్న కూడా  నాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ నాకు తెలియజేస్తున్న దర్శకుడికి నా ధన్యవాదాలు. ఇంతకుముందు మేము చేసిన పాట లాగే ఈ ఈ పాట కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము.మరిన్ని విషయాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు.


 *చిత్ర దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ* ... ఇండస్ట్రీ ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఏంతో ఆవసరం.మా లాంటి కొత్తవారికి అవకాశం కల్పించే నిర్మాత దొరకడం మేము అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఏది అడిగినా కాదనకుండా తెలుసుకుని వెంటనే మాకు కావలసిన ఏర్పాట్లు చేసేవారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. త్వరలో ఈ నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.



 *నటీనటులు* : 

విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్. 


 *సాంకేతిక నిపుణులు :* 

ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి,

ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్,

స్టిల్స్ : మునిచంద్ర,

నృత్యం : ప్రేమ్-గోపి,

నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి,

ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,

కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.

పి ఆర్ వో : మధు వి ఆర్, తేజు సజ్జా.


Share this article :
 
Copyright © 2015. TeluguCinemas.in | Telugu Cinemas - All Rights Reserved
Thank You Visit Again