Home » » Ms Raju Dirty Hari Releasing on December 18

Ms Raju Dirty Hari Releasing on December 18

 ఈ చిత్రం చూసాక ఇది ఖచ్చితంగా ఎం.ఎస్. రాజు 'డర్టీ హరి' నే అని అంటారు - ఎం.ఎస్. రాజు

—————————————————-ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ హీరో హీరోయిన్లు.


చిత్ర దర్శకుడు ఎం. ఎస్. రాజు మాట్లాడుతూ, "ట్రైలర్ లో మీరు విన్న సౌండ్ నేను ఎలా కావాలని అనుకున్నానో అలాగే వచ్చింది. ఒక డైరెక్టర్ కి ఏం కావాలో ఎలా కావాలో అర్ధం చేసుకునే రాబిన్ లాంటి అద్భుతమైన టెక్నీషియన్ ఈ చిత్రంతో నాకు దొరికాడు. ఈ చిత్రంలో పని చేసిన ఎడిటర్, కెమెరామన్, ఆర్ట్ డైరెక్టర్ అందరూ నాతో చాలా బాగా కో-ఆర్డినేట్ చేశారు. సిమ్రత్ కౌర్ & శ్రవణ్ రెడ్డి వాళ్ళ రోల్స్ కోసం చేసిన గ్రౌండ్ వర్క్ చాలా ఇంప్రెసివ్, భవిష్యత్తులో చాలా పెద్ద స్టార్స్ అవుతారు. ఈ నెల 18 న ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT ద్వారా మా చిత్రం విడుదల కానుంది. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడానికి  7997666666 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. చిత్రం చూసాక ఎవరు ఎలాంటి ప్రశ్నలు వేసినా సమాధానమివ్వడానికి నేను సిద్ధం. విమర్శిస్తున్న వారందరు ఆ రోజు చెబుతారు, ఇది ఎం.ఎస్. రాజు చిత్రమే బూతు చిత్రం కాదని" అన్నారు.


ఫ్రైడే మూవీస్ ఆప్ అధినేత మాట్లాడుతూ "మా ఆప్ ని ఎం.ఎస్. రాజు డర్టీ హరి చిత్రంతో లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ చూసాక చిత్రంపై అంచనాలతో పూర్తి చిత్రం చూసాం, చాలా బాగా నచ్చింది. పేరుకి తగ్గట్టుగా మా ఆప్ ద్వారా ప్రతి శుక్రవారం ఒక చిత్రాన్ని విడుదల చేయాలన్నది మా ఉద్దేశం. మారుమూల ఊళ్లలో ఉన్నవారు కూడా ఆప్ వాడుకునేలా మిస్డ్ కాల్ ప్రక్రియ పెట్టాం. చిత్రం మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా." అన్నారు.


చిత్ర నిర్మాతల్లో ఒకరైన  వంశీ కారుమంచి మాట్లాడుతూ, "చిత్రం చూసిన వెంటనే మాకు నచ్చేసింది, ఆ వెంటనే కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ చిత్రం ఎం.ఎస్. రాజు గారి డైరెక్షన్ కెరీర్ లో స్పెషల్ , అలాగే ఫ్రైడే మూవీస్ వారు ఈ చిత్రంతోనే లాంచ్ అవుతున్నారు. గూడూరు శివరామ కృష్ణ గారికి మొదటి చిత్రం, హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ వారికి మొదటి చిత్రం, నటీ నటులకి కూడా మొదటి చిత్రమిది. కానీ మా అందరికి ఈ చిత్రం పై నమ్మకముంది. ఎం.ఎస్. రాజు గారు చెప్పినట్టు ఇది అందరికీ నచ్చే న్యూ ఏజ్ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్. చిత్రం 18 న విడుదలయ్యాక సక్సెస్ మీట్ లో కూడా అందరూ ఇంతే పాజిటివ్ గా మాట్లాడుతారని నమ్మకంగా ఉంది." అన్నారు


మ్యూజిక్ డైరెక్టర్ మార్క్.కే.రాబిన్ మాట్లాడుతూ, " పోస్టర్ లో ఉన్నట్టుగా అందరూ అనుకున్నట్టుగా కాకుండా 20 % మాత్రమే రొమాన్స్ మిగితాదంతా లైఫ్ గురించే ఉంటుంది. మంచి సర్ప్రైస్ తో ఉన్న చిత్రమిది. శ్రవణ్ & సిమ్రాన్ కి చాలా మంచి భవిష్యత్తుంది, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ వయసులో కూడా ఎం.ఎస్. రాజు గారిలో ఉన్న ఎనర్జీ నాతో సహా చాలా మందికి ఇన్స్పిరేషనల్. చిత్ర సభ్యులందరికి ధన్యవాదాలు, మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అన్నారు.


హీరోయిన్ సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ " ఎం. ఎస్. రాజు గారి చిత్రం అనగానే ఖచ్చితంగా కథ వినాల్సిందే అని హైదరాబాద్ కి వచ్చాను, చాలా బాగా నచ్చింది. కానీ కొన్ని సీన్స్ కోసం మొదట్లో ఇబ్బంది పడ్డా కానీ ఎం.ఎస్. రాజు గారు, శ్రవణ్ సహాయంతో చాలా సులువుగా చేసేశాం. అందరి సహకారంతో ఈ జర్నీ చాలా అందంగా అద్భుతంగా అనిపించింది. చిత్రం చూసాక జాస్మిన్ ని అంటే నా రోల్ ని అలాగే డర్టీ హరిని చాలా ఇష్టపడతారు." అన్నారు.


హీరో శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ " ఎం.ఎస్. రాజు గారి కథ వినగానే చాలా ఎక్సయిట్ అయ్యా. రియల్ లైఫ్ కి దగ్గరగా రాముడికి రావణుడికి మధ్యన ఉండే పాత్రని చాలా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ గారు. ఇప్పటివరకు ఆయన చేయని జానర్ లో చేసినా యూత్ చాల కనెక్ట్ అయ్యేలా తీశారు. ఈ ఏజ్ లో కూడా ఆయనకీ సినిమాపై ఉన్న పట్టుదల మా అందరికీ చాలా స్ఫూర్తినిచ్చింది. సిమ్రత్ అద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో అన్ని భావోద్వేగాలు ఉంటాయి. మా చిత్రానికి మంచి సపోర్ట్ ఇచ్చిన హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ వారికి, నిర్మాతలకి, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. మా చిత్రాన్ని ఈ నెల 18  న ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT లో ఖచ్చితంగా చూడండి" అన్నారు."


శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ, రోషన్ బషీర్, అప్పాజీ అంబరీష, సురేఖావాణి, అజయ్, అజీజ్ నాజర్, మహేష్ ఈ చిత్ర ప్రధాన తారాగణం.


ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: మార్క్.కే.రాబిన్, 

ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్,

డీఓపీ: ఎం.ఎన్ .బాల్ రెడ్డి,

ఎడిటర్: జునైద్ సిద్ధిఖి,

సమర్పణ: గూడూరు శివరామకృష్ణ,

నిర్మాతలు: గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి,

రచన - దర్శకత్వం: ఎం.ఎస్.రాజు.


Share this article :