Latest Post

Santhosham South India Film Awards Held Grandly

 కన్నుల పండువగా 21వ “సంతోషం సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డ్స్”

 


తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందజేస్తూ వస్తున్న  “సంతోషం అవార్డ్స్” కి మాత్రం ఓ సుస్థిర స్థానం ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ అవార్డులు కార్యక్రమం ఘనంగా జరుపుతూ వస్తున్న సంతోషం సురేష్ కేవలం తెలుగు మాత్రమే కాదు సౌత్ ఇండియన్ భాషలు అన్నిటికీ అవార్డులు అందిస్తూ వస్తున్నారు. ఇక ఈసారి కూడా అదే విధంగా సంతోషం పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి ప్రతిష్టాత్మకంగా అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 21వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో సుమారు పన్నెండు గంటల పారు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరిగాయి. సౌత్ ఇండియాలోని నాలుగు భాషల సినిమాలకు విభాగాల వారీగా అవార్డులు అందించారు. ఇక ఈ వేడుకలో సింగర్స్ మంగ్లీ, ఇంద్రావతి చౌహాన్ తమ గాత్రంతో ఆకట్టుకోగా అలనాటి నటి జయమాలిని కూడా రెండు స్టెప్పులు వేసి అలరించారు. ఇక ఊర్వశి రౌతేలా, వరినా హుస్సేన్ తమదైన స్టైల్ లో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆర్పీ పట్నాయక్ కూడా కొన్ని పాటలు పాడి అలరించారు. ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సింగర్ పీ సుశీల డాన్స్ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. సౌత్ ఇండియా సెలబ్రిటీస్  ఎంతో మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో  ముఖ్యంగా వాణిశ్రీ, రోజారమణి, దర్శకుడు సుకుమార్, బుచ్చిబాబు, ప్రకాష్ రాజ్, అల్లు అరవింద్,   కవిత, శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, రాజేంద్రప్రసాద్, కృష్ణంరాజు సతీమణి శ్యామల, మురళీమోహన్, శేఖర్ మాస్టర్, సుధా, జయమాలిని, శ్రద్దా శ్రీనాథ్, కల్పిక, నక్షత్ర, శ్రీకాంత్, ప్రదీప్ రంగనాథన్, అడివి శేష్, బెనర్జీ, బాబు మోహన్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాదాల రవి, కాశీ విశ్వనాథ్, దేవిశ్రీ ప్రసాద్, నందమూరి రామకృష్ణ, విజయేంద్ర ప్రసాద్, బుర్రా సాయి మాధవ్, వంటివారు ఎందరో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

100 Million Views For Iravatham

 100 మిలియ‌న్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూయింగ్ మినిట్స్ తో హాట్ స్టార్ తెలుగు టాప్ ఫైవ్ లోనే తిష్ట వేసిన "ఐరావతం"



ఒక చిన్న సినిమా కి , బలమైన కథనానికి దక్కిన సత్కారం 100 మిలియన్స్ అండ్ ఫిఫ్టీ థౌసండ్ వ్యూయింగ్ మినిట్స్.



ఎస్తేర్ నోర్హ, తన్వి నెగ్గి, అమర్ దీప్, అరుణ్, సప్తగిరి నటించిన ఐరావతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్  లో ఊహించని ఆదరణ దక్కించుకుంది.


ఇండియా లోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నుంచి రీసెంట్ గా వచ్చి సైలెంట్ గా హిట్ కొట్టిన "ఐరావతం" ఈ డీసెంట్ ఫ్యూజన్ డ్రామా నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. శ్లోక అనే బ్యూటీషియన్ కి బర్త్ డే రోజు ఒక వైట్ కెమెరా గిఫ్ట్ గా వస్తుంది. అప్పటి నుంచి ఆమె లైఫ్ తలక్రిందులు అవుతుంది. బర్త్ డే వీడియో లు తీస్తే డెత్ డే వీడియో లు వస్తుంటాయి. అందులో ఇష్యూస్ డీకోడ్ చేసే క్రమంలో ఎన్నో  రహస్యాలు బయట పడుతుంటాయి. ఆ రహస్యాల అల్లికే ఐరావతం అనే తెల్ల కెమెరా కథ. కథా గమనంలో మనం ఒకటి ఊహిస్తే క్షణ క్షణానికి అది మారిపోతుంటుంది.మ‌న క‌థానాయ‌కుడు పెళ్లి చేసుకోవాల‌నుకున్న‌ పెళ్లి కూతురు  త‌న ప్రేమికుడు వెళ్లిపోతుంది. తీరా ఆ క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంద‌నేదే సినిమా. గుణశేఖర్ శిష్యుడు సుహాస్ మీరా ఈ మూవీ ని స్టోరీ మూడ్ ఫ్లో కి అనుగుణంగా చిత్రీకరించారు.


నూజివీడు టాకీస్ పై రేఖ పలగని సమర్పణ లో రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మాత లుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 


న్యూ యేజ్ థ్రిల్లర్  "ఐరావతం" విశేష‌మైన ఆడియెన్స్ ఆద‌ర‌ణ పొందుతూ ఒక నెలలో 100 మిలియన్  అండ్ ఫిఫ్టీ తౌసండ్  వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది.  దీనికి వ‌స్తోన్న హ్యూజ్ రెస్పాన్స్‌తో  టీమ్ అంతా క‌ల‌సి సక్సెస్ పార్టీని సెల‌బ్రేట్ చేసుకుంది. త్వరలోనే ఐరావతం ద్విముఖం (పార్ట్ 2) తీయబోతున్నారని తెలుస్తుంది.

  ఫ్యామిలీతో క‌లిసి తెల్ల కెమెరా చేసిన మాయలు చూసి ఎంజాయ్ చేయాల‌నుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో  ప్ర‌సారమ‌వుతున్న "ఐరావతం" స్ట్రీమ్ చెయ్యాలి.


సాంకేతిక వ‌ర్గం:


నిర్మాత‌లు: రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట

సమర్పణ: రేఖ పలగాని 

కథ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం : సుహాస్ మీరా,

 సినిమాటోగ్రాఫ‌ర్‌: ఆర్ కె వెల్లపు

 సాంగ్స్ మ్యూజిక్: సత్య కశ్యపు,

రి రికార్డింగ్: కార్తిక్ కడగండ్ల,

లిరిక్స్‌: పూర్ణాచారి, 

ఎడిటింగ్‌:  సురేష్ దుర్గం,

 పి ఆర్ ఓ : మధు

Rajayogam Success Meet

 ఈ చిత్రం చూసి నవ్వకుండా ఉండగలిగితే వాళ్ళకు లక్ష రూపాయల బహుమతి ఇస్తాం - సక్సెస్ మీట్ లో రాజయోగం చిత్రబృందం



సాయి రోనక్, అంకిత సాహా, బిస్మి నాస్ హీరో హీరోయిన్లుగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా "రాజయోగం" . ఈ చిత్రాన్ని శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మించారు. దర్శకుడు రామ్ గణపతి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ తెచ్చుకుని ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గణపతి మాట్లాడుతూ...మా సినిమాకు థియేటర్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక్క క్షణం కూడా స్క్రీన్ నుంచి చూపు తిప్పుకోకుండా చూస్తున్నామని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇది నా మొదటి సినిమా అయినా, అనుభవజ్ఞుడైన దర్శకుడిలా తెరకెక్కించానని అనే ప్రశంసలు వస్తున్నాయి. ఇంకా సినిమా చూడని వారు త్వరగా చూసేయండి. ఎంత మంచి సినిమా అయినా మూడు రోజులకు మించి థియేటర్లలో ఉంచడం లేదు. సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ చిత్రం చూసి నవ్వకుండా ఉండగలిగితే వాళ్ళకు లక్ష రూపాయల బహుమతి ఇస్తాం అని మా నిర్మాతలు ప్రకటించారు అంటే మాకెంత నమ్మకమో మీరు అర్థం చేసుకోండి అన్నారు.


హీరో సాయి రోనక్ మాట్లాడుతూ...సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మేము పడిన కష్టానికి ఫలితం దక్కింది అనిపిస్తోంది. అయితే నా కంప్లైంట్ ఒక్కటే. మంచి చిత్రానికి కూడా థియేటర్స్, షోస్ దొరకడం లేదు. ప్రేక్షకులు చూడాలని అనుకున్నా, ఆ టైమ్ కు షోస్ ఇవ్వకుంటే ఎలా చూస్తారు. నా లాంటి కొత్త హీరోలు, దర్శకులు ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చాం. చేసిన మంచి సినిమాలకైనా థియేటర్ల పరంగా సపోర్ట్ దొరక్కుంటే ఎలా. రాజయోగం లాంటి మంచి చిత్రాలను ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా. అన్నారు.


నాయిక అంకిత సాహా మాట్లాడుతూ...రాజయోగం థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. కాబట్టి చూడని వారు తప్పకుండా వెళ్లండి. ఓటీటీలో వచ్చేవరకు వేచి చూడకండి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో మా సినిమా మీకు కావాల్సినంత వినోదాన్ని ఇస్తుంది. అని చెప్పింది.


నటుడు తాగుబోతు రమేష్ మాట్లాడుతూ...దర్శకుడు రామ్ గణపతి యాక్షన్, కామెడీ, రొమాన్స్ వంటి ప్రేక్షకులు ఇష్టపడే అంశాలతో సినిమాను రూపొందించాడు. ఆయనకు సినిమా అంటే ప్యాషన్. అందుకే విదేశాల్లో పనిచేసే కెరీర్ వదులుకుని ఇండస్ట్రీకి వచ్చాడు. మంచి ప్యాడింగ్ ఉన్నారు. నేనూ శకలక శంకర్ సినిమాకు ఫన్ తీసుకొచ్చాం. అన్నారు.


నటుడు శకలక శంకర్ మాట్లాడుతూ...రాజయోగం చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రామ్ గణపతి తెరకెక్కించాడు. ఇటీవల ఓ పెద్ద మనిషి గాలివాటానికి సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ అయిపోతారు అని అన్నాడు. అది తప్పు. ఎంతో కష్టపడితే గానీ ఆ స్థాయికి చేరుకోలేం. ఆయన ఎందుకు ఆ మాటలు అన్నాడో ఆలోచించుకోవాలి. అన్నారు.

Young sensation Naveen Polishetty’s Hilarious video On Movie Updates

Watch: Young sensation Naveen Polishetty’s Hilarious video On Movie Updates 



Naveen Polishetty is one of the best self made actors right now in the country.  He scored consecutive blockbusters with Agent Sai Srinivasa Athreya , Chhichhore and Jathi Ratnalu. But there’s been no update on his next film. 


Telugu netizens have been asking Naveen for an update on his next and he has now released a hilarious video in this context. 


In the funny video, Naveen is seen having funny conversations with commoners where they ask him about his next film. Naveen finds himself in funny situations while he’s asked to give an update on his next.



But funnily enough, we don’t quite get a real update on his next. But it’s confirmed the shooting is almost done . And more Promotional updates are going to start. 


Naveen is known to take time and deliver high quality films . He wished his fans Happy new year and promised non stop entertainment in theatres soon . 

Action Choreographers Ram Laxman Interview About Waltair Veerayya

 చిరంజీవి గారి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి' యాక్షన్ సీక్వెన్స్ లు పవర్ ఫుల్ గా వుంటాయి : యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్



ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో 'వాల్తేరు వీరయ్య', నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో 'వీరసింహారెడ్డి' చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదలౌతుండగా, 'వీరసింహారెడ్డి' జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ గా రూపొందిన 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' చిత్రాలకు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల విశేషాలని పంచుకున్నారు. 



మీ యాక్షన్ ప్లాన్ ఎలా వుంటుంది.. యాక్షన్ ని ఎలా డివైడ్ చేసుకుంటారు ? 

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్:  యాక్షన్ ఐడియాలు ఇద్దరిలో ఎవరికైనా రావచ్చు. మా అదృష్టం ఏమిటంటే ఇద్దరం వున్నాం కాబట్టి రెండు ఆప్షన్స్ ని డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకెళతాం. అందులో ఒక ఆప్షన్ డైరెక్టర్ గారికి నచ్చుతుంది. మేము ఇలానే ప్లాన్ చేసుకుంటాం.


ఇప్పుడు ప్రతి ఫైట్ కి కాన్సెప్ట్ వుంటుంది కదా ? 

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: ఫైట్ కి కాన్సెప్ట్ ఉండాల్సిందే. లేకపోతే ఫైట్ కి పరిపూర్ణత రాదు. ఫైట్ అనేది ఎప్పటినుండో ఉన్నప్పటికీ ప్రేక్షకుడికి బోర్ కొట్టదు. ఒక ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్, క్యారెక్టరైజేషన్, కొత్తదనం ని యాడ్ చేసి ఒక కాన్సెప్ట్ గా ఫైట్ ని కంపోజ్ చేయడం వలనే థియేటర్ లో ప్రేక్షకులు విజల్స్, చప్పట్లు కొట్టిమరీ ఎంజాయ్ చేస్తారు. క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ ప్రకారం కూడా యాక్షన్ డిజైన్ చేయాలి. వీరసింహారెడ్డిలో బాలయ్య బాబు గారు చైర్ లో కూర్చుని వుంటారు. ఎదురుగా రౌడీలు వస్తుంటారు. బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ ప్రకారం.. ఈ రౌడీలని కూడా నిల్చునికొట్టాలా ? అనే ఆలోచన వచ్చింది. దీంతో బాలయ్య బాబు గారు చైర్ లో కూర్చునే ఒక పవర్ ఫుల్ ఫైట్ ని కంపోజ్ చేశాం. చైర్ లో కూర్చునే ఫైట్ చేయొచ్చు అనే  మూడ్ చాలా అద్భుతంగా క్రియేట్ అయ్యింది. అది బాలయ్య బాబు గారి క్యారెక్టరైజేషన్ లో వున్న మ్యాజిక్. 


వీరసింహా రెడ్డిలో చైర్ ఫైట్ లా..వాల్తేరు వీరయ్యలో కాన్సెప్ట్ ఫైట్ ఏమిటి ? 

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: వాల్తేరు వీరయ్యలో ఇంటర్వెల్ సీక్వెన్స్ చేశాం. లుంగీ కట్టుకొని, శ్రీకాకుళం యాస మాట్లాడుతూ అందరితో సరదాగా కలిసిపోయే చిరంజీవి గారు.. ఇంటర్వెల్ లో సడన్ గా రెండు గన్స్ పట్టుకొని స్టయిలీష్ గా కనిపిస్తారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది. అలాగే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు- శ్రుతి హాసన్ మధ్య ఒక సరదా ఫైట్ కూడా కంపోజ్ చేశాం. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. 


వాల్తేరు వీరయ్య ఇంటర్వెల్ ఎపిసోడ్ చేయడానికి ఎన్ని రోజుల పట్టింది ? 

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: 15 రోజులు పట్టింది. కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు ఎన్ని రోజులైన అనుకున్నది సాధించే వరకూ పని చేయాల్సిందే. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు చెప్పాలి. సినిమాని ఎంతగానో ప్రేమిస్తారు. ఖర్చు గురించి వెనకాడరు. ఎక్కడా రాజీ పడకుండా సినిమాలని నిర్మిస్తారు. 


బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డి ఇంటర్వెల్ ఫైట్ ఎలా వుంటుంది ? 

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: వీరసింహా రెడ్డి ఇంటర్వెల్ ఫైట్ టర్కీలో చేశాం. అక్కడ భారీగా ఖర్చయ్యింది. ఫైట్ చాలా పవర్ ఫుల్ గా వుంటుంది. 


చిరంజీవి గారి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి' సినిమాలు సంక్రాంతి వస్తున్నాయి. ఇద్దరి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వుంటాయి. అభిమానులు అంచనాలు అందుకునే విధంగా రెండు సినిమాల్లో యాక్షన్ ని ఎలా బ్యాలెన్స్ చేశారు ? 

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: చిరంజీవి గారి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి' రెండు భిన్నమైన కథలు. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని రెండు భిన్నమైన క్యారెక్టరైజేషన్స్, బాడీ లాంగ్వేజ్ రాసుకున్నారు. రెండు డిఫరెంట్ గా వుండటం వలన క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు యాక్షన్ కంపోజ్ చేయడం జరిగింది. 


చిరంజీవి గారి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి'లో ఎమోషన్ ఎలా వుంటుంది ? 

బాలకృష్ణ గారి వీరసింహా రెడ్డిలో ఎమోషనల్ ఇంటర్వెల్ బ్యాంగ్ చూస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టాల్సిందే. మేము స్పాట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నాం. అలాగే వాల్తేరు వీరయ్యలో అన్నయ్య, రవితేజ గారి మధ్య ఒక ఎమోషనల్ డ్రామా వుంటుంది. అన్నయ్య అద్భుతంగా చేశారు. ఇదీ కన్నీళ్లు తెప్పిస్తుంది. 


ఈ మధ్య పాటలో కూడా యాక్షన్ కంపోజ్ చేస్తున్నారు కదా ? ఈ ట్రెండ్ ని ఎలా చూస్తారు ? 

రామ్ లక్ష్మణ్ మాస్టర్స్: ఇది మాకు సహాయపడే ట్రెండ్. పాటకు ఫైట్ కంపోజ్ చేయడం మాకూ ఒక సవాల్ గా కొత్తగా వుంటుంది.


ఆల్ ది బెస్ట్ 

థాంక్స్

NBK108 First Schedule Completed

 నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి, షైన్ స్క్రీన్స్ #NBK108 మొదటి షెడ్యూల్‌ పూర్తి



గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, సక్సస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిల క్రేజీ ప్రాజెక్ట్ #NBK108 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వేసిన భారీ జైలు సెట్‌లో మాసీవ్ యాక్షన్ సీక్వెన్స్‌తో తాజాగా టీమ్ మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కి వెంకట్‌ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ షెడ్యూల్‌ లో బాలకృష్ణ, శరత్ కుమార్ తో పాటు మరికొందరు ఆర్టిస్ట్ లపై కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. ఈ సెట్ లోనే #NBK108 యూనిట్ నూతన సంవత్సర వేడుకలని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.


షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడూ పోషించిన పాత్రలో ఇందులో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మార్క్ మాస్ అండ్ యాక్షన్, అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్ వుండబోతున్నాయి. బాలకృష్ణ స్టార్‌డమ్‌ని దృష్టిలో పెట్టుకుని అనిల్ రావిపూడి ఓ పవర్‌ఫుల్ కథను రాశారు.


ఈ చిత్రంలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. #NBK 108లో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్ గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. యాక్షన్‌ పార్ట్‌కి వి వెంకట్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.


తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, శరత్ కుమార్


సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి

నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ

బ్యానర్: షైన్ స్క్రీన్స్

సంగీతం: ఎస్ థమన్

డీవోపీ:  సి రామ్ ప్రసాద్

ఎడిటర్: తమ్మి రాజు

ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్

ఫైట్స్: వి వెంకట్

పీఆర్వో వంశీ-శేఖర్

Veera Simha Reddy Making Video Out

 Nandamuri Balakrishna, Shruti Haasan, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Making Video Out



As revealed by mass director Gopichand Malineni during the song launch of Maa Bava Manobhavalu Debbathinnayi, the pre-release event of Veera Simha Reddy starring God of masses Natasimha Nandamuri Balakrishna will be held in Ongole on January 6th. On the same day, the film’s theatrical trailer will be launched.


Meanwhile, the film’s making video has been released. Although Veera Simha Reddy will be high on action, the atmosphere on set was very pleasant. The grandeur in the making of the movie can be witnessed in the making video. The team constructed huge sets and action episodes were shot impressively.


There is an episode where Balakrishna gives a stern gaze and then gives a serious warning, and S Thaman’s background score for the same is terrific. Balakrishna’s son Mokshagna, and his daughters Brahmini and Tejaswini also paid a visit to the sets.


It’s a dream project for Gopichand Malineni who is a die-hard fan of Balakrishna. Veera Simha Reddy is not completely an actioner, as the movie will have family emotions in right proportions.


The film stars an ensemble cast including Duniya Vijay and Varalaxmi Sarathkumar. Naveen Yerneni and Y Ravi Shankar are producing the film, while acclaimed writer Sai Madhav Burra has provided dialogues.


Rishi Punjabi is taking care of the cinematography, while National Award-Winning craftsman Navin Nooli is handling editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film. Ram-Lakshman duo and Venkat are the fight masters.


Veera Simha Reddy is gearing up for Sankranthi release on January 12, 2023.


Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar, Chandrika Ravi (special number) and others.


Technical Crew:

Story, Screenplay & Direction: Gopichand Malineni

Producers: Naveen Yerneni, Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

Music Director: Thaman S

DOP: Rishi Punjabi

Editor: Navin Nooli

Production Designer: AS Prakash

Dialogues: Sai Madhav Burra

Lyrics: Ramajogayya Sastry

Fights: Ram-Lakshman, Venkat

CEO: Chiranjeevi (Cherry)

Co-Director: Kurra Ranga Rao

Executive Producer: Chandu Ravipati

Line Producer: Bala Subramanyam KVV

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Vamsi-Shekar

From Skratch Ep1: Re-Inventing The Wheel, Sneak Peek Into The World Of Project - K

 From Skratch Ep1: Re-Inventing The Wheel, Sneak Peek Into The World Of Project - K



Rebel Star Prabhas’ futuristic film Project K under the direction of creative director Nag Ashwin is the highest-budgeted movie ever in Indian cinema. Director Nag Ashwin took special care on script and other pre-production formalities as well. He even made a public appeal to Anand Mahindra, requesting automobile technology from his business Mahindra Group for Project K. The movie needed Mahindra Group's assistance in developing future automobiles for the film and Anand Mahindra is lending full support.


As a New Year treat, the makers released episode 1 of From Skratch: Re-inventing the wheel, which shows the process undergone to make a wheel. Of course, it’s not a regular wheel. The fun part is the team made a mockery of Nag Ashwin for his enthusiasm to design and make the wheel. But only he knows the importance of it. Priyanka Dutt’s involvement can also be noticeable in the video. There is much more to come in the series of From Skratch.


Big B Amitabh Bachchan is playing a lengthy and significant role in the movie, whereas Deepika Padukone is the female lead opposite Prabhas.


Celebrating 50 memorable years, Tollywood’s leading production house Vyjayanthi Movies is producing this golden jubilee project prestigiously on a high budget. Ashwini Dutt is the producer.

Sudheer Babu Hunt to release on 26 January, marking Republic Day

 Sudheer Babu, V Ananda Prasad’s Hunt to release on 26 January, marking Republic Day



Nitro star Sudheer Babu is playing a cop in his upcoming intense action thriller - ‘Hunt’ which is bankrolled by V Ananda Prasad under Bhavya Creations banner. The film is directed by Mahesh and it is now officially announced for a grand theatrical release on the 26th of January, marking Republic Day. 


A striking new poster was also unveiled to publicize the release date. Sudheer Babu sports an intense look in the poster.  This film also has Premisthe fame Bharath and Srikanth in cop roles. 


Speaking about the release date announcement, the producer V Ananda Prasad said “We’re delighted to be releasing Hunt in theaters on the 26th of January, marking Republic Day. We’re confident of enthralling our audience. Post production has been wrapped and the film is set for grand theatrical release. Hunt is a high voltage action thriller. Renaud Favero and Bryan Viger who worked on several Marvel films and lastly on John Wick 4 have composed the action sequences for our film. The teaser and the first song are trending on YouTube already. We’re very confident about our product.”


Cast: Sudheer Babu, Srikanth, Bharath, Mime Gopi, Kabir Duhan Singh, Mounika Reddy, Goparaju Ramana, Sanjay Swaroop, Manjula Ghattamaneni and others.


Crew:

Art director: Vivek Annamalai

Costume: Raga Reddy

Action: Renaud Favero and Bryan Viger

Stunts: Ving Chun Anji

Editor: Pravin Pudi

Cinematography: Arun Vincent 

Music: Ghibran

Executive Producer: Anne Ravi

Producer: V Anand Prasad

Director: Mahesh

Nikhil's 18 Pages collects massive 20+ crs in it's 1st week

 Nikhil's 18 Pages collects massive 20+ crs in it's 1st week



Nikhil Siddharth and Anupama Parameswaran starrer 18 Pages under the direction of Palnati Surya Pratap had a theatrical release on December 23rd. Opened to positive reports from the targetted youth audience, 18 Pages had an terrific week at the ticket windows.


As per the trade reports, the film collected massive Rs 20 crore gross at worldwide box office. Though the film had slow start, now utilizing the new Year weekend, 18 Pages maintained the same momentum. The film is still running in 1000+ screens and it will continue the sensation till upcoming Sankranthi releases.


Despite minimal publicity and very little awareness, 18 pages has been growing at the box office thanks to strong word of mouth. The film's treatment of the beautiful love story is unique in Nikhil's usual style, and it touched everyone's heart in theatres.


The box office success was reflected in the audience's appreciation. The producers, who released the film on their own, are profiting handsomely in the double digits, making this a huge success for everyone involved.


Ace filmmaker Sukumar has penned the script for 18 Pages. Produced by Bunny Vas, under the banners of GA 2 Pictures and Sukumar Writings, the music of the project has been provided by composer Gopi Sundar.

WaltairVeerayya Fourth Song Poonakaalu Loading is out now

  Mega Star Chiranjeevi, Mass Maharaja Ravi Teja, Bobby Kolli, Mythri Movie Makers Waltair Veerayya Fourth Song Poonakaalu Loading is out now







What is Poonakaalu Loading? If you want a clarity about this, just watch the fourth song from megastar Chiranjeevi and mass maharaja Ravi Teja’s highly-anticipated flick Waltair Veerayya directed by Bobby Kolli (KS Ravindra) under the banner of Mythri Movie Makers.




Poonakaalu Loading is the fourth song and true to the title, the song offers poonakaalu, to the class and the mass audience. Rockstar Devi Sri Prasad who is the best in the business in scoring mass numbers has conceptualized and rendered a song that makes anyone tap their foot. Roll Rida penned some funny lyrics, and also sang the song along with Ram Miriyala. Furthermore, Chiranjeevi and Ravi Teja also crooned the number to make it a much more distinctive one.




The carnival set-up and a huge crowd is an added advantage for this mass number and it’s a full meal feast to our eyes to see Chiranjeevi and Ravi Teja shaking their legs together. Sekhar master’s choreography is terrific and he rightly utilized the body language of Chiranjeevi and Ravi Teja.




While Chiranjeevi looked massy, his get-up brings back the memories of his yesteryear blockbusters Mutha Mestri, Rowdy Alludu etc. Ravi Teja, on the other hand, looks trendy. We need to wait for another couple of weeks to see the mega mass magic on big screens.




The ambitious project of Bobby Kolli is being made lavishly on a big budget. Shruti Haasan will be seen as the leading lady opposite Chiranjeevi. The film is produced on a grand scale by Naveen Yerneni and Y Ravi Shankar of Mythri Movie Makers, while GK Mohan is the co-producer.




Arthur A Wilson cranks the camera, whereas Niranjan Devaramane is the editor and AS Prakash is the production designer. Sushmita Konidela is the costume designer.




While the story and dialogue were written by Bobby himself, Kona Venkat and K Chakravarthy Reddy penned the screenplay. The writing department also includes Hari Mohana Krishna and Vineeth Potluri.




Waltair Veerayya will be hitting the screens grandly worldwide on January 13, 2023.




Cast: Chiranjeevi, Ravi Teja, Shruti Haasan and others.




Technical Crew:


Written & Directed By: Bobby Kolli (KS Ravindra)


Producers: Naveen Yerneni and Y Ravi Shankar


Banner: Mythri Movie Makers


Music Director: Devi Sri Prasad


DOP: Arthur A Wilson


Editor: Niranjan Devaramane


Production Designer: AS Prakash


Co-Producers: GK Mohan, Praveen M


Screenplay: Kona Venkat, K Chakravarthy Reddy


Additional Writing: Hari Mohana Krishna, Vineeth Potluri


CEO: Cherry


Costume Designer: Sushmita Konidela


Line Producer: Balasubramanyam KVV


PRO: Vamsi-Shekar


Publicity: Baba Sai Kumar


Marketing: First Show

Martial arts expert and Chief Marine Engineer Pawan Kumar's "Tu Bekhabar"s poster launched

 Real Life Hero turns REEL HERO


Martial arts expert and Chief Marine Engineer Pawan Kumar's "Tu Bekhabar"s poster launched



I am happy to share screen space with Zarina Wahab in my first film - Debut hero Pawan Kumar


It is unbelievable that I am sharing screen space with a senior heroine like Zarina Wahab in my debut film, says Pawan Kumar. Martial Arts expert and Marine Chief Engineer Pawn Kumar is getting introduced as a hero through the movie "Tu Bekhabar", directed and produced by Glitters Film Academy Head Deepak Baldev Thakur.


This project is made in Telugu and Hindi languages has finished its shooting process and is currently in the post-production stage. Recently the trailer was launched by the National Award recipient Neelakanta. Famous Bollywood actress Zarina Wahab played a crucial role in the film.


Pawan Kumar, a Chief Marine Engineer who does adventures in the water, is also a physical fitness coach, showing his multi-talented skills. Not just that, but he also is a connoisseur in Martial Arts. Pawan was born in Delhi, studied in Vizag, and settled in Hyderabad. 


This Telugu guy from Vijayanagaram who dreamt of becoming a hero from childhood finally fulfilled his dream through "Tu Bekhabarr" film with consistent hard work and determination. Pawan, who is now in Egypt, will soon leave his job to pursue the acting profession!!

Dhamaka Mass Meet Held Grandly

‘ధమాకా’ని మాసీవ్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులు, అభిమానులకు కృతజ్ఞతలు: ధమాకా మాస్ మీట్ లో ధమాకా చిత్ర యూనిట్


 



మాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌ టైనర్ ''ధమాకా'. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. నిర్మాత టిజి విశ్వ ప్రసాద్  గ్రాండ్ నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందిన ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధమాకా' అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మాసీవ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ధమాకా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా మాస్ మీట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.


 


మాస్ మీట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. ధమాకాలో పని చేసిన టెక్నిషియన్స్ అందరికీ  కంగ్రాట్స్. ఎడిటర్ ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ థాంక్స్. అద్భుతమైన వర్క్ చేశారు. డీవోపీ కార్తిక్ ఘట్టమనేని ఎక్స్ లెంట్ విజువల్స్ ఇచ్చారు. సినిమాలో అందరం అందంగా వున్నామంటే దానికి ప్రధాన కారణం కార్తిక్ కెమరా పనితనం. ఈ సినిమా విజయానికి మొట్టమొదటి కారణం.. మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరిలియో. సాలిడ్ సౌండ్ ఇచ్చాడు. ఈ సినిమా తో నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడు. ధమాకా సక్సెస్ కి రెండో కారణం .. పీపుల్స్ మీడియా మీడియా ఫ్యాక్టరీ. వాళ్ళు ప్రమోట్ చేసిన విధానం, వారి పాజిటివిటీ చాలా ఆనందాన్ని ఇచ్చింది. విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు అద్భుతమైన వ్యక్తులు. చాలా పాజిటివ్ గా వుంటారు. ఈ బ్యానర్ లో చాలా సినిమాలు రావాలి సూపర్ హిట్లు కావాలి. నేను కూడా ఈ బ్యానర్ లో వరుసగా సినిమాలు చేస్తాను. బ్యానర్ అంత నచ్చింది. విశ్వప్రసాద్ , వివేక్ గారికి కంగ్రాట్స్. భరణి గారు, తులసీ గారు చమ్మక్ చంద్ర, జయరాం గారు, చిరాగ్ అందరూ అద్భుతంగా చేశారు. రావు రమేష్, ఆది ధమాకాలో మరో హైలెట్. పాత సినిమాల్లో రావు గోపాల్ రావు, రామలింగయ్య గారిలా అద్భుతంగా వినోదం పంచారు.  ఈ సినిమాకి మరో ఆకర్షణ మా అందమైన హీరోయిన్ శ్రీలీల. అందం, ప్రతిభ,అభినయం అన్నీ వున్నాయి. ఇక డ్యాన్స్ ఐతే సూపర్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తను పెద్ద స్టార్ కాబోతుంది. ఈ విజయానికి మరో కారణం డైలాగ్ రైటర్ ప్రసన్న కుమార్. డైలాగులు అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇంద్ర సినిమా స్పూఫ్ , పల్సర్ బైక్ పాట ఐడియా కూడా ప్రసన్నదే. రామజోగయ్య శాస్త్రి గారు, కాసర్ల శ్యామ్ చాల మంచి సాహిత్యాన్ని అందించారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ధమాకా సినిమాకి డ్రైవర్ దర్శకుడు త్రినాథరావు, నేను కండక్టర్ ని(నవ్వుతూ).  త్రినాథరావు, ప్రసన్న కాంబో ఎప్పుడూ హిట్టే. సెకెండ్ హ్యాట్రిక్ లోకి ఎంటర్ అయ్యారు. అదీ కొట్టేయాలి. అందరినీ ఇలానే  ఎంటర్  టైన్ చేయాలి. ధమాకాకి అభిమానులు చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. పండగ చేసుకొని రెండేళ్ళు అయ్యింది. మళ్ళీ ఇప్పుడు పండగ. ఇకపై పండక్కి గ్యాప్ ఇవ్వొద్దు. పండగమీద పండగ చేసుకోవాలి. మీ సపోర్ట్ ఇలానే కొనసాగాలి. అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.


 


హరీష్ శంకర్ మాట్లాడుతూ... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి అభినందనలు. ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. వివేక్ గారికి కంగ్రాట్స్ ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రమోషన్స్ చూడలేదు.  ధమాకాని అద్భుతంగా ప్రమోట్ చేశారు.  అలాగే ఈ మధ్య కాలంలో ఇలాంటి వేడుకలు చూడలేదు. ఎందుకంటె ఈ మధ్య కాలంలో ఇలాంటి హిట్టు చూడలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. రవితేజ అన్నయ్య సినిమా హిట్ అయితే నా సినిమా హిట్ అయినట్లే వుంటుంది. ధమాకాతో నలుగురు స్టార్లు అయ్యారు. త్రినాథరావు స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ప్రసన్న స్టార్ రైటర్ అయ్యాడు. బీమ్స్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. శ్రీలీల స్టార్ హీరోయిన్ అయ్యింది. రవితేజ అన్నయ్య ని మాస్ మహారాజా అని పిలుచుకునే వాడిని. సుమ గారికి ఓ వేడుకలో అలా పిలవమని చెప్పాను. దాన్ని మీరంతా ముందుకు తీసుకెళ్తున్నారు. చాలా ఆనందంగావుంది. నేను ఈ స్టేజ్ లో వుండడానికి కారణం రవితేజ అన్నయ్యే. దర్శకుడి గా షాక్ తో జన్మనిచ్చి మిరపకాయ్ తో పునర్జన్మ ఇచ్చింది ఆయనే. అన్నయ్య ఒరిజినల్ పేరు రవిశంకర్ రాజు. ఈ రవి శంకర్ లేకపోతే ఈ హరీష్ శంకర్ లేడు. లవ్ యూ అన్నయ్య.  కొందరు ఎంటర్ టైన్ మెంట్, పాటలు వుంటే సరిపోదని అన్నారు. అలాంటి వారందరికీ గట్టి సమాధానమే ధమాకా కలెక్షన్స్. ఇక్కడితో ధమాకా వేడుకలు మొదలౌతాయి. ఇండస్ట్రీ షాక్ అయ్యే కలెక్షన్స్ పది రోజుల్లో సంతరించుకోబోతుంది. ధమాకా టీం అందరికీ అభినందనలు. ఎన్ని ఒత్తిళ్ళు తో థియేటర్ లోకి అడుగుపెట్టిన ప్రేక్షకుడికి అన్నీ మర్చిపోయేలా చేసే వన్ అండ్ ఓన్లీ హీరో మాస్ మహారాజ్. నా మాటలు గుర్తుపెట్టుకోండి.  ధమాకా సెలబ్రేషన్స్ ఈ రాత్రి నుండే మొదలౌతున్నాయి’’ అన్నారు.


 


దర్శకుడు  త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. తమ్ముళ్ళు.. మీకు తెలియకుండానే రోజు ధమాకాని మీతో పాటే థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తున్నాను. ధమాకా సమిష్టి కృషి. ఎంతో మంది కష్టపడితే ఈ రోజు ధమాకాని ఎంజాయ్ చేస్తున్నాం. ఇంతమంది పని చేయాలంటే ఒక శక్తి వుండాలి. ఆ శక్తి పేరు.. రవితేజ గారు . ఆయన తీసుకున్న నిర్ణయం ఇంత మందికి పని ఇస్తుంది, అన్నం పెడుతుంది. సినిమాలో భాగమైన అందరి తరపున మాస్ మహారాజా రవితేజ గారికి మరోసారి కృతజ్ఞతలు. ధమాకా ఒక్కరి విజయం కాదు .. మన అందరి విజయం. ధమాకా విజయాన్ని రవితేజ ఫ్యాన్స్ అందరికీ అంకితం చేస్తున్నాను.’’ అన్నారు.


 


శ్రీలీల మాట్లాడుతూ.. ప్రేక్షకులు, అభిమానులే ధమాకా టైటిల్ కి న్యాయం చేయగలరని  ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పాను. అలాగే మీరు చేశారు. అందరికీ కృతజ్ఞతలు. ఇండస్ట్రీలో ఇది నా రెండో అడుగు. పెద్ద బ్లాక్ బస్టర్ చేశారు. మీ అభిమానం ఇలానే వుండాలి. రవితేజ గారు బంగారం. నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.  దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’’ తెలిపారు.


 


నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘ధమాకా ని మాసీవ్ బ్లాక్ బస్టర్ చేసిన మాస్ మహారాజా అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రవితేజ గారితో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని ఎదురుచూస్తున్నాం.  త్రినాథరావు, ప్రసన్న, శ్రీలీల..  మా ప్రొడక్షన్ టీం.. ధమాకాకి పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు


 


కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ..ఆనాడు శ్రీ కృష్ణుడు ఫ్లూటు వాయిస్తే 16 వేలమంది గోపికలు వచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్తికేయ 2 లో కూడా ఒక ఫ్లూట్ వుంది. ఆ ఫ్లూట్ తో ఏం ఊదారో గానీ డబ్బులే డబ్బులు (నవ్వుతూ). రవితేజ డ్రమ్ము వాయిస్తేనే ఆ రోజుల్లో అల్లరి ప్రియుడు 250 రోజులు ఆడింది. ఇప్పుడు డ్రమ్ము వాయిస్తే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. దర్శకుడు త్రినాథరావు డిజైన్ చేసిన రావు రమేష్, ఆది ట్రాక్  ధమాకే కొత్త కోటింగ్ తీసుకొచ్చింది. రవితేజ ఎవర్ గ్రీన్. శ్రీలీలతో పాటు ధమాకా టీం అందరికీ కంగ్రాట్స్'' తెలిపారు.


 


ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో ఓటీటీలో ఎప్పుడు వస్తుందని అడగని సినిమా ధమాకా. ప్రతి వాళ్ళు థియేటర్ లో వెళ్లి ధమాకా చూస్తున్నారు. నాలుగు రేటింగు వచ్చే సినిమా రాయొచ్చు, ఐదు వందల కోట్లు వచ్చే సినిమా రాయొచ్చు. కానీ ప్రేక్షకులు తెరమీదకు వెళ్లి షర్టులు విప్పి డ్యాన్సులు చేసే మళ్ళీ ఇంలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తామేమో తెలీదు. ఈ మ్యాజిక్ కి కారణం రవితేజ అన్న ఫ్యాన్స్. ధమాకని బ్లాక్ బస్టర్ చేసింది ఆయన అభిమానులే. ఈ సినిమా అవకాశం ఇచ్చిన రవితేజ గారికి పీపుల్ మీడియాకి కృతజ్ఞతలు. ఈ యేడాది చివర్లో ఒక జెండా ఎగరబోతుంది దాని పేరు ధమాకా అని  ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పా. ఆ జెండాని ఎగరేసిన మీ అందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.


 


భీమ్స్ సిసిరిలియో మాట్లాడుతూ.. మీ అందరికీ రుణపడి వుంటాను. రవితేజ గారితో పని చేయాలనీ నేను కల మాత్రమే కన్నాను. మీరంతా కోరుకున్నారు. అందుకే ఆరేళ్ళ తర్వాత ఐసియూ లో పేషెంట్ లా వున్న నన్ను తన రెండు భుజాల మీద ఎత్తి ప్రజల సమక్షంలో ఒక జాతీయ జెండా లా ఎగరేసిన రవితేజ గారికి, ఆయన అభిమానులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ధమాకాకి రవితేజ గారి ఫ్యాన్ లా పని చేశాను. పాట రూపంలో ఆయనకి పూజ చేశాను. మీరందరూ థియేటర్ లో వేసిన విజల్స్ కి ఒక రూమ్ లో కూర్చుని ఏడ్చాను. ఇరవై ఏళ్ళుగా ఏం సాధించావని అడిగితే రవితేజ గారిని చూపిస్తాను. ధమాకాకి పని చేసిన నా టీం అందరికీ కృతజ్ఞతలు. ధమాకా పాటలు ఇంత క్యాలిటీ గా రావడానికి కారణం నిర్మాతలు విశ్వ ప్రసాద్, వివేక్, అభిషేక్ గారు. మా దర్శకుడు త్రినాథరావు, రచయిత ప్రసన్న కు కృతజ్ఞతలు  ’’అని చెప్పారు.


 


జయరాం మాట్లాడుతూ..  ధమాకాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. రవితేజ గారు మాస్ మహారాజా. ఆయన ఎనర్జీ అద్భుతం. ఆయన ఎనర్జీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు’’ తెలిపారు


 


తేజ సజ్జా మాట్లాడుతూ.. సినిమా 50 కోట్లు చేసిన తర్వాత చెప్పడానికి ఏమీ లేదు. అందరికీ కంగ్రాట్స్.   త్రినాథరావు, ప్రసన్న నాకు ఎప్పటి నుండో నాకు స్నేహితులు. నిర్మాతలు విశ్వప్రసాద్, వివేక్ గారు అద్భుతమైన వ్యక్తులు. ఓ బేబీ లో నన్ను లాంచ్ చేసింది వారే. వారికి కంగ్రాట్స్. రవితేజ గారు పాజిటివ్ పర్సన్. అందరి హీరోలకి ఫ్యాన్స్ వుంటారు. కానీ అందరి ఫ్యాన్స్ రవితేజ గారిని కామన్ గా ఇష్టపడతారు. ఆయన ఇలాంటి బ్లాక్ బస్టర్స్ మరిన్ని  కొట్టాలి’’ అని కోరుకున్నారు.


 


ఆది మాట్లాడుతూ.. ఇండస్ట్రీ కి ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ రవితేజ గారు ఎప్పుడూ లోకలే. ఇక్కడే వుంటారు. ఇలాంటి హిట్లు కొడుతూనే వుంటారు. శుక్రవారం ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. అలాగే ధమాకా కూడా లోకలే. ఇంకా థియేటర్ లో చాలా రోజులు వుంటుంది. మీరు ఎంజాయ్ చేయొచ్చు.  ప్రతిభని గుర్తించి అవకాశాలు ఇవ్వడంలో రవితేజ గారు ఎప్పుడూ ముందుంటారు.’’ అన్నారు


 


చిరాగ్ మాట్లాడుతూ.. రవితేజ గారితో ఇది నా రెండో సినిమా. రెండు సినిమాలు విజయాలు సాధించాయి. ధమాకా షూటింగ్ జరుగుతున్నపుడే బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నాను. ఈ సినిమాని విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ తెలిపారు.


 


బండ్ల గణేష్ మాట్లాడుతూ.. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఎవరీ సపోర్ట్ లేకుండా అనుకున్నది సాధించింది కొన్ని వందల మందికి అవకాశాలు ఇస్తున్నారు.   రవితేజ ఒక ఇన్స్పిరేషన్ ..  రవితేజ ఇంటీగ్రీటీ..  రవితేజ రాయాల్టీ,.. రవితేజ.. రియాల్టీ రవితేజ ..రాజసం రవితేజ అరాచకం. రవితేజ ఎవర్ గ్రీన్. ధమాకా సినిమా చూసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. ఏ ఫ్రేమ్ లో చూసిన అద్భుతంగా వుంది. రవితేజతో పని చేయడం మా అదృష్టం. రవితేజ సహచరులవ్వడం మాకు గర్వకారణం. రవితేజ రియల్ కింగ్. ధమాకా డైరెక్టర్ ఇరగదీశారు. ధమాకా రవితేజ అరాచకం. వందకోట్లని క్రాస్ చేస్తుంది. ఇది రవితేజ పవర్.'' అన్నారు.


 


దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ.. ధమాకా టీం అందరికీ అభినందనలు. చాలా రోజుల తర్వాత థియేటర్ లో ఎంజాయ్ చేసే మూవీ గా ధమాకా వచ్చింది. పాటలు, వినోదం అద్భుతంగా వున్నాయి. రవితేజ గారు అద్భుతంగా చేశారు. శ్రీలీల డ్యాన్సులు చూస్తుంటే పాత సినిమాలలో రాధ, రాధిక గారు గుర్తుకు వచ్చారు. పీపుల్ మీడియా నిర్మాతలకు కంగ్రాట్స్.


 


నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ..  లాక్ డౌన్ తర్వాత థియేటర్ లో మనస్పూర్తిగా ఎంజాయ్ చేసిన ధమాకా. ఫ్యామిలీతో వెళ్లి పగలబడి నవ్వాం. రవితేజ గారు వండర్ ఫుల్. పీపుల్ మీడియా విశ్వప్రసాద్ గారి అభినందనలు. రవితేజ గారు ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలి. రివ్యూలు కాదు ప్రేక్షకుల రివార్డులు ముఖ్యం. రివ్యూల కంటే థియేటర్ రెస్పాన్స్ గొప్పది. ధమాకాని ప్రేక్షకులు థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు'' అన్నారు.


 


బివిఎస్ రవి మాట్లాడుతూ.. ధమాకా తో భీమ్స్  చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటాడని రవితేజ గారు కోరుకున్నారు. ఆయన బ్లెసింగ్ తో భీమ్స్ స్టార్ అయ్యాడు. ధమాకాకి మ్యూజిక్ ఆరో ప్రాణం. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన రవితేజ అన్నయ్యకి థాంక్స్. పీపుల్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ గారికి అభినందనలు'' తెలిపారు


 


బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. త్రినాథరావు నక్కిన మాతో పాటు ప్రయాణం మొదలుపెట్టి ఈ రోజు అగ్ర స్థానం చేరుకోవడం చాలా ఆనందంగా వుంది. ధమాకా టీం అందరికీ కంగ్రాట్స్. ఎంతో మందికి పని కల్పిస్తున్న పీపుల్ మీడియాకు కలకాలం విజయాలు రావాలి.  ధమాకా విజయం నా సొంత విజయంలా భావిస్తున్నా. చాలా ఆనందంగా వుంది’’ అన్నారు.


 


ఎస్ కే ఎన్ మాట్లాడుతూ.. రవితేజ గారికి లేనిది బ్యాక్ గ్రౌండ్ .. ఆయన వస్తే నిండిపోద్ది ఎనీ గ్రౌండ్. రవితేజ గారు అందరికీ స్ఫూర్తి. నేను ఇండస్ట్రీ కి రావడానికి ఆయనే స్ఫూర్తి. లాస్ట్ ఇయర్ సంక్రాంతి కిక్రాక్ ఈ ఇయర్ ఎండింగ్ లో ధమాకా షేక్. రవితేజ గారి విజయాలకు పరిమితులు లేవు. శ్రీలీల డ్యాన్స్ చూస్తుంటే మతి పోతుంది. హీరోయిన్ గా శ్రీలీల మరింతగా ఎదగాలి. నక్కిన గారు నెక్స్ట్ లీగ్ డైరెక్టర్ కావాలి. పీపుల్ మీడియా విశ్వప్రసాద్, వివేక్ గారు చాలా మంచి వ్యక్తులు. వారికి మరిన్ని విజయాలు రావాలి'' అన్నారు.


 


ఈ కార్యక్రమంలో ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, కుమరన్, శ్రీతేజ్, తులసి, మంగ్లీ,  చమ్మక్ చంద్ర, సమీర్ , యష్ మాస్టర్  తదితరులు పాల్గొన్నారు.

Dhamaka Collected 62 Cr Gross Worldwide In 1st Week

 Mass Maharaja Ravi Teja, Trinadha Rao Nakkina, TG Vishwa Prasad’s Dhamaka Collected 62 Cr Gross Worldwide In 1st Week



Mass Maharaja Ravi Teja’s mass action entertainer Dhamaka which made a humongous business in the first weekend continued the rampage at the box office in working days as well. The film directed by Trinadha Rao Nakkina completed its first week run on a blockbuster note.


Dhamaka in its first week collected a worldwide gross of Rs 62 Crores. Directed by Trinadha Rao Nakkina and produced by TG Vishwa Prasad, Dhamaka is raking moolah at the class as well as the mass centers. Fans are contented to see Ravi Teja in an energetic role. Sreeleela’s superb dances, Bheem’s music are the other big assets.


The movie is likely to continue its dream run until the biggies arrive for Sankranthi.

Writer Burra Sai Madhav Interview About Veera Simha Reddy

 బాలకృష్ణ గారి నుండి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ 'వీరసింహారెడ్డి'లో వున్నాయి. ఇప్పటివరకూ చూడని ఓ అద్భుతమైన పాయింట్ వీరసింహారెడ్డి కథలో వుంది:  డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఇంటర్వ్యూ 



గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'వీరసింహారెడ్డి' ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ లో వినిపించిన డైలాగులు కూడా సంచలనం సృష్టించాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వీరసింహారెడ్డి' జనవరి 12, 2023న సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి మాటలు అందించిన స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా విలేఖరు సమావేశంలో 'వీరసింహారెడ్డి' చిత్ర విశేషాలని పంచుకున్నారు .


'వీరసింహారెడ్డి' డైలాగ్స్ కంప్లీట్ మాస్ గా వుండబోతున్నాయా ?

'వీరసింహారెడ్డి' లో పక్కా మాస్ డైలాగ్స్ వుంటాయి. బాలకృష్ణ గారిని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో, ఎలాంటి డైలాగ్స్ వినాలని అనుకుంటారో అన్నీ  ఇందులో ఉంటాయి.


బాలకృష్ణ గారి లాంటి పెద్ద స్టార్ హీరోకి డైలాగ్స్ రాస్తున్నపుడు ఒత్తిడి ఫీలయ్యారా ? 

బాలకృష్ణ గారి నాలుగు చిత్రాలకు పని చేశాను. గౌతమీపుత్రశాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు.. ఇప్పుడు  'వీరసింహారెడ్డి'. నేను ఎప్పుడూ ఒత్తిడి తీసుకోలేదు.  ఒత్తిడికి లోనైతే అవుట్ పుట్ సరిగ్గా రాదు. కథని పాత్రని సన్నివేశాన్ని  హీరో ఇమేజ్ ని ద్రుష్టిలో పెట్టుకొని అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ రాయాలి. 'వీరసింహారెడ్డి' కథ చర్చల ప్రారంభం నుండి ఈ ప్రాజెక్ట్ లో వున్నాను.


వీరసింహరెడ్డి కథ దర్శకుడు చెప్పినపుడు అందులో కొత్తగా అనిపించిన పాయింట్ ఏమిటి ? 

వీరసింహరెడ్డి కథే కొత్తది. ఈ కథలో ప్రేక్షకులు ఇంతకుముందు చూడని ఓ అద్భుతమైన కొత్త పాయింట్ వుంది. మాస్ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. వీరసింహరెడ్డి ఫుల్ ప్యాకేజ్. బాలకృష్ణ గారి సినిమాల నుండి కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. 


వీరసింహరెడ్డి లో మీకు సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ? 

నాకు ప్రతి కథ ఒక సవాలే. ఒక సినిమాకి రాస్తున్నపుడు సవాల్ గా తీసుకునే రాస్తాను. కథలో వున్న సోల్ ని ఎలివేట్ చేయడానికి ప్రతి రచయిత కష్టపడతాడు. పైగా వీరసింహారెడ్డి కొత్త కథ. ఇందులో అద్భుతమైన సోల్ వుంది. ఈ పాయింట్ వింటే ఎవరైనా స్ఫూర్తి పొందుతారు. ఒక పక్కా కమర్షియల్ సినిమాకి ఇలాంటి కథ చాలా అరుదుగా దొరుకుతుంది. కథ వినగానే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. వీరసింహా రెడ్డి కథలో అద్భుతమైన ఎమోషన్ వుంది. వీరసింహా రెడ్డి డైలాగ్స్ రాయడానికి రెండు నెలలు పట్టింది. 


ఈ కథ విషయంలో దర్శకుడికి ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా ? బాలయ్య గారు ఏమైనా మార్పులు చెప్పారా ? 

అవి సహజంగా జరిగిపోతుంటాయి, నాకు అనిపించిది నేను చెబుతూ వుంటాను. 

బాలయ్య గారిలో వున్న గొప్ప విషయం ఏమిటంటే ఒకసారి కథ కి ఓకే చెప్పిన తర్వాత ఇక అందులో వేలు పెట్టరు. 


దర్శకుడు గోపిచంద్ మలినేని తో పని చేయడం గురించి ? 

గోపిచంద్ మలినేని గారితో నాకిది రెండో సినిమా. మా మధ్య మంచి స్నేహం వుంది. కథ విషయంలో చాలా మంచి చర్చలు జరుగుతాయి. గోపిచంద్ గారు అద్భుతమైన డైరెక్టర్. ఇప్పుడాయన అగ్ర దర్శకుడిగా వున్నారు. భవిష్యత్ లో ప్రపంచం మొత్తం మాట్లాడుకునే స్థాయిలో వుంటారు. తనది అద్భుతమైన వ్యక్తిత్వం. ఆయనకి కన్విన్స్ అవడం తెలుసు, కన్విన్స్ చేయడం తెలుసు. ఒక గొప్ప దర్శకుడికి ఉండాల్సిన లక్షణాలివి.


గతంలో సంక్రాంతికి బాలకృష్ణ గారి గౌతమీపుత్రశాతకర్ణి, చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 విడుదల అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఇద్దరి సినిమాలు సంక్రాంతికి విడుదలౌతున్నాయి. ఎలా అనిపిస్తుంది ? 


బాలకృష్ణ గారి గౌతమీపుత్రశాతకర్ణి, చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 నేనే రాశాను. అదొక మర్చిపోలేని క్షణం. ఈ రోజు మరోసారి  బాలకృష్ణ, చిరంజీవి గారి సినిమాలు వస్తున్నాయి. ఇదో పండగ. చిరంజీవి గారి సినిమాకి నేను రాయకపోయినా అదీ నా సినిమానే. బాబీ నా స్నేహితుడు. నేను అంటే చిరంజీవి గారికి ఎంతో అభిమానం. ఒకే నిర్మాణ సంస్థ. అదీ నా సినిమాతోనే సమానం.


మైత్రీ మూవీ మేకర్స్ గురించి ? 

నేను చూసిన నిర్మాతల్లో అద్భుతమైన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. వాళ్ళతో ఒకసారి పని చేసిన వారు మళ్ళీ మళ్ళీ పని చేయాలని అనుకుంటారు. సినిమాని బిజినెస్ లా కాకుండా బంధంలా చూస్తారు. అందుకే అంత సక్సెస్ రేట్ లో వున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి సంస్థలు ఇండస్ట్రీకి కావాలి. ఇలాంటి నిర్మాతలు వుంటే ఇండస్ట్రీ పచ్చగా వుంటుంది. 


దర్శకత్వం పై ఆలోచనలు ఉన్నాయా ? 

దర్శకత్వం పై ప్రస్తుతానికి ద్రుష్టి లేదు. రచయిత కావాలని వచ్చాను. రచయితగా వున్నాను.  ఈ ప్రయాణం ఆనందంగా వుంది. భవిష్యత్ లో ఒక కథని దర్శకుడిగా చెప్పాలని అనిపించినపుడు దాని గురించి ఆలోచిస్తాను. 


ప్రస్తుతం రాస్తున్న చిత్రాలు ? 

ప్రాజెక్ట్ కె వుంది. హరిహర వీరమల్లు, రామ్ చరణ్- శంకర్ గారి సినిమా జరుగుతోంది. అలాగే అర్జున్ గారి సినిమా, కెఎస్ రామారావు గారి తో ఒక సినిమా చేస్తున్నా. 


ఆల్ ది బెస్ట్ 

థాంక్స్

#Nani30 Production No 1 Of Vyra Entertainments On January 1st, 2023

 Unveiling The World of Natural Star Nani’s Next (#Nani30), Production No 1 Of Vyra Entertainments On January 1st, 2023



 Natural Star Nani is one rare actor who has a fan base among family audiences as well as the masses. His ongoing film Dasara is going to present him in a never seen before mass character. The actor who is attempting unique stories has announced his milestone 30th project.


#Nani30 marks production No 1 of Vyra Entertainments. Mohan Cherukuri (CVM) with his friends Dr Vijender Reddy Teegala, and Murthy K S started this banner with their passion and a vision to make good content movies and make a difference with their story-telling on the big screen.  


The trio is into various own ventures and has their main interest in movies from their childhood. They have set up multiple projects in the pipeline with their first to be Nani's 30 and are thankful to Nani for the opportunity given to them.


With Nani on board to play the lead role, this surely is going to be a distinctive film. They will unveil the world of #Nani30 on January 1st at 4:05 PM.


In this black and white poster, Nani can be seen sitting on a chair and browsing on his phone.


The director and other important details of #Nani30 will be revealed on the New Year 


Cast: Nani


Technical Crew:

Producers: Mohan Cherukuri (CVM), Dr Vijender Reddy Teegala, and Murthy K S

Banner: Vyra Entertainments

PRO: Vamsi-Shekar

Condolences Meet Held by TFi on the demise of Sri Kaikala Satyanarayana Sri Chalapathi Rao and Sri Vallabhneni Janardhan

 శ్రీ కైకాల సత్యనారాయణ గారు, శ్రీ చలపతిరావు గారు, శ్రీ వల్లభనేని జనార్ధన గారికి నివాళులు అర్పించిన సినీప్రముఖులు



తెలుగు సినీపరిశ్రమలో వరుస విషాదాలు అలుముకుంటున్నాయి, సినీప్రముఖులు ఒకరి తరవాత ఒకరు కాలం చేయడం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. 

ఈ తరుణంలో తెలుగు సినీపరిశ్రమ ఒక సంతాపసభను నిర్వహించింది.  


శ్రీ కైకాల సత్యనారాయణ గారు, శ్రీ చలపతిరావు గారు, శ్రీ వల్లభనేని జనార్ధన గారి సంతాప సభకు విచ్చేసిన ప్రముఖులు ముఖ్యంగా పరుచూరి గోపాలకృష్ణ గారు అధ్యక్షత వహించారు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి గారు, సెక్రెటరీ దామోదర ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు, సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ గారు, డైరెక్టర్ బి.గోపాల్ గారు, నిర్మాత డి వి కే రాజు గారు, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రెటరీ కాజా సూర్యనారాయణ గారు, చలపతి రావు గారి అబ్బాయి రవి బాబు గారు, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ గారు, మరో నిర్మాత ఆచంట గోపీనాథ్ గారు, రైటర్ సాయినాథ్ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సెక్రెటరీ మాదాల రవి గారు రామ సత్యనారాయణ గారు, దర్శకుల సంఘం నుండి  కాశీ విశ్వనాథ్ గారు నిర్మాతలు సుబ్బారెడ్డి గారు వై వి ఎస్ చౌదరి గారు మరియు ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు తో సాంకేతిక నిపుణులు హాజరై నివాళులర్పించారు

Sonu Sood's High Octane Action Thriller Fateh to go on floor in January 2023

 Sonu Sood's High Octane Action Thriller Fateh to go on floor in January 2023



Sonu Sood is a household name for his notable deliveries in Bollywood & a messiah of migrants. 2023 is all about some thrilling kicks & punches for Sood with his upcoming high octane action thriller Fateh. 


The big budgeted action thriller is all set to go on floors in January 2023 . The high octane action thriller will be shot on a large scale in various locations across Delhi and Punjab. There will be a special international crew flying down from LA to choreograph the action sequences. 


Sonu Sood speaking more about the same shared, "2023 gets a start on an action note with Fateh & I'm looking forward to the schedule. It's going to be tedious but super worth it. I'm also looking forward to mastering some never before seen high octane action.."



The film is produced by Zee Studios and Shakti Sagar Productions, directed by Vaibhav Mishra, starring Sonu Sood & Jacqueline Fernandez.


Writer Padmabhushan is Releasing in Theatres On February 3rd

 Writer Padmabhushan, starring Suhas and produced by Lahari Films and Chai Bisket Films, is Releasing in Theatres On February 3rd



Suhas, who started his acting career with YouTube videos on Chai Bisket, is an amazing talent with a surprising choice of films. After a terrific performance in Colour Photo which also won a National award, he surprised everyone in Hit-2. And next, he will next be seen as a struggling writer in the upcoming hilarious fun family entertainer Writer Padmabhushan. The film’s theatrical release date has been announced.


Writer Padmabhushan is slated for a theatrical release on February 3rd.  The release date poster presents Suhas as an aspiring youngster with big goals and dreams. He looks ecstatic with a charming smile on his face, he is seen standing and giving a pose on Prakasam Barrage.


In this film set in Vijayawada, Tina Shilparaj plays the female lead in this film. Debutant Shanmukha Prashanth has directed the movie which is produced by Chai Bisket Films, in association with Lahari Films. Anurag Reddy, Sharath Chandra and Chandru Manohar are the producers and G. Manoharan presents it.


Shekar Chandra and Kalyan Nayak scored the music and the film’s first single Kannullo Nee Roopame turned out to be a chartbuster and Venkat R Shakamuri handled the cinematography of the film.The makers are planning to release the trailer of the film soon.


Cast: Suhas, Tina Shilparaj, Ashish Vidyarthi, Rohini Molleti, Goparaju Ramana, Sri Gouri Priya


Crew:

Writer & Director: Shanmukha Prashanth

Producers: Anurag Reddy, Sharath Chandra and Chandru Manohar

Presenter: G. Manoharan

Banners: Chai Bisket Films, Lahari Films

Music: Shekar Chandra and Kalyan Nayak

DOP: Venkat R Shakamuri

Editor: Kodati Pavan Kalyan, Siddhartha Thatholu

Lyrics: Bhaskarabhatla

Art: Yellayya S

Costume Designer: Rajini

Ex-Producer: Surya Chowdary

PRO: Vamsi-Shekar

Co-Director: Gopi Atchara

Creative Producers: Uday-Manoj


Adivi Sesh Pan India Movie G2 will get ALL INDIA launch on Jan 9

 Adivi Sesh Pan India Movie G2 will get ALL INDIA launch on Jan 9



Adivi Sesh has created a huge following for his films, they are unique and distinctive from each other. He also earned a cult following among movie buffs with his choice of stories. Goodhachari is a path-breaking film in the Telugu film industry and Sashi Kiran Tikka who directed the movie made the Pan India project Major with Sesh as their second collaboration.


Sesh who became nationwide popular with Major delivered another blockbuster with his last Telugu movie HIT2. In the meanwhile, the actor announced the sequel to his hit Goodhachari titled G2 as his next project.


They will be releasing a “Pre Vision” video on Jan 9th by launching it in both Delhi and Mumbai on the same day.


The editor of “Major”, Vinay Kumar Sirigineedi will be making his debut as a director with the movie. Sesh himself penned the story. Three popular production houses join forces for this high-budget Pan India project. TG Vishwa Prasad and Abhishek Agarwal will be jointly producing the movie under the banners of People Media Factory, Abhishek Agarwal Arts and AK Entertainments India Pvt Ltd.


It is to be noted that the collaborators between them have created All Indian Hits like The Kashmir Files, Karthikeya 2 and Major.


The makers have also released a concept poster of the movie that features Adivi Sesh in a black suit holding a machine gun in his hand, indicating he is all set to begin the action.


While the entire story of Goodhachari was set in India, G2 is going to be international. Goodhachari Part 2 will start from where Goodhachari ended in the Alps mountains. The makers want to design double the action compared to an average action film with many new characters joining with the already existing star cast.


It’s going to be humongous, in terms of the span of the story, making, technical standards, and international crew. Wait for the big “Pre Vision” that launches on January 9th.


Cast: Adivi Sesh


Technical Crew:

Director: Vinay Kumar Sirigineedi

Story: Adivi Sesh

Producers: TG Vishwa Prasad and Abhishek Agarwal

Banners: People Media Factory, Abhishek Agarwal Arts, AK Entertainments India Pvt Ltd

PRO: Vamsi-Shekar

Marketing: First Show