Latest Post

Merlapaka Gandhi Interview About Like Share and subscribe

'లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్' అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్ టైనర్.. ఆద్యంతం ఒక ఫన్ రైడ్ లా వుంటుంది: దర్శకుడు మేర్లపాక గాంధీ ఇంటర్వ్యూ


 



ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


 


ఎ ఎం బీ మాల్ లో ప్రమోషన్ ప్లాన్ ఎవరిది ?


ఎ ఎం బీలో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని షూట్ చేయడానికి వెళ్లాం. అయితే సినిమా వస్తుందని ఎంతమందికి తెలుసనే ఒక ఆలోచన వచ్చి షూట్ చేయమని చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.


 


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్టొరీ ఐడియా ఎప్పుడు వచ్చింది ?


లాక్ డౌన్ సమయంలో అందరికీ తీరిక దొరికింది. అప్పుడే చాలా మంచి యూట్యూబ్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఆ సమయంలో ఎలాగూ బయటికి వెళ్ళలేం కాబట్టి కనీసం ట్రావెల్ వీడియోస్ చూస్తే బయటికి వెళ్ళిన ఫీలింగ్ వుంటుందని ఎక్కువగా ట్రావెల్ వ్లాగ్ వీడియోస్ చూశాను. అది చాలా నచ్చింది. ప్రదేశాలు గురించి, వాటి చరిత్ర గురించి చెప్పడం చాలా ఇంట్రస్టింగా అనిపించింది. ఒక యూట్యుబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన మొదలైయింది. ట్రావెల్ వ్లాగర్  కి వున్న కష్టాలు, ప్రమాదాలు, సవాళ్ళు బ్యాక్ డ్రాప్ లో సినిమాని ప్లాన్ చేశాం.


 


ట్రావెల్ వ్లాగ్, యూట్యుబర్ లైఫ్ తో లిమిటెడ్ ఆడియన్స్ రిలేట్ చేసుకుంటారు కదా ? కామన్ ఆడియన్స్ కి ఈ కథ ఎంత రిలేటెడ్ గా వుంటుంది ?


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ చాలా హిలేరియస్ గా వుంటుంది. హీరో, హీరోయిన్  ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్ . వీరి మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ట్రావెల్ వీడియోలు షూట్ చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదం ఎదురుకున్నారనేది కూడా చాలా ఇంటరెస్టింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకూ ఒక లాఫ్ రైడ్ లా వుంటుంది. అండర్ కరెంట్ గా ఒక సమస్య రన్ అవుతూనే .. ఆ పరిస్థితి నుండి వచ్చే సిట్యువేషనల్ కామెడీ అద్భుతంగా వుంటుంది.


 


మీ సినిమాల్లో స్క్రీన్ ప్లే స్పెషల్ ఎట్రాక్షన్ కదా.. మరి ఇందులో ఎలా వుంటుంది ?


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా వుంటుంది. ప్రతి పదిహేను నిమిషాలకు కథలో ఒక చేంజ్ ఓవర్, మలుపు వుంటుంది.  సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా వుంటుంది.


 


సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో ఎలా చేశారు ?


సంతోష్ శోభన్ తో ఏక్ మినీ కథ చేశాను. అందులో తన నటన బాగా నచ్చింది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో ఒక యూట్యుబర్ గా యంగ్ యాక్టర్ కావాలని సంతోష్ తో కథ చెప్పడం జరిగింది. తనకి చాలా నచ్చింది. అలాగే జాతిరత్నాలు తర్వాత ఫారియా ఈ సినిమా చేసింది. తను సహజంగా ఎలా వుంటుందో సినిమాలో కూడా అలానే కనిపించింది. ఇద్దరూ పర్ఫెక్ట్ గా సరిపోయారు.


 


సుదర్శన్, బ్రహ్మాజీ పాత్రల గురించి ?


సుదర్శన్ ట్రావెల్ వ్లాగ్ షూట్ చేసే డివోపీ గా దాదాపు సినిమా అంతా ఉంటాడు. ఈ పాత్ర లో చాలా ఫన్నీగా ఉంటాడు. ఇందులో పిపిఎఫ్ అనే గ్యాంగ్ వుంటుంది. దానికి హెడ్ గా కనిపిస్తారు బ్రహ్మాజీ. చాలా రోజుల తర్వాత బ్రహ్మాజీ గారు అద్భుతంగా చేసిన క్యారెక్టర్ అని నాకు అనిపించింది. ఆయన పాత్ర కూడా దాదాపుగా సినిమా అంతా వుంటుంది. చాలా లైట్ హార్టెడ్ గా సరదాగా ఎంజాయ్ చేసే హిలేరియస్ ఎంటర్ టైనర్ ఇది.


 


ప్రభాస్ గారు ఈ సినిమా కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు వున్నారు ?


యూవీ క్రియేషన్స్, ప్రభాస్ గారు మాకు వెరీ క్లోజ్. వారి బ్యానర్ లో సినిమాలు చేశాం. తర్వాత కూడా చేయబోతున్నాను. నా, సంతోష్ శోభన్ సినిమా అంటే తప్పకుండా యూవీ క్రియేషన్స్ హెల్ప్ చేస్తోంది.


 


చిన్న సినిమాలకి ప్రేక్షకులు చాలా సెలెక్టెడ్ గా థియేటర్ కి వస్తున్నారు కదా.. ఆ భయం ఏమైనా ఉందా ?


వుందండీ. అందుకే చాలా కొత్తగా వైవిధ్యంగా ప్రమోట్ చేస్తున్నాం. జనాల్ని మార్నింగ్ షోకి తీసుకురావాలనేది మా టార్గెట్. మంచి టాక్ స్ప్రెడ్ అయితే, సినిమా బావుంటే ఖచ్చితంగా చూస్తారు.


 


మీ మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి స్క్రీన్ ప్లే లో చాలా మంచి పేరు వచ్చింది. అలాంటి రేసీ స్క్రీన్ ప్లేతో కొత్త సినిమాల ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ?


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే కూడా రేసీగా వుంటుంది.  ఒక ట్రాక్ నడుస్తోంది. ఆ ట్రాక్ లోకి లీడ్ రోల్స్ ఎప్పుడు వస్తారా అనే ఎక్సయిమెంట్ వుంటుంది. చాలా కొత్తగా వుంటుంది.


 


మీ కథలు మీ నాన్న చదువుతారా ?


ప్రతి బౌండ్ స్క్రిప్ట్ ని నాన్నకి ఇస్తా. చదివి అభిప్రాయాలు, సూచనలు చెబుతారు. ఆయన కథతో సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుండో వుంది. దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి చేయాలి.


 


ఈ కథ విన్న తర్వాత వెంకట్ బోయనపల్లి గారు ఎలా స్పందించారు ?


ఆయనకి ఎప్పటి నుండో ఒక సినిమా చేయాలి. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ, టైటిల్ ఆయనకి చాలా నచ్చాయి. నా మీద నమ్మకంతో ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మించారు. ఈ సినిమా కోసం మారేడిమిల్లి అడవి లో షూట్ చేశాం. అదొక మంచి అనుభవం.


 


లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ప్రమోషన్స్ లో చిరంజీవి గారు కూడా కలిసోచ్చారు కదా ?


నిజంగా ఇది అనుకోకుండా జరిగింది. వాల్తేరు వీరయ్య టీజర్ లో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ అనే డైలాగ్ వాడగానే అందరూ మమ్మల్ని ట్యాగ్ చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. ఏదో అద్భుతంగా జరగాలని ఎదురుచూశాం. చిరంజీవి గారి రూపంలో మాకు అద్భుతం జరిగింది.


 


ప్రవీణ్ లక్క రాజు మ్యూజిక్ గురించి ?


ప్రవీణ్ లక్క రాజుతో ఎక్ మినీ కథ, ఎక్స్ ప్రెస్ రాజా చేశాను. ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చాడు. డివోపీ వసంత్ కొన్ని తమిళ చిత్రాలు చేశారు. చాలా బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. దావూద్ స్క్రీన్ ప్లే కి హెల్ప్ చేశారు. ఇద్దరం కలసి చేశాం.


 


కొత్తగా చేయబోతున్న సినిమాలు ?


స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. పెద్ద సినిమా చేయాలనే మూడ్ లో వున్నా.  జవాన్ నిర్మాత కృష్ణ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్, అలాగే  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో  కూడా ఒక సినిమా చేయాలి.


 


ఆల్ ది బెస్ట్


థాంక్స్

Mass Maharaja Ravi Teja Unveiled First Look Of Vishnu Vishal Matti Kusthi

 Mass Maharaja Ravi Teja Unveiled First Look Of Vishnu Vishal, Chella Ayyavu, RT Teamworks, Vishnu Vishal Studioz Matti Kusthi



Mass Maharaja Ravi Teja and Vishnu Vishal together are producing the latter’s sports drama film Matti Kusthi. Chella Ayyavu is directing the movie under RT Teamworks and Vishnu Vishal Studioz banners. Aishwarya Lekshmi is playing the female lead opposite Vishnu Vishal.


Today, Ravi Teja unveiled the film’s first look poster. The poster presents Vishnu Vishal as a star wrestler who is gearing up for a big fight in the ring. The actor is seen in a wrestling dress in the picture and flaunting toned abs. The film’s story is set in a rural backdrop.


The film has music by Justin Prabhakaran, while Richard M Nathan is the cinematographer and Prasanna GK is the editor.


Matti Kusthi has completed its shooting part. The post-production works are currently underway. The makers are planning to release the movie in December.


Cast: Vishnu Vishal, Aishwarya Lekshmi


Technical Crew:

Writer & Director: Chella Ayyavu

Producers: Ravi Teja, Vishnu Vishal

Banners: RT Teamworks, Vishnu Vishal Studioz

DOP: Richard M Nathan

Music Director: Justin Prabhakaran

Editor: Prasanna GK

Art Director: Umesh J Kumar

Lyrics: Vivek

PRO: Vamsi-Shekar

Mayor of New Jersey Edison Mr. Sam Joshi honoured Nikhil Siddhartha for Karthikeya 2 humongous success in the USA

 Mayor of New Jersey Edison Mr. Sam Joshi honoured Nikhil Siddhartha for Karthikeya 2 humongous success in the USA



After witnessing a successful run in theatres, owing to good word of mouth. Karthikeya 2. is now creating sensation at the OTT. Being produced on a small budget, the box office collection of this Nikhil Siddharta-starrer has left trade analysts astonished. Karthikeya 2 was released on August 13.


The divine elements and storyline of the film enthralled everyone. Many critics praised Nikhil's performance as Dr. Karthikeya, and the audience adored him. Throughout the theatrical run, the creators and team received praise from all corners. ISCKON letter, Gujarat CM, Amitabh Bachchan, Powerstar Pawan Kalyan, and many others appreciated the team.


Mr. Sam Joshi, Mayor of New Jersey Edison, has now honoured Nikhil Siddhartha for Karthikeya 2's enormous success in the United States. He shared a few words about Nikhil "Hey Everyone, we wanted to recognise Nikhil for his incredible work in the film industry, and his most recent film Karthikeya 2 has been a blockbuster hit both in America and in India. We are so proud of him, and we Mayor Office wanted to issue a proclamation to him. Thank you so much for your work."


"Thank you so much sir for this honour; I just want to say this is coming from Sam Joshi sir, the mayor of Edison; this is huge for me," Nikhil responded.


This mythological adventure drama, directed by Chandoo Mondeti, is not only sensational at Box office but also basking in acclaim. Karthikeya 2 is a sequel to Chandoo Mondeti’s 2014 film Karthikeya. This movie is produced jointly by TG Vishwa Prasad and Abhishek Agarwal. The story outlines the hidden depth of the drowned city of Dwaraka. Nikhil, Anupama, and Srinivas Reddy try to unearth the mystery behind the same.

Insecure Releasing on November 11th

 నవంబర్ 11న  థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతున్న మూవీ "ఇన్ సేక్యూర్".                                                                                                              

     


                                                                                                                       

                           ఆర్కాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రంజిత్ కోడిప్యాక సమర్పణలో

సిహెచ్  క్రాంతి కిరణ్ సహకారం తో అదిరే అభి ( అభినవ కృష్ణ ) ఆమీక్షా పవార్,ప్రగ్య నాయన్, సోనాక్షి వర్మ హీరో హీరోయిన్లుగా సత్యనారాయణ ఏకారి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ త్రిల్లర్ చిత్రం  "ఇన్ సేక్యూర్" నవంబర్ 11న గ్రాండ్ గా విడుదలవుతుంది.

                      ఈ సందర్భంగా దర్శక నిర్మాత సత్యనారాయణ ఏకారి మాట్లాడుతూ ... తప్పు చేసి డబ్బు హోదాను అడ్డుపెట్టుకుని చట్టం నుండి ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే చెడు ఆలోచనను దూరం చేసే ప్రయత్నగా "ఇన్ సేక్యూర్" మూవీని నిర్మించాం ఈ చిత్రంలో కీలక పోలీస్ పాత్రలో "సీతారామం" ఫేమ్ మధు నంబియర్, నటించగా ప్రముఖ ప్రొడ్యూసర్ రాజేష్ నాయుడు మరో కీలక పాత్రలో నటించారు, నవంబర్ 11న 

థియేటర్లలో గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ చిత్రం మా బ్యానర్లో నాలుగో చిత్రం గతంలో నందికొండవాగుల్లోన , మోని , స్టూవర్టుపురం చిత్రాలు నిర్మించాం  గత చిత్రలాగానే ఈచిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నామన్నారు 

                         ఈ చిత్రానికి సంగీతం : నవనీత్ చారి ,సమర్పణ: రంజిత్ కోడిప్యాక , సహకారం : సిహెచ్  క్రాంతి కిరణ్ , పాటలు : బస్వాగాని భాస్కర్ , మాటలు : శిల్ప కసుకుర్తి , నిర్మాత, దర్శకత్వం : సత్యనారాయణ ఏకారి

Aditya Om saving lives

 Aditya Om saving lives 



Actor Aditya Om who’s also known for his social work and philanthropic ways has done his bit to provide ambulance services for the villages of  Cherupally, Kothapally ( gram panchayat) and surrounding areas in Bhadradri kothagudem district and city fever hospital Tandur. Aditya Om who has been working since long in the tribal villages of   Bhadradri Kothagudem district was distressed to see the loss of lives because of no ambulance services during covid times and rampant snake bites in that area. With the help of Rotary Club and it’s related local organisations, he was able to mobilise enough resources for providing ambulance services to these areas. Aditya Om says that because of the assistance given by his friends,charitable organisations and awareness by the local people many lives have been saved in the recent past. This gives him enormous satisfaction and he plans to keep on working for the welfare of the people there.

Alipiriki Allantha Duram lo Releasing on November 18th

 కాస్కేడ్ పిక్చర్స్ -  'అలిపిరికి అల్లంత దూరంలో " నవంబర్ 18న విడుదల



కాస్కేడ్ పిక్చర్స్ పతాకం పై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


యూనిక్ రాబరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  అలాగే 'మా తిరుపతి' పాట సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రమోషనల్ మెటీరియల్ మంచి బజ్ ని క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదల తేది ఖరారైయిది. నవంబర్ 18న ఈ చిత్రం థియేటర్లో విడుదలౌతుంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు రూపొందించిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ వీడియో ఆకట్టుకుంది. వింటేజ్ డేస్ ని గుర్తుకు తెస్తూ దండోరా వేయించడం అలరిస్తోంది.


తిరుపతి నేపధ్యంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు వున్నాయి. నూతన దర్శకుడు ఆనంద్ తన తొలి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ చూపించబోతున్నారని ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే అర్ధమౌతుంది.  

 

నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తుండగా, డిజికె డీవోపీగా పని చేస్తున్నారు.


 నటీనటులు:  రావణ్ నిట్టూరు,  శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి

లహరి గుడివాడ


టెక్నికల్ టీం :

దర్శకత్వం: - ఆనంద్ జె

నిర్మాతలు: రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి

బ్యానర్: కాస్కేడ్ పిక్చర్స్

డీవోపీ: డిజికె

సంగీతం : ఫణి కళ్యాణ్

ఎడిటర్ : సత్య గిడుతూరి

పీఆర్వో : తేజస్వి సజ్జా

Santosh Shobhan's Peculiar Plan For Like Share Subscribe

Santosh Shobhan's Peculiar Plan For Like Share Subscribe



Young and talented hero Santosh Shobhan is greatly a anticipating the release of his upcoming film, Like Share Subscribe which is up for release on the 4th of November. 


As a part of the promotions, the unit release a new promo video and it has a hilarious touch. In the video, Santosh asks strangers and commoners if they know about the film.


Santosh and comedian Sudharshan are seen conversing with commoners about whether or not they know the former and his upcoming film, Like Share Subscribe. The video has a fun vibe all the way through.


Many of the people recognize Santosh and also the film, LSS. A few get the release date right and a few don't. The video, as a whole, it a very entertaining one. 


The film is directed by Merlapaka Gandhi and it has Faria Abdullah in the female lead role. 

Hollywood Stunt Choreographer amazed by Samantha's dedication!!

 Hollywood Stunt Choreographer amazed by Samantha's dedication!!



Samantha's upcoming Action Thriller 'Yashoda' directed by Hari - Harish is up for release on November 11th 2022.


Produced by Sivalenka Krishna Prasad's production under Sridevi Movies, movie is made on a lavish budget and the Production values are evident in the recently released trailer trailer.


Garnering immense hype on the movie, Trailer gave a glimpse of the concept of story and even the action, emotion and thrill we shall witness in theatres.


Glad by the response, Action choreographer Yannick Ben reveals insights about the making of the these High-voltage Fights & Stunts by Samantha. Reveals that her dedication is at next level and it's her will power that made the entire sequences thrilling.


He worked with Samantha earlier for 'Family Man 2' webseries and now they team up for the best action in 'Yashoda'.


With expertise in Aikido, Kick Boxing, Jeet Kune Do, Gymnastics, and Sand, Yannick Ben choreographed stunts for prestigious Hollywood flicks, 40+ Telugu & Hindi movies.


His filmography includes

like 'Transporter 3', Christopher Nolan's 'Inception', 'Dunkirk', Shahrukh Khan's 'Raees', Salman's 'Tiger Zinda Hai', Pawan Kalyan's 'Attarintiki Daredi', Mahesh Babu's 1 - Nenokkadine, Allu Arjun's 'Badrinath', Suriya's ‘Seven aum arivu’ and many others.

O Thandri Theerpu Movie Launched

అట్టహాసంగా ప్రారంభమైన "ఓ తండ్రి తీర్పు" చిత్రం*



తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య పెరుగుతున్న ఎడబాటు, తరిగిపోతున్నప్రేమల ఇతివృత్తంగా రూపొందుతున్న సినిమా 'ఓ తండ్రి తీర్పు'. సమర్పకులు లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ జ‌న్మదినం సందర్భంగా  ఈ సినిమా హైద‌రాబాద్‌లో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ శ్రీరామ్ దత్తి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహిస్తుండ‌గా రాజేందర్ రాజు కాంచనపల్లి పర్యవేక్షిస్తున్నారు. నటీనటులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ క్లాప్ నివ్వగా.. ప్ర‌ముఖ‌ సంగీత దర్శకులు కోటి కెమెరా స్విచ్చాన్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రమేష్ చెప్పాల స్క్రిప్ట్ అందజేశారు.


అనంతరం.. సమర్పకులు ఆరిగపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు - పిల్లల మధ్య బంధాలు ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో తెలియజేప్పే సందేశాత్మ‌క క‌థ‌న‌మే 'ఓ తండ్రి తీర్పు' చిత్రమ‌ని తెలిపారు. మంచి మేసేజ్ తో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి కి, చిత్రయూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 


నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా ఓ తండ్రి తీర్పు నిర్మిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని, లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ ప్రోత్సాహం, ఆశీస్సులతో ఈ సినిమా ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. 


దర్శకులు ప్రతాప్ భీమవరపు మాట్లాడుతూ.. ఓ తండ్రి తీర్పు సినిమా క‌థ‌ రాయడానికే 6 నెలలు పట్టిందని, ఈ కథను పుస్తకం రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఎవరు సహకరించలేదని అన్నారు. ఓ తండ్రి తీర్పు పుస్తకంగా, మళ్ళీ తిరిగి సినిమా రూపొందటానికి లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సహకారం, రమణ చారి గారి ప్రోత్సహం ఎంతగానో ఉందని అన్నారు.


పర్యవేక్షకులు రాజేందర్ రాజు కాంచనపల్లి మాట్లాడుతూ.. ఓ మంచి కథ కి పర్యవేక్షన చెయ్యడం చాలా ఆనందంగా ఉందని, ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ చిత్రంలో అవకాశం కల్పించినందుకు నటీనటులు, టెక్నిషియన్స్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. 


బ్యానర్ : ఏవీకే ఫిలిమ్స్

సమర్పణ: *లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్*


నిర్మాత

లయన్ శ్రీరామ్ దత్తి


రచన దర్శకత్వం

ప్రతాప్ భీమవరపు


పర్యవేక్షణ

రాజేందర్ రాజు కాంచనపల్లి*l


డీఓపీ

సురేష్ చెట్ పల్లి


కో డైరెక్టర్

రంగనాథ్ కలింగ


 స్క్రిప్ట్ కోఆర్డినేటర్స్

 నామాల రవీంద్ర సూరి, సాహిత్య ప్రకాష్


 ప్రాజెక్టు కోఆర్డినేటర్

రాపోలు దత్తాత్రి


సంగీతం 

మధు బాపు


పబ్లిసిటీ డిజైనర్

వివారెడ్డి


పీఆర్‌వో 

దయ్యాల అశోక్

 

ఆర్ట్ 

దుద్దుపూడి ఫణి రాజు


అసిస్టెంట్ డైరెక్టర్ 

బాలచంద్ర


 నటీనటులు:

 ప్రతాప్, శ్రీరామ్, అనురాధ, చెల్లి స్వప్న, మంజుల, కునాల్ కుషాల్,శ్రీరామోజు లక్ష్మీనారాయణ శ్రీనివాస్ స్వాతి ప్రవల్లిక నటరాజు

Lachamammo Song Launched From Like Share and subscribe

 


సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, మేర్లపాక గాంధీ, ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ నుండి  ''లచ్చమమ్మో' వీడియో సాంగ్ విడుదల


 



ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధమైయింది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది.


 


ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా ''లచ్చమమ్మో' వీడియో సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. ప్రవీణ్ లక్కరాజు ఈ పాటనీ ట్రెండీ ఫోక్ సాంగ్ గా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంది.


 


గోరేటి వెంకన్న ఈ పాటకు సాహిత్యం అందించగా రామ్ మిరియాల తనదైన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు. ఈ పాటలో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా కెమిస్ట్రీ అలరిస్తోంది. పాటలో కలర్ ఫుల్ అండ్ ప్లజంట్ బీచ్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


 


ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, వసంత్ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


 


తారాగణం: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్


 


సాంకేతిక సిబ్బంది:


రచయిత, దర్శకత్వం: మేర్లపాక గాంధీ


నిర్మాత: వెంకట్ బోయనపల్లి


బ్యానర్లు: ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్


సంగీతం: ప్రవీణ్ లక్కరాజు


డీవోపీ: వసంత్


ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటరత్నం (వెంకట్)


పీఆర్వో: వంశీ-శేఖర్

Banaras Heroine Sonali Monteiro Interview

 

'బనారస్' లో ఎక్స్ ట్రార్డినరీ కంటెంట్ వుంది.. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది: హీరోయిన్ సోనాల్ మోంటెరో ఇంటర్వ్యూ



 


కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, బెల్ బాటమ్ ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్‌' తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన బనారస్ నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ సోనాల్ మోంటెరో విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


 


'బనారస్' విడుదలకు ఇంకా నాలుగు రోజులే వుంది,, ఎలా అనిపిస్తుంది ?


ఎక్సయిట్ మెంట్, నేర్వస్నెస్.. రెండూ వున్నాయి. ఇది నా మొదటి పాన్ ఇండియా మూవీ. అన్ని పరిశ్రమలకు ఈ సినిమాతో పరిచయం కావడం ఎక్సయిటింగ్ గా అదే సమయంలో నెర్వస్ గా కూడా వుంది. ప్రేక్షకులు తప్పకుండా బనారస్ చిత్రాన్ని ఇష్టపడతారనే నమ్మకం వుంది.


 


పాన్ ఇండియాకి మీరు కొత్త .. ప్రమోషన్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ?


కన్నడ ఎనిమిది సినిమాలు చేశాను. మిగతా చోట్ల నేను కొత్తే. హిందీ, తెలుగు పరిశ్రమల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులకు నచ్చాయి. ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమ మా నమ్మకాన్ని పెంచింది. 


 


ట్రైలర్ లో టైం ట్రావెల్, ప్రేమ కథ కనిపించాయి.. ఇంతకీ బనారస్ జోనర్ ఏమిటి ?


టైం ట్రావెల్ కథలో చిన్న భాగం మాత్రమే. లవ్ స్టొరీ, థ్రిల్, సస్పెన్స్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని వైవిధ్యమైన ఎలిమెంట్స్ వున్న చిత్రమిది. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా వుంటుంది. బనారస్ ని అద్భుతంగా చూపించాం. కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ గా వుంటుంది. అసాదారణమైన స్క్రిప్ట్ ఇది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.


 


బనారస్ లో మీ పాత్ర ప్రాధన్యత ఎలా వుంటుంది ?


జయతీర్ధ గారి సినిమాల్లో హీరోయిన్స్ కి ఎక్కువ ప్రాధన్యత వుంటుంది. ఇందులో కూడా నా పాత్ర చాలా కీలకమైనది. ఇందులో ధని అనే పాత్రలో కనిపిస్తా. నా పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. హీరోకి ఎంత ప్రాధన్యత వుంటుందో హీరోయిన్ కూడా అంతే ప్రాధాన్యత వున్న కథ ఇది.


 


కాంతార లాంటి విజయం తర్వాత కన్నడ నుండి వస్తున్న చిత్రం బనారస్.. ఎలా అనిపిస్తుంది ?


కాంతార విషయంలో నేను చాలా ఆనందంగా, గర్వంగా వున్నాను. మా ప్రాంతానికి చెందిన ఒక గొప్ప కథని చెప్పారు. అయితే బనారస్ పూర్తిగా భిన్నమైన సినిమా. రెండు జోనర్స్ వేరు. కాంతారని ఇష్టపడినట్లే బనారస్ ని కూడా ప్రేమిస్తారనే నమ్మకం వుంది.


 


మీకు హిందీలో కూడా అవకాశాలు వచ్చాయి కదా.. చేయకపోవడానికి కారణం ?


నా ద్రుష్టి సౌత్ పై వుంది. తులులో నా కెరీర్ ప్రారంభించాను. కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు నేనేవరో ఇక్కడవారికి తెలుసు. నాకంటూ ఒక పేరు వచ్చింది. వేరే పరిశ్రమలోకి డైరెక్ట్ గా జంప్ చేసేయడం ఇష్టం వుండదు. అందులోనూ సౌత్ సినిమాలు బాలీవుడ్ కంటే అద్భుతంగా ఉంటున్నాయి. ప్రత్యేకంగా బాలీవుడ్ కి వెళ్లాల్సిన అవసరం ఏముంది. తెలుగులో రాబర్ట్ సినిమాలో ఒక క్యామియో చేశా. తెలుగు సినిమాలు చేయాలనే ఆసక్తి వుంది.


 


తెలుగు సినిమాలు చూస్తారా ? తెలుగు పరిశ్రమలో నచ్చిన అంశం ఏమిటి ?


తెలుగు భాష అర్ధమౌతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోనే నా సినిమాలు షూటింగ్ జరుపుకుంటాయి. చక్కని నటన కనబరిస్తే తెలుగు ప్రేక్షకులు ఎంతగానో అభిమానిస్తారు. సీతారామం, ఆర్ఆర్ఆర్ , పుష్ప సినిమాలు తెలుగులోనే చూశా. విజయ దేవరకొండ అంటే ఇష్టం.


 


జైద్ ఖాన్ తో పని చేయడం ఎలా అనిపించింది ?


జైద్ పొలిటికల్ నేపధ్యం నుండి వచ్చారు. ఆయన ఎలా వుంటారోఅనిపించేది. అయితే జైద్ నా ఆలోచనలు తప్పని నిరూపించారు. జైద్ వండర్ ఫుల్ పర్శన్. మంచి ఫెర్ ఫార్మర్. చాలా సపోర్ట్ చేస్తారు. ట్రైలర్ చూస్తే చాలా అనుభవం వున్న నటుడిలానే కనిపిస్తారు తప్పితే కొత్త నటుడనే భావన రాదు.


 


కొత్తగా చేయబోతున్నా సినిమాలు ?


 


మూడు కన్నడ సినిమాలు చేస్తున్నా. అలాగే సరోజినీ నాయుడు బయోపిక్ చేస్తున్నా. ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది.


 


ఆల్ ది బెస్ట్


థాంక్స్



Nitro Star Sudheer Babu Pan India Film Titled Harom Hara

Nitro Star Sudheer Babu, Gnanasagar Dwaraka, Sumanth G Naidu, SSC’S Pan India Film Titled Harom Hara



Nitro Star Sudheer Babu’s 18th film will be helmed by talented director Gnanasagar Dwaraka who debuted with the youthful entertainer Sehari. However, the director chose a concept with a gigantic canvas for his second movie. It will be produced by Sumanth G Naidu under SSC (Sree Subrahmanyeshwara Cinemas) banner.


The makers recently announced, “Mass Sambhavam on October 31st”. Here’s the big update. They locked the title Harom Hara, and it comes with the caption- The Revolt. While the title is spiritual, the tagline discloses the revenge aspect of the story.


The conceptual title video demonstrates the setting, backdrop, and scale of the movie. The story is set in 1989 in Kuppam of Chittoor district. Popular places such as Subramanya Swamy Temple, Jagadamba Talkies, and a railway station are shown in the video. The video presents Sudheer Babu in a never-seen-before mass avatar. “Inga Seppedem Ledu… Sesede…” utters Sudheer Babu, when a person asks him to put an end to his silence.


Everything about the video is fantabulous and Sudheer Babu’s mass get-up towards the end gives goosebumps. The actor undergoes a complete makeover for the movie. Chaitan Bharadwaj’s background score gives all the elevations.


Aravind Vishwanathan will handle the cinematography of the movie, while Ramesh Kumar G presents it.


Harom Hara will have a pan-India release in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi. The makers will announce other details of the movie soon.


Cast: Sudheer Babu


Technical Crew:

Writer, Director -  Gnanasagar Dwaraka

Producer - Sumanth G Naidu

Presenter - Ramesh Kumar G

Music – Chaitan Bharadwaj

DOP - Aravind Viswanathan

Editor - Raviteja Girijala

Banner - Sree Subrahmanyeshwara Cinemas

PRO - Vamsi Shekar 

Nandamuri Balakrishna Felicitated Actress L Vijayalakshmi


నాన్న‌గారిని స్పూర్తిగా తీసుకుని విజ‌యాలు సాధించిన ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారిని అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాలి- నంద‌మూరి బాల‌కృష్ణ



మ‌హిళాసాధికారిక‌త‌కు ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారే నిద‌ర్శ‌నం- బాల‌కృష్ణ‌


ఎల్.విజయలక్ష్మి బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో  తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత, జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు - బీముడు, భక్త ప్రహ్లాద  వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి, 50 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీ కి దూరం గా ఉన్నారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ తో సుమారు15 సినిమాలకు పైగా తను నటించి సినీ ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచి పోయారు.


50 సంవత్సరాల తర్వాత మొదటి సారిగా తెనాలి లో జరుగుతున్న, లెజెండరీ  నటుడు,యన్టీఆర్  శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు తెనాలిలో ఆమెకు అవార్డు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారంనాడు హైద‌రాబాద్‌లో ఆమెను వ్య‌క్తిగ‌తంగా క‌లిసి అభినంద‌న‌లు తెలపాల‌ని బాల‌కృష్ణ భావించారు. అందులో భాగంగా సినీ ప్ర‌ముఖులు స‌మ‌క్షంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఎఫ్‌.ఎన్‌.సి.సి.లో ఆమెకు గౌర‌వ స‌త్కారం చేశారు.


అనంత‌రం నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ, శ‌క‌పురుషుడి శ‌తాబ్డి పుర‌స్కార గ్రహీత ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారికి శిర‌స్సు వ‌చ్చి వంద‌నాలు స‌మ‌ర్పిస్తున్నాను. 60 ద‌శ‌కంలో చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ముందుకు న‌డిపిన‌ అతిర‌థులు నిర్మించిన చిత్రాల్లో ఆమె న‌ట‌న ప్ర‌యాణాన్ని కొన‌సాగించారు. ఈ సంద‌ర్భంగా ఆ అధినేత‌లు సురేష్‌బాబు, త‌మ్మారెడ్డి, ప‌రుచూరిగోపాల‌కృష్ణ‌, బ‌సిరెడ్డివంటివారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. అస‌లు శ‌క‌పురుషుడి శ‌తాబ్డి ఉత్స‌వాలకు అంకురార్ప‌ణ చేసింది కొమ్మినేని వెంక‌టేశ్వ‌ర‌రావు, బుర్రా సాయిమాధ‌వ్‌, ఆల‌పాటి రాజా, వైవి.ఎస్. చౌద‌రి వంటివారు ముందుండి న‌డిపారు. న‌న్ను గౌర‌వాధ్య‌క్షునిగా పెట్టి తెనాలిలో ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం గొప్ప విష‌యం.  సినిమాలేకాక అటు రాజ‌కీయ‌, ప్ర‌జా సేవ రంగంలో కూడా సేవ‌లు చేసిన వారిని స‌త్క‌రించుకొనే మ‌హ‌త్క‌ర కార్య‌క్ర‌మం ఇది. అందులో భాగంగా విజ‌య‌ల‌క్ష్మిగారికి ఇవ్వ‌డం జ‌రిగింది


ఇక చ‌రిత్ర పుట‌ల్లోకి వెళితే ఎర్నాకుళంలో పెట్టి నాట్యం నేర్చుకుని 59 నుంచి 69వ‌ర‌కు ప‌దేళ్ళ సుదీర్ఘ ప్ర‌యాణం సినిమారంగంలో చేశారు. వంద‌కుపైగా సినిమాల్లో న‌టిస్తే అందులో 60కి పైగా నాన్న‌గారితో న‌టించారు. నాట్యంలో ప‌లువురు న‌టీమ‌ణులు వున్నా, ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారు కూచిపూడి, భ‌ర‌త‌నాట్యం, క‌థాక‌ళి, జావ‌లి వంటి ఎన్నో నాట్యాలు ప్ర‌ద‌ర్శించారు. అలా క‌ళామ‌త‌ల్లి సేవ చేశారు. ముఖ్యంగా న‌టీన‌టులు ఒక స్థాయికి చేరుకున్నాక సినీ ప్ర‌యాణం ఆగిపోతే ఒంట‌రిత‌నానికి గురికావ‌డం స‌హ‌జం. కానీ ఆమె నాన్న‌గారిని స్పూర్తిగా తీసుకుని అమెరికా వెళ్ళి సి.ఎ. చ‌దివి  వ‌ర్జీనియా యూనిర్శిటీలో బ‌డ్జెట్ మేనేజ‌ర్‌గా వుండ‌డం.చాలా విశేషం. ఇప్పుడు జూంబా డాన్స్ కూడా నేర్చుకుంటున్నారు. మ‌నిషికి ప‌నిలేకుండా ఖాళీగా వుంటే రోగం. ఆమె మ‌హిళా సాధికారిక‌త‌కు ప్ర‌తీక‌. ఆమె ఎక్కిన‌ మెట్లును భావిత‌రాలు ఆద‌ర్శంగా తీసుకోవాలి. ఆవిడ‌ను ఇక్క‌డ‌కు తీసుకు వ‌చ్చేలా చేసిన వైవిఎస్‌. చౌద‌రికి ధ‌న్య‌వాదాలు తెఇయ‌జేస్తున్నా అన్నారు.


ఎల్‌. విజ‌య‌ల‌క్ష్మిగారు మాట్లాడుతూ, ఎంతో అభిమానంతో న‌న్ను పిలిపించి గౌర‌వించ‌డం చూస్తుంటే క‌ళ్ళు చెమ‌ర్తున్నాయి. మీరంతా చాలా ద‌య‌తో, ప్రేమ‌తో న‌న్ను ఇక్క‌డికి ర‌ప్పించినందుకు బాల‌కృష్ణ‌గారికి ఆల‌పాటి రాజా, బుర్ర‌సాయిమాద‌శ్ గారికి ధ‌న్య‌వాదాలు. నేను చిన్న‌త‌నంనుంచి రామారావుగారిని ఆద‌ర్శంగా తీసుకునేదానిని. ఆయ‌న‌తో న‌టించేట‌ప్పుడు మొద‌ట చాలా భ‌య‌మేసేది. పెద్ద హీరో అని ఫీలింగ్ ఉండేదికాదు. ఆయ‌న‌తో న‌టించేట‌ప్పుడు చాలా విలువ‌లు నేర్చుకున్నాను. క్ర‌మ‌శిక్ష‌ణ‌, మాట‌తీరు, సిన్సియారిటీ, చెప్పిందే చేయ‌డం, అంకిత భావం, నిబద్ధ‌త వంటి విష‌యాలు గ్ర‌హించాను. సినిమాలు అయ్యాక నేను ఎడ్యుకేష‌న్ చేశానంటే ఎన్‌.టి.ఆర్‌.స్పూర్తి వ‌ల్లే జ‌రిగింది. అప్ప‌టి రామానాయుడుగారు త‌రం, ఎన్‌టిఆర్‌. త‌రం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా వుంది. మ‌ర‌లా ఇలాంటి ఫంక్ష‌న్‌ల‌కు రావాల‌నుంది అని అన్నారు.


డి. సురేష్‌బాబు షీల్డును అంద‌జేస్తూ మాట్లాడారు. 1964లో రాముడు భీముడు మా బేన‌ర్‌లో నిర్మించిన సినిమాలో విజ‌య‌ల‌క్ష్మిగారు న‌టించారు. అందులో దేశ‌మ్ము మారిందే.. అనే సాంగ్ వ‌చ్చిన‌ప్పుడు ఒళ్ళు నిక్క‌బొడుచుకునేవి. నాగార్జున‌సాగ‌ర్‌లో ఆ డాన్స్ తీశారు. దీనికోసం వారు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో నాన్న‌గారు చెబుతుండేవారు. న‌టిగా 10 ఏళ్ళ‌లో 100 సినిమాలు చేయ‌డం పెద్ద గౌర‌వంగా భావించి ఇప్పుడు యూనివ‌ర్శిటీలో బాధ్య‌త‌లు నిర్వ‌హించ‌డం చాలా విశేషం. అప్ప‌టిత‌రం హీరోయిన్లు ఎక్క‌డున్నారో అని తెలుసుకుంటున్న క్ర‌మంలో ఇప్పుడు విజ‌య‌ల‌క్ష్మిగారు రావ‌డం చాలా సంతోషంగా వుంద‌ని అన్నారు.


త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాట్లాడుతూ, నాన్న‌గారు నిర్మించిన జ‌మిందార్ సినిమాలో విజ‌య‌ల‌క్ష్మిగారు న‌టించారు. మాట‌ల్లో డి. మ‌ధుసూద‌న‌రావుగారు ద‌ర్శ‌కుడుగ‌దా అన్నారు. ఇంకా ఆమెకు అన్నీ గుర్తుకు వున్నాయి. ఎన్‌.టి.ఆర్‌. పుర‌స్కారం ఆమెకు రావ‌డం ముదావ‌హం. ఆమె బ‌యోగ్ర‌ఫీ చూస్తుంటే, ఆవిడ‌ను అంద‌రూ స్పూర్తిగా తీసుకోవాలి. సినిమాలు వదిలినా యూనిర్శిటీని చూసుకోవ‌డం చాలా గొప్ప విష‌యం. చాలామంది న‌టీన‌టులు ఆమెను ఆద‌ర్శంగా తీసుకోవాలి అని సూచించారు.


 వైవిఎస్ చ‌దౌరి మాట్లాడుతూ, అమెరికా నుంచి విజ‌య‌ల‌క్ష్మిగారు వ‌స్తున్నార‌ని తెలియ‌గానే బాల‌కృష్ణ‌గారు స్వయంగా స‌త్క‌రించాల‌ని హైద‌రాబాద్ పిలిపించారు. ఇందుకు బాల‌య్య‌బాబుకు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నా అన్నారు.

సి.క‌ళ్యాణ్‌గారి వంద‌న స‌మ‌ర్ప‌ణ గావించారు.


ఈ కార్య‌క్ర‌మంలో ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, కాజ సూర్య‌నారాయ‌ణ‌, ప్ర‌స‌న్న‌కుమార్‌, బ‌సిరెడ్డి, రామ‌స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Hero Ashok Selvan Interview About Akasam

 ‘ఆకాశం’ మూవీ  ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ.. మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరించే తెలుగు ఆడియెన్స్ మా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాం :  హీరో అశోక్ సెల్వన్



వెర్సటైల్ యాక్టర్ అశోక్ సెల్వన్ ద్వి (తెలుగు, తమిళం) భాషా చిత్రం ‘ఆకాశం’. ఈ చిత్రం ‘నీదాం ఒరు వానమ్’గా తమిళంలోనూ నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్‌పై  ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న‌ ఈ చిత్రంలో రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌. ఈ సినిమా పాత్రికేయుల సమావేశంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా...


హీరో అశోక్ సెల్వన్ మాట్లాడుతూ ‘‘నేను ఇంతకు ముందు నిన్నలా నిన్నలా సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వస్తే నన్నెంతో ఆదరించారు. ఇప్పుడు ఆకాశం సినిమాతో మరోసారి మీ ముందుకు రాబోతున్నాను. ఇదొక మంచి ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీ. దీనికి కూడా తెలుగు ప్రేక్షకులు మంచి ఆదరణ ఇస్తారని భావిస్తున్నాను. మీ ప్రేమాభిమానాలు నాకు ఎప్పటికీ కావాలి. తెలుగు ఇండస్ట్రీ మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తాయి. అలాంటి మంచి కథతో వస్తోన్న సినిమానే ఆకాశం. నేను తమిళంలో చేసిన ఓ మై కడవులే సినిమా చూసి మహేష్ వంటి పెద్ద స్టార్ ట్వీట్ చేసినప్పుడు నాకెంతో స్పెషల్‌గా అనిపించింది. అలాగే ఈ సినిమాకు నానిగారు సపోర్ట్ అందించారు. ఇవన్నీ మంచి సినిమాకు మీరు అందిస్తోన్న సపోర్ట్‌ని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆకాశం సినిమా దర్శకుడు కార్తీక్, హీరోయిన్స్ రీతూ, ఆపర్ణ, శివాత్మికలతో పాటు ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కి థాంక్స్. ఈ సినిమా తర్వాత మీరు నన్ను మీలో ఒకడిగా ఆదరిస్తారని భావిస్తున్నాను. టీజర్, ట్రైలర్‌కి చాలా మంచి స్పందన వచ్చింది. రేపు సినిమాను కూడా  ఇదే రీతిలో ఆదరిస్తారనుకుంటున్నాను. ఇదొక విజువల్ ట్రీట్‌టా ఉంటుంది. హండ్రెడ్ పర్సెంట్ మీకు సినిమా నచ్చుతుంది’’ అన్నారు.


దర్శకుడు ఆర్.ఎ.కార్తీక్ మాట్లాడుతూ ‘‘నేను తెలుగు సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ చేయాలనుకున్నాను. అది ఆకాశం సినిమాతో కుదిరింది. లవ్, ఎమోషన్స్ ఉన్న మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. సినిమా చూస్తే మీరు ప్రేమలో పడతారు. మీ సపోర్ట్  మాకు అవసరం. థాంక్యూ’’ అన్నారు.


హీరోయిన్ శివాత్మిక మాట్లాడుతూ ‘‘ఆకాశం వంటి మంచి ఫీల్ గుడ్ మూవీలో అవకాశం ఇచ్చిన సాగర్‌గారు, కార్తీక్‌గారికి ధన్యవాదాలు. రీతూ కలిసి సినిమా చేయటం ఆనందంగా ఉంది. మంచి ఎక్స్‌పీరియెన్స్. చాలా అందమైన సినిమా. అందరం ఎంతో ఇష్టపడి, కష్టపడి సినిమా చేశాం. లవ్ జర్నీ. థియేటర్‌లో సినిమా చూస్తే విజువల్‌గానే కాకుండా ఎమోషనల్‌గానూ మూవీ మీకు నచ్చుతుంది. అశోక్ సెల్వన్, సాగర్, కార్తీక్‌ సహా అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను. మంచి సినిమాను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా సినిమాను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.


సాగర్ మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు తెలుగు సినిమాలు చేశారు. అయితే మేం చెన్నైలో సెటిల్ అయ్యాం. ఇప్పుడిప్పుడే మళ్లీ  ఇక్కడ సినిమాలు చేస్తున్నాం. ఈ సినిమా అంతా కార్తీక్ ఎఫర్ట్. తనకే ఈ క్రెడిట్ దక్కుతుంది. తను మంచి డైరెక్టర్. సినిమా చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. నెరేషన్ సమయంలో తను అలాగే సినిమా చేస్తాడా అనిపించింది. కానీ సినిమా చూసిన మా ఎడిటర్ ఫోన్ చేసి ఫస్ట్ టైమ్ డైరెక్టర్ చేసినట్లు అనిపించలేదన్నారు. తర్వాత నేను సినిమా చూసి ఆశ్చర్యపోయాను. అంత బాగా చేశాను. రీతూ వర్మ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శివాత్మిక కూడా అద్భుతంగా నటించింది. అపర్ణ కొత్త వేరియేషన్ ఉన్న పాత్రలో మెప్పిస్తుంది. మేం సినిమా చేస్తున్న సమయంలో స్క్రిప్ట్ నచ్చడంతో వయాకామ్ మాతో కలిశారు. అశోక్ సెల్వన్ బ్రిలియంట్‌గా యాక్ట్ చేశారు. సినిమా నవంబర్ 4న రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


రీతూ వర్మ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ కార్తీక్‌కి థాంక్స్. మా నిర్మాతలు మా సాగర్ గారికి థాంక్స్. ఎందుకంటే తను కథను నమ్మి చేసిన సినిమా. అశోక్ సెల్వన్‌తో నిన్నిలా నిన్నిలా తర్వాత కలిసి చేసిన సినిమా. మూడు వేర్వేరు పాత్రల్లో బ్రిలియంట్ పెర్ఫామెన్స్ చేశాడు తను. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా అశోక్ నటనకు ఫిదా అవుతారు. అపర్ణ, శివాత్మిక నేచురల్ పెర్ఫామర్స్. గోపీ సుందర్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. సినిమా ప్రేమ గురించే కాదు.. జీవితం గురించి కూడా చెబుతుంది. నవంబర్ 4న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


Raw Action Film 'THUGS' is associated With Top music label- Sony Music as its Music Partner In All Languages

 Raw Action Film 'THUGS' is associated With Top music label- Sony Music as its Music Partner In All Languages



Renowned Dance Master Brinda Gopal's  latest Directorial film kumari mavattathin “Thugs” is  attempting for a multilingual release including Hindi.


This real raw action is Produced by Riya Shibu under the banner HR Pictures, Who has recently distributed films like RRR, Vikram , DON, VTK etc and produced Hindi film “Mumbaikar” Riya Shibu is daughter of Shibu Thameens who is also  known for Producing big canvas films like Puli, Inkokkodu, ABCD, Saamy square etc and also distributed around 100 plus films in different languages .


The lead cast are Bobby Simha, RK Suresh, Munish kanth, Sarath appany , Anaswara rajan etc .

The promising youngster Hridhu Haroon is debuting as one of the lead in this ensemble.

His intense performance in recent released Amazon show “Crash Course” was highly rated by the critics and viewers. He has also acted in upcoming Hindi film “Mumbaikar” and had a fantastic line up of films with top makers of both North as well south. 

Thugs is associated with Sony Music for marketing its music and promo content in all languages esp Tamil, Telugu, Hindi and Kannada as music partner.


Recently the characters introduction video from Thugs got released and received a grand reception from the audience. The characters glimpse raises curiosity and the SAM CS high octane BGM and the current top editor Praveen Antony , who is popular  by his recent promo edit of RRR had made a brilliant sensible cut is editing this real raw action film. Priyesh Guruswamy is the cinematographer.


Thugs is gearing up to theatrical release in Tamil, Telugu, Hindi and Kannada Languages by December 2022.


Cast :

Hridhu Haroon, Simha, RK Suresh, Munishkanth, Anaswara Rajan , Sarath appany and few others


Crew :

Directed By Brinda

Produced By HR Pictures - Riya Shibu

Music By Sam CS

DOP: Priyesh Guruswamy

Project Designer: Joseph Nellickal

Editor: Praveen Antony

Action: Pheonix Prabhu & Rajasekar

Creative Producer: Muthu Kuruppaiah

Costume: Malini Karthikeyan

Executive Producer- Yuvaraj 

Co Director: Hariharakrishnan Ramalingam

Designer: Kabilan

PRO : B a Raju’s Team (Telugu)


Sailesh Kolanu Introduces HITverse, HIT 2 teaser is releasing on November 3rd

 Sailesh Kolanu Introduces HITverse, HIT 2 teaser is releasing on November 3rd



 


Adivi Sesh emerged as one of the most bankable actors of Telugu cinema after scoring a series of hits. He is also coming with HIT 2 in the direction of Sailesh Kolanu, who enthralled everyone with the first part of HIT. He delivered a perfect crime investigation drama with all the elements and now he is coming again with HIT 2. The post production of this crime investigative thriller is underway.


 


Meenakshi Chaudhary is the leading lady in this crime investigation drama. Nani and Prashanti Tipirneni are jointly producing the sequel on Wall Poster Cinema banner.


 


Everyone is excited about makers' announcement about introducing the HIT Universe, and makers called it as HITverse. Sailesh Kolanu, the creator and director of HITverse, surprised everyone today with an intriguing video. He introduced the world of HIT in the video and explained how intriguing KD, the cool cop, will be. He promised that the stakes, action, thrill, and fun will be high this time.


 


He also revealed that there will be a few connections between HIT 1 and HIT 2, and that this universe will undoubtedly grow with a large number of Homicide Investigative Officers on board. Finally, everyone was taken aback by the cool cop Adivi Sesh's entry. The teaser release date was announced by Sailesh Kolanu and Adivi Sesh. The long-awaited HIT 2 teaser will be arriving on November 3rd. The makers promised that teaser will end with a bang. It seems like makers planning to raise the stakes to new level with this teaser. The film is releasing worldwide on December 2nd.


 


 


Actors:


 


Adivi Sesh, Meenakshi Chaudhary, Rao Ramesh, Posani Krishnamurali, Tanikella Bharani, Srinath Maganti, Komali Prasad and others.


 


Technical Category:


 


Presented By: Nani


Banner: Wallposter Cinema


Producer: Prashanthi Tripirneni


Written, Directed By: Dr. Sailesh Kolanu


Cinematography: Manikandan.S


Music: John Stewart Eduri


Art: Manisha A. Dutt


Editing: Garry B.H


Executive Producer: S.Venkat Ratnam


PRO: Vamsi Kaka

DJ Tillu director vimal krishna launched Mayuki First Look

 డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ చేత మయూఖి ఫస్ట్ లుక్ ఆవిష్కరణ !!!




టి.ఐ.ఎం. గ్లోబల్ ఫిల్మ్స్ సమర్పణలో నంద కిషోర్, డి. టెరెన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మయూఖి చిత్రం పోస్టర్ ను ఈ సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ, రచయిత డార్లింగ్ స్వామి పాల్గొన్నారు.  ఏ.ఎల్. నితిన్ కుమార్ దర్శకత్వం వహించిన మయూఖి చిత్రం డల్లాస్ ఘర్షణలో అనే సబ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


మేనకోడలి కోసం మేనమామ చేసే సాహసాలు, గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్ గా  సాగిపోయే ఈ చిత్రం షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరుపుకుంది.  అమెరికాలో స్థిరపడ్డ వందమందికి పైగా భారతీయులు,  అమెరికన్ల నుండి ఎంపిక చేసిన సరికొత్త నటీనటులకు స్వయంగా శిక్షణనిచ్చి నితిన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్, అడ్వెంచర్ మూవీ అమెరికాలో నిర్మించినా తెలుగువారి అభిరుచికి అనుగుణంగా ఉంటుంది.


ఎంతో శ్రమపడి డల్లాస్ పరిసరాల్లోని అద్భుతమైన లొకేషన్స్ లో మయూఖి చిత్రీకరించారు. ఇవి ఖచ్చితంగా ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నామని నితిన్ కుమార్ తెలిపారు.


మాటీవీలో 15 ఏళ్ళపాటు ప్రసారమైన పర్యాటక కార్యక్రమం విహారి ది ట్రావెలర్ కి దర్శక నిర్మాత అయిన ఏ.ఎల్. నితిన్ కుమార్ గతంలో నిర్మించిన లోటస్ పాండ్ అనే బాలల చిత్రం హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ బాలల చిత్రోత్సవానికి ఎంపిక అయ్యింది.


నితిన్ కుమార్ దర్శకత్వం వహించిన ఎ టీచింగ్ ఛెఫ్ లాస్ ఏంజెల్స్ లో జరిగిన డ్రీమ్ మెషైన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లోనూ, ఫ్లోరిడాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లోనూ ఉత్తమ షార్ట్ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకుంది. అలానే అనేక అతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికై  ఫైనల్స్ కు చేరి ప్రశంసలు అందుకుంది.


రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త పంథాలో సాగిపోయే మయూఖి చిత్రానికి మాటలు గణపతి రామం, ఎడిటింగ్ జి. అశోక్ కుమార్, ఎన్. వినయ్, ఎఫెక్ట్స్ కె. రాజేష్, డిజైనర్ బి. రవికుమార్, ప్రొడక్షన్ డిజైనర్ యు.సందీప్, సినిమాటోగ్రఫీ కె. అనిల్, ఎ.ఎల్. నితిన్ కుమార్, సంగీతం లుబెక్ లీ మార్విన్,  నిర్మాతలు నంద కిషోర్, డి. టెరెన్స్,  కథ, దర్శకత్వం ఏ.ఎల్. నితిన్ కుమార్.


I'll Invite Sirish to Unstoppable and reveal all of his secrets:NBK at Urvasivo Rakshasivo Event

 I'll Invite Sirish to Unstoppable and reveal all of his secrets: Nandamuri Balakrishna 



Allu Sirish and Anu Emmanuel are ready to entertain the audience in Urban romantic drama, titled 'Urvasivo Rakshasivo '. The film is releasing worldwide on November 4th. And the team is busy with the promotions.


Today, the team held a grand pre-release event, which Nata Simham Nandamuri Balakrishna attended. Young directors also attended the event raved about Allu Sirish's support and ability in every field. Anu Emmanuel shared her two-year experience with her partner in crime, co-star Allu Sirish, and the team.


Then Allu Sirish began his enthralling speech. He told the about his experience working with brilliant team. He stated "Nata Simham Nandamuri Balakrishna garu is coming to our event, which is both prestigious and personal to me. 


Nandamuri Balakrishna took the mic and talked about his relationship with renowned producer Allu Aravind and Geetha Arts. He shared some memorable moments during the shoot with the legendary actor Allu Ramalingaiah garu. "Unstoppable became baap to all talk shows and anything me and Allu Aravind garu started was always a success," he said. I saw the trailer, and I believe the film will offer something new to the audience.


Talking about Allu Sirish, he said "I'll invite him to my talk show Unstoppable and reveal all of his secrets. And I believe that Valentine's Day should be shifted from February 14 to November 4, because the film releasing on that day."

Allu Sirish' Urvasivo Rakshashivo Trailer has the Right Dose of Romance, Entertainment and Emotions

 Allu Sirish' Urvasivo Rakshashivo Trailer has the Right Dose of Romance, Entertainment and Emotions



Allu Sirish and Anu Emmanuel are ready to entertain the audience in Urban romantic drama, titled 'Urvasivo Rakshasivo'. The film is releasing worldwide on November 4th. And the team is busy with the promotions.


Today, the team held a grand pre-release event, which Nata Simham Nandamuri Balakrishna attended. At the event, the filmmakers amazed the audience by releasing a theatrical trailer.


The trailer depicted Allu Sirish in a new light, juggling his romantic life while pretending to be a good boy at home. Anu Emmanuel is a modern, independent woman who is not interested in relationships. The struggle for Allu Sirish has begun.


Allu Sirish's comedy timing and his pairing with Vennela Kishore will undoubtedly make you laugh. Anu Emmanuel looks stunning on screen as usual, and the magical romance between the leads has captivated everyone.


The trailer has everyone intrigued with its comedy punches from Sunil and Vennala Kishore. The rich visuals and background score by Achu Rajamani impressed. This romantic story begins suddenly, and then the twist occurs. With the emotions, love, entertainment and crazy romance, the film has everything to dazzle the audience on November 4th. 


The film is directed by Rakesh Sashii. Dheeraj Mogilineni producing the film under Shri Tirumala Production Private Ltd banner and Allu Aravind presenting the film under GA2 Pictures banner. Achu Rajamani composed the music. Tanveer handled the cinematography while Karthika Srinivas does the editing.

Producer Abhishek Agarwal Adopted Thimmapur Village at Chandrakala Foundation 3rd Sarthak diwas

 


The Kashmir Files And Karthikeya 2 Producer Abhishek Aggarwal Adopts Thimmapur Village of Telangana State



The Kashmir Files And Karthikeya 2 Producer Abhishek Aggarwal Adopts Thimmapur Village of Telangana State


Successful and dynamic producer, Abhishek Aggarwal has earned a reputation for his path-breaking films like The Kashmir Files and Karthikeya 2, as well as his philanthropic work. He has done many social service programs during the COVID-19 pandemic. Now he has another step forward. He has adopted Thimmapur village of Kandukuru Mandal of Rangareddy district. Thimmapur is the birthplace of Cabinet Minister Shri G Kishan Reddy. 


Abhishek Agarwal and his family have established Chandrakala Foundation and are serving the people. They adopted Thimmapur village on the occasion of his father Tej Narayan Aggarwal's 60th birthday and their late grandmother Smt. Chandrakala's 90th birth anniversary, Chandrakala Foundation's 3rd Sarthak Divas was grandly held at the JRC Convention in Hyderabad. Abhishek Agarwal, Tej Narayan Agarwal, Anupam Kher, Vivek Agnihotri, Pallavi Joshi, PV Sindhu, Uttar Pradesh Minister Nandagopal, Mrs. Kavya Reddy, Snehalatha Agarwal, Nishant Agarwal, Archana Agarwal, Sonam Agarwal, and others participated in this event. Thimmapur Village Milestone was unveiled in this program. The students of Timmapur village also participated in this program.


Speaking at the event, Anupam Kher said, "Abhishek Aggarwal's family has embarked on great work. Abhishek Agarwal's adoption of a village on his father's birthday is even more joyous. Those who do great deeds have the blessings of all. We are with Abhishek Agarwal. We will meet again in Thimmapur. My blessings to all the students. The boat will not move forward if it was afraid of the waves. There is no defeat for those who try. All of you should grow up great".


PV Sindhu said, Adopting a village is not a small matter. Hats off to the great mind of Abhishek Agarwal. The family adopted Thimmapur village and decided to provide all the basic facilities. The students of the village should also study well and inspire others. All the very best to Abhishek Agarwal".


Pallavi Joshi said, "Seeing the school students sitting here reminded me of my school days. Abhishek Agarwal is confident that adopting a village will lead to better education. It is believed that a PV Sindu will come from you in the future. Heartfelt thanks to Abhishek Agarwal and Tej Narayan Agarwal for doing such great service".


Vivek Agnihotri said, "The countryside is the backbone of India. Villages are the centers of civilization and culture. Bringing such villages on the path of development is true dharma and patriotism. It is great that Abhishek Agarwal is determined to make Thimpapur a self-reliant, ideal village. Congratulations to Abhishek Agarwal for doing such a great favor. I hope their children will also continue these services.


Mrs. Kavya Reddy said, "Very happy that Abhishek Agarwal adopted my mother-in-law's hometown Thimmapur. Hearty congratulations to them. Congratulations to Abhishek Agarwal for providing all basic facilities like education and medicine to the village and leading it towards a great development path".


UP Minister Nandagopal said,  "Chandrakala Foundation is doing great service programs. The services provided by them during covid are outstanding. Their generosity in difficult times is commendable. . Abhishek Agarwal went one step further and adopted Timmapur village which gave him great joy. It is a great pleasure to come forward to make this village an ideal village. Chandrakala Foundation should come forward with more service programs, they will have our support in this matter," he said.


Kali Sudhir said, "It started because of Amarendra's idea. Thanks to him. Thanks to Jyoti. Thank you to PV Sindhu, Pallavi Joshi, Vivek Agnihotri, Nandagopal, Anupam Kher, Kavya Reddy, and everyone who attended the ceremony".