Latest Post

Actress Sonal Chauhan Interview About The Ghost

 'ది ఘోస్ట్' లో నా డ్రీమ్ లో చేశా.. సినిమా కంప్లీట్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ :  హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఇంటర్వ్యూ




కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల భారీ అంచనాల యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'.  పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. సోనాల్ చౌహాన్ కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీ నిర్మిస్తున్నారు.  భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న నేపధ్యంలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.  




తెలుగులో ఎక్కువ విరామం తీసుకున్నట్లుగా వున్నారు ?


ఎఫ్3 లో క్యామియో రోల్ చేశాను. ఇక విరామం అంటే.. కోవిడ్ కారణంగా మొత్తం ఇండస్ట్రీనే విరామం తీసుకుంది కదా. హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. అయితే తెలుగు నా ఫస్ట్ లవ్.




'ది ఘోస్ట్' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?


యాక్షన్ సినిమాలు చేయాలని వుండేది. ప్రవీణ్ సత్తారు క్రియేటివ్ డైరెక్టర్. ఈ కథ చెప్పినపుడు చాల థ్రిల్ అనిపించింది. నాగార్జున గారు ఈ ప్రాజెక్ట్ వున్నారని తెలిసి చాలా ఎక్సయిట్ అయ్యా. ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఇందులో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తా.




ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించడానికి ఎలాంటి కసరత్తు చేశారు ?


ఇందులో శారీరకంగా, మానసికంగా చాలా సవాల్ తో కూడుకున్న పాత్ర చేశాను. ఇలాంటి పాత్ర చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. యాక్షన్ తో పాటు ఎంఎంఎ శిక్షణ పొందాను. అయితే శిక్షణలో రెండో రోజే నా కాలివేలు ఫ్రాక్చర్ అయ్యింది. చిన్న గాయమే అనుకున్నాను. డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్ రే తీయమని చెప్పారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్ళీ శిక్షణలోకి వచ్చాను. అలాగే ఆయుధాల శిక్షణ కూడా తీసుకున్నాను.




గన్ పట్టుకోవడం ఇదే తొలిసారా ?


లేదు. మా నాన్న పోలీస్ ఆఫీసర్ కావడం వలన గన్స్ తో నాకు పరిచయం వుంది (నవ్వుతూ). అయితే ఈ సినిమా కోసం ఏకే 47 లాంటి పెద్ద వెపన్స్ ని పట్టుకోవడం, లోడ్ చేయడం, వాటిని హ్యాండిల్ చేయడంలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. దాదాపు రెండు నెలలు పైగా శిక్షణ సాగింది. అలాగే డైలాగ్ డిక్షన్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధపెట్టాను. ఒక నటిగా చాలా తృప్తిని ఇచ్చిన చిత్రమిది. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. ఒక డ్రీమ్ టీంతో కలసి పని చేయడం గొప్ప ఆనందం ఇచ్చింది. నిజంగా ఇందులో నా పాత్ర ఒక డ్రీమ్ రోల్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. సినిమా చూసిన తర్వాత  కేవలం గ్లామరస్ పాత్రలోనే కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేయగలనే నమ్మకం కుదురుతుందని భావిస్తున్నాను.  




నాగార్జున గారితో పని చేయడం ఎలా అనిపించింది ?


నాగార్జున గారితో పని చేయడం ఒక డ్రీమ్. ఆ కల ఈ సినిమాతో తీరింది. నాగార్జున గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన్ని కలసినప్పుడు కాస్త నెర్వస్ గా ఫీలయ్యా. అయితే పది నిమిషాల మాట్లాడిన తర్వాత నా భయం అంతా పోయింది. నాగార్జున గారు చాలా గ్రేట్ పర్శన్. ఆయనతో నటించడం మర్చిపోలేని అనుభూతి. నాగార్జున గారు కింగ్ అఫ్ రోమాన్స్. వేగం పాటలో మా కెమిస్ట్రీ చూసేవుంటారు. అయితే ' ది ఘోస్ట్' యాక్షన్ థ్రిల్లర్. నాగార్జున గారితో మంచి రొమాంటిక్ సినిమా చేయాలని వుంది. (నవ్వుతూ).




ప్రభాస్, నాగార్జున, వెంకటేష్.. ఇలా వరుసగా బిగ్ స్టార్స్ తో సినిమాలు చేస్తున్నారా కదా.. తెలుగులో మీ టైం స్టార్ట్ అయ్యిందని అనుకోవచ్చా ?


వరుసగా బిగ్ స్టార్స్ తో పని చేయడం నా అదృష్టంగా భావిస్తా. నేను ఎక్కువగా పాత్రపై ద్రుష్టి పెడతా. మంచి పాత్రలతో పాటు బిగ్ స్టార్స్ వున్న సినిమాలు రావడం ఆనందంగా వుంది.




దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తో పని చేయడం ఎలా అనిపించింది ?


ప్రవీణ్ సత్తార్ చాలా క్లియర్ విజన్ వున్న దర్శకుడు . ఆయన చాలా నీట్ గా హోమ్ వర్క్ చేసుకుంటారు. దీంతో సెట్స్ లో ఎలాంటి కన్ఫ్యుజన్ వుండదు. మిగతా నటీనటులు పని ఈజీ అవుతుంది. ఆయన చాలా క్లారిటీ వున్న దర్శకుడు.




ఈ చిత్రంలో మీరు ఎన్ని యాక్షన్ బ్లాక్స్ లో కనిపిస్తారు ?


నాకు ఇందులో రెండు మెయిన్ యాక్షన్ బ్లాక్స్ వున్నాయి. ది ఘోస్ట్ కంప్లీట్ యాక్షన్ పవర్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్.




జయాపజయాలని ఎలా తీసుకుంటారు ?


నాకు ఎలాంటి సినిమా నేపధ్యం లేదు. చాలా సాంప్రదాయ రాజ్ పుత్ కుటుంబం నుండి వచ్చాను. యాక్టింగ్ మాట పక్కన పెడితే మాకు ఇంటి నుండి బయటికి రావడమే గొప్ప. నాకు ఏమీ తెలియని రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చాను. ప్రతిది ఇక్కడే నేర్చుకున్నాను. జీవితంలో ఎత్తుపల్లాలు వుంటాయి. వాటిని ఎలా తీసుకోవాలో కూడా ఇండస్ట్రీనే నేర్పింది.




కొత్త చేయబోతున్న సినిమాలు ?


రెండు సినిమాలు చర్చల్లో వున్నాయి. త్వరలోనే వివరాలు తెలుస్తాయి




అల్ ది బెస్ట్


థాంక్స్


Alluri Success Meet

 అల్లూరి'కి గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : 'అల్లూరి' సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్



ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం 'అల్లూరి'.  ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా బెక్కెం బబిత సమర్పించారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది.


శ్రీవిష్ణు మాట్లాడుతూ.. 'అల్లూరి' అన్ని ప్రాంతాల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మార్నింగ్ షో కుదరలేదు. దానికి ప్రేక్షకులకు క్షమాపణలు. సీనియర్స్ పోలీస్ ఆఫీసర్ కథని ఒక బయోపిక్ లా కీలకమైన సంఘటనలతో ప్రజంట్ చేశాం. ప్రేక్షకుల నుండి కూడా అంతే సిన్సియర్స్ గా  మంచి రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ సీన్స్ కి విజల్స్ వేస్తున్నారు. నేను ఫైట్లు చేస్తే విజల్స్ వేయడం నాకే కొత్త అనుభూతిని ఇచ్చింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ కి చాలా మంది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. సెకండ్ హాఫ్ లో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణలకు పేరుపేరునా కృతజ్ఞతలు. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. దర్శకుడు ప్రదీప్ కథ చెప్పినట్లే చాలా సీనియర్స్ గా సినిమాని ప్రజంట్ చేశారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారు నన్ను ప్రేమ ఇష్క్ కాదల్ తో పరిచయం చేశారు. ఆయనతో జర్నీ చాలా బావుంటుంది. చాలా మంచి మనిషి. ఈ  సినిమా చూసిన వాళ్ళు మీ అనుభవాన్ని స్నేహితులకి చెప్పండి. మీడియా, వంశీ-శేఖర్ కి థాంక్స్. ఈ సినిమాని చూడని వాళ్ళు వెంటనే చూడండి. ఈ సినిమాని అందరూ ఆదరించి ఇంకా పెద్ద సినిమా చేయాలి'' అని కోరారు.

 

ప్రదీప్ వర్మ మాట్లాడుతూ.. నేను అనుకున్న కథ రాశాను, డైరెక్ట్ చేశాను,  రిలీజ్ చేశాం. నా కల నెరవేరింది. నేను విజయసాధించాననే ఆనందం వుంది. శ్రీవిష్ణు అద్భుతంగా చేశారు. అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ వస్తోంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని చేశారు. విజువల్స్ ఇంత రిచ్ గా ఉండటానికి కారణం నిర్మాత ఇచ్చిన సపోర్ట్. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. రామకృష్ణ బ్రిలియంట్ గా యాక్షన్ డిజైన్ చేశారు. మిగతా సాంకేతిక నిపుణులు అద్భుతమైన వర్క్ ఇచ్చారు. నా డైరెక్షన్ టీంకి కృతజ్ఞతలు. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా బావుందని చాలా మంది చెబుతున్నారు. ఇప్పుడు సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఈ పని మీడియా మాత్రమే చేయగలదు. దయచేసి మీడియా సినిమాని మరింత జనాల్లోకి తీసుకెళ్ళాలి'' అని కోరారు


నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. .. 'అల్లూరి' నిన్న మాట్నీ షో నుండి అన్ని చోట్ల రిలీజ్ అయ్యింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల మార్నింగ్ షో పడలేదు. మాట్నీ షో నుండి క్రమంగా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. సినిమా చూసిన ప్రతిఒక్కరూ  స్ఫూర్తిని ఇచ్చే చిత్రమని అభినందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుసు. ఈ సినిమాతో మరోసారి నిరూపిస్తారని కోరుతున్నాను. ఫ్యామిలీ తో కలసి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుతున్నాను.  శ్రీవిష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా శ్రీవిష్ణు కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుంది. అలాగే దర్శకుడు ప్రదీప్ వర్మ చాలా చక్కగా తీశారు. రాజ్ తోట అద్భుతమైన విజువల్స్ అందించారు. మిగతా సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు. మంచి సినిమా తీశాం. మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాని మరింతగా ప్రేక్షకులు ఆదరించాలి'' అని కోరారు.


ఈ సక్సెస్ మీట్ లో డీవోపీ రాజ్ తోట, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ట్ డైరెక్టర్ విఠల్, ఫైట్ మాష్టర్  రామ్ క్రిషన్, లిరిక్ రైటర్ రాంబాబు గోసాల తదితరులు పాల్గొని సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు

The Ghost Censor Completed Releasing on October 5th

కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ 'ది ఘోస్ట్'కు యూ/ఎ సర్టిఫికేట్-  అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్



కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్'. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం తాజా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్  'గాడ్ ఫాదర్' చిత్రానికి యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని, యాక్షన్ సన్నివేశాలు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా పవర్ ఫుల్ గా వున్నాయని సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసలు జల్లు కురిపించారు.


ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు (సెప్టెంబర్ 25) కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్‌లో గ్రాండ్ గా జరగనుంది. ఓపెన్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ పబ్లిక్ ఈవెంట్ కి  ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. టీమ్ మొత్తం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకని మరింత ప్రత్యేకంగా చేయడానికి నాగ చైతన్య, అఖిల్ ఈ గ్రాండ్ ఈవెంట్ కి హాజరుకానున్నారు. చాలా కాలం తర్వాత స్టార్ తండ్రీ కొడుకులు కలిసి సినిమా వేడుకకి రావడం అక్కినేని అభిమానులకు కన్నుల పండుగ కానుంది.


నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.


భరత్‌, సౌరబ్‌ ద్వయం ఈ సినిమా పాటలని స్కోర్ చేస్తున్నారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.


ఈ చిత్రంలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.


తారాగణం: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ తదితరులు


సాంకేతిక విభాగం :

దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మారర్

బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్

సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి.

సంగీతం: మార్క్ కె రాబిన్, ((పాటలు భరత్ - సౌరబ్)

యాక్షన్: దినేష్ సుబ్బరాయన్, కేచ్

ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల

పీఆర్వో : వంశీ-శేఖర్, బీఏ రాజు 

Chiranjeevi –Salman Khan’s GodFather Mega Public Event In Anantapur On September 28th

Chiranjeevi –Salman Khan’s GodFather Mega Public Event In Anantapur On September 28th




Megastars Chiranjeevi and Salman Khan will be seen sharing the screen space to offer mega feast with the most awaited movie GodFather. Mohan Raja who is known for his stylish making has helmed the project which is scheduled for its release on October 5th. Meanwhile, promotional content has enthralled the masses. The makers have now announced date and venue of mega public event of GodFather. 


Anantapur is finalized to celebrate the occassion in a grand way on September 28th. Chiranjeevi will be gracing the occasion, alongside other team. It's going to be a massive affair with fans and cine goers coming in big numbers.

Chiranjeevi will be seen in salt and pepper look for the first time in the movie that marks Tollywood debut of Salman Khan. Nayanthara, Satya Dev, Sunil and Samuthirakani are the prominent cast. RB Choudary and NV Prasad are mounting the movie grandly under Konidela Productions and Super Good Films banners, while Konidela Surekha presents it. Nirav Shah has cranked the camera, while Suresh Selvarajan is the art director.

Director Lakshman K Krishna Interview About Swathimuthyam

My characters are replete with innocence and old-world charm. Everyone can root to them: Lakshman K Krishna




Director Lakshman K Krishna won the hearts with the teaser of his maiden venture, Swathimuthyam. The family entertainer with the worldly charm of its lead pair Ganesh and Varsha Bollamma is all set to spring surprises this festive season. The movie has a lineup of wonderful actors including Naresh, Rao Ramesh, Subbaraju, Vennela Kishore, Harshavardhan, Pammi Sai, Sapthagiri, Goparaju Ramana, Siva, among others. Produced by Suryadevara Naga Vamsi, the film is slated for a Dussehra release on October 5.

Here are the excerpts from Lakshman K Krishna’s interaction with media.

On the journey to movie industry

I hail form Pithapuram, East Godavari. I studied there and from my school days had a lot of interest in movies and was part of theatre. I wrote many plays also. During my engineering days, the interest became a passion, and I discontinued my studies. We formed a team and made short films in Kakinada with 5D camera. We got this from wedding shoots. One person from our team got a chance as an Assistant Director in Sreekanth Addala’s film. We came along with him. I tried a lot to put my scripts across to production houses but didn’t work out. I joined many small films as an associate but my candid nature, caused problems to me. I also did a few shorts for Tamada media. I made a 10-min short on a shoestring budget of Rs 2600. It was liked by a person and later on got a budget of Rs 1.6 lakhs to make “Krishnamurthy Gari Intlo”. It got a lot views and the hero and heroine did a series called “Geeta Subramanyam” later and became quite popular.

Then in Sainma short film awards, I got the Best Director award. That was the motivation. The organizing committee selected 12 people and listened to their stories. I got a break but couldn’t move ahead. Then I took the help of a friend who works in real estate but that project too didn’t work out. I was sceptical that if I can handle a feel good love story with drama and emotions. So, I made a 1-hour film – “Sadaa Mee Premalo” in a budget of 12 lakhs. The output of the film gave me a lot of confidence. It was screened at many places and the applause boosted my will to go ahead and make a bigger film. But during the lockdow,n a lot of things didn’t go as planned, and the story of “Swathimuthyam” evolved during that time. Lockdown gave a gap, and I wrote it during lockdown. My brother Raghava and I worked on the dialogues.

What’s the inspiration for Swathimuthyam?

This is born out of my personal experience. Normally, when you hit a slump in your career or life, many people including your closed ones throw satires at you. There is mockery all over. Sometimes, you can’t bear it. That generates a lot of drama and emotions. So, something I observed in my life sowed the seed for Swathimuthyam.

What’s the basic plot of Swathimuthyam?

It’s the story of a guy named Balamuralikrishna. He hails from a small town and gets a government job soon after his studies. Now, the whole family is hell bent of getting him married soon. What happens next and what challenges they face form the story.

On Ganesh becoming the main lead

A friend of mine knows Ganesh. He referred me to him. I told many stories to him with typical commercial plotting. But he asked me for a simple story as he was impressed with “Sadaa Mee Premalo” trailer and asked me for a story with a small setup. Then I narrated Swathimuthyam to him. He and his father, Suresh, liked it instantly.

Why the classic title Swathimuthyam?

We thought about many titles and kept one as a working title. Radhakrishna (Chinna Babu) garu suggested Swathimuthyam considering the innocence of hero’s character. I was scared at the beginning as it might mislead the audience. Then he said, we will release the trailer soon, so the audience are in right mood to watch the film.

On Ganesh’s performance and mutual trust in execution

Though we both had our qualms, we let them go with the mutual trust. We met many times and conducted workshops. This is a launch for both, and we interacted a lot about the film. We both were confident about each other.

Is Varsha your first choice?

She was my first choice. When I watched “96”, I thought to make a film with an actor like her. She was in my mind when I penned the female character of Swathimuthyam. When we were discussing about different actors then we happened to watch “Middle Class Melodies” and everyone decided to rope her in for the female lead.

Are you satisfied with the first copy?

I am completely satisfied with the first copy. My DOP Surya worked wonders. We collaborated in the past for a project and when Nagavamshi referred him then I was happy that we will be working again on my debut film.

On releasing along with big films on Dussehra

It’s our producer’s decision to go with the date. They want to give a family entertainer on the festival day. Being an ardent fan of Chiranjeevi, I am happy that my film is releasing in the same day as his.

What’s your next project?

Nothing planned as of now, but I may work on a Comedy Thriller.

Who are your inspirations to become a film director?

My all-time favourite directors are Maniratnam, Vamshy, Bapu, and Jandhyala. I grew up watching their films and now I am here waiting for the release of my first film.
 

Happy Birthday To The Director Of Blockbuster Entertainers Sreenu Vaitla

 Happy Birthday To The Director Of Blockbuster Entertainers Sreenu Vaitla.. New Biggie Announcement Soon !!



Sreenu Vaitla has carved a niche for himself in making Blockbuster Entertainers. He is a trend setter in blending comedy in commercial cinema with unique characters and timing. Sreen Vaitla has started his journey as a Director in a very successful manner. He won Prestigious Nandi Award for The Best Debut Director for his first film as a director 'Nee Kosam'. He created sensation in the film industry with Anandam starring all new comers. Then there is no turning back for him with back to back Superhits like Venky, Dhee, Dubai Seenu, Ready, Namo Venkatesa, King. His Dookudu became highest grossers of Tollywood and emerged as Biggest Blockbuster followed by another Blockbuster with Baadshah.


Sreenu Vaitla worked with all star heroes and delivered Superhits. Today (September 24) is his birthday. Sreenu Vaitla is gearing up to weave his magic once again with a prestigious project starring a Star Hero. The official announcement with full details will be out very soon. Wishing Sreenu Vaitla a Blockbuster with this project and many more. Happy Birthday Sreenu Vaitla !!

PSR Productions Production No1Shoot Completed

 మ‌ణిరాజ్ ద‌ర్శక‌త్వంలో పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 షూటింగ్ పూర్తి



పృథ్విరాజ్‌, అనూ మెహ‌త హీరోహీరోయిన్లుగా పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాబ‌రీ నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా ఓ క్రొత్త చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ ద్వారా పి.మ‌ణిరాజ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. పి.నాగ‌మ‌ణి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌వీణ శివరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త త‌ర‌హా క‌థ‌, క‌థనంతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి ఓ ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇప్ప‌టికే మొద‌లైన ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయనున్నారు.


ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు పి. మ‌ణిరాజ్ మాట్లాడుతూ - ``27 రోజుల పాటు వికారాబాద్‌, హైద‌రాబాద్ మ‌రియు ప‌రిసర ప్రాంతాల్లోని అంద‌మైన లోకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రిపాం. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. హీరో  పృథ్విరాజ్‌, హీరోయిన్ అనూ మోమ‌త చక్క‌గా న‌టించారు. టెక్నీషియ‌న్స్ అంద‌రూ పూర్తి స‌హ‌కారం అందించారు. షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి. ఒక రాబ‌రీ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి న‌వంబ‌రు నెల‌లో రిలీజ్ చేయడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. త్వ‌ర‌లోనే టైటిల్‌, ఫ‌స్ట్ విడుద‌ల చేస్తాం`` అన్నారు.


పృథ్విరాజ్‌, అనూ మెహ‌త హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి


స‌మ‌ర్ఫ‌ణ‌:  పి. నాగ‌మ‌ణి

బ్యాన‌ర్: పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్

నిర్మాత‌: ప్ర‌వీణ శివరాజ్

ద‌ర్శక‌త్వం:  పి. మ‌ణిరాజ్

సినిమాటోగ్ర‌ఫి: ప‌ర‌శురామ్‌ ఎరుగ‌దిండి

ఎడిట‌ర్‌: సి. అక్ష‌య‌రాజ్‌

పీఆర్ఓ: శ్రీ‌ను-సిద్ధు

Naga Chaitanya, Akhil To Grace Grand Public Event Of TheGhost

 Naga Chaitanya, Akhil To Grace Grand Public Event Of King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost On Sep 25th



The mighty pre-release event of King Nagarjuna’s highly anticipated action thriller The Ghost will be organized in a spectacular manner at STBC Ground in Kurnool. This is going to be a grand public event in an open ground and the crowd will be attending in big numbers. The entire team will be gracing the occasion. To make this more special, Naga Chaitanya and Akhil will be gracing for the glittering ceremony. The star father and sons are coming together for a film function, after a long time, and it will be an eye feast for Akkineni fans. The presence of Naga Chaitanya and Akhil will increase expectations on the movie.


The team is coming up with updates at regular interval of times. Yesterday, they released a training video- Guns & Swords which showed the intense training of Nagarjuna and Sonal Chauhan.


Nagarjuna and Sonal Chauhan will appear as Interpol officers in the movie being produced by Suniel Narang, in association with Puskur Ram Mohan Rao, and Sharrath Marar under Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment Banners, with blessings of Narayan Das Narang.


Bharath and Saurab duo scored songs of the movie. Mukesh G and Brahma Kadali are the cinematographer and art director respectively. Dinesh Subbarayan and Kaecha choreographed the stunts.


Gul Panag and Anikha Surendran will appear as Nagarjuna’s sister and niece respectively. The Ghost will be hitting the cinemas on October 5th (Dasara release).


Cast: Nagarjuna, Sonal Chauhan, Gul Panag, Anikha Surendran and others.


Technical Crew:

Director: Praveen Sattaru

Producers: Narayan Das Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar

Banners: Sree Venkateshwara Cinemas LLP and Northstar Entertainment

Cinematography: Mukesh G.

Music: Mark K Robin (Songs by Bharath and Saurab)

Action: Dinesh Subbarayan, Kaecha

Art Director: Brahma Kadali

Executive Producers: Mohan and Venkateswara Rao Challagulla

PRO: Vamsi-Shekar, BA Raju

Chiranjeevi –Salman Khan’s GodFather Bestowed With U/A Censor Certificate

 Chiranjeevi –Salman Khan’s GodFather Bestowed With U/A Censor Certificate



Two biggest Megastars of India- Chiranjeevi and Salman Khan will be seen sharing screen space in the highly anticipated action entertainer GodFather directed by Mohan Raja. The film that will be high on action will be arriving in cinemas for Dasara on October 5th. Interim, the film's censor formalities have been completed. GodFather had been bestowed with U/A certificate from the officials and with that all the pre release hurdles are cleared.


The censor poster presents Chiranjeevi as a mass leader with huge following. The megastar who sports salt and pepper look appears in white panche in the poster. Chiranjeevi plays an intense role in the movie and he will be seen in salt and pepper look for the first time.


GodFather is directed by Mohan Raja. Nayanthara, Satya Dev, Sunil and Samuthirakani are the prominent cast. RB Choudary and NV Prasad are mounting the movie grandly under Konidela Productions and Super Good Films banners, while Konidela Surekha presents it. Nirav Shah has cranked the camera, while Suresh Selvarajan is the art director.


GodFather is scheduled for a grand release in Telugu and Hindi during Dasara, 2022 on October 5th.

Mass Raja Lyrical Video Launched

 మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల, త్రినాధరావు నక్కిన, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  "ధమాకా" నుండి 'మాస్ రాజా' లిరికల్ వీడియో విడుదల



మాస్ మహారాజా రవితేజ 'ధమాకా' మేకర్స్ చార్ట్‌బస్టర్‌ 'జింతాక్‌'తో గ్రాండ్ మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఇప్పుడు సెకండ్ సింగిల్ 'మాస్ రాజా'ను విడుదల చేశారు. 'మాస్ రాజా' టైటిల్ కి తగ్గట్టే మాస్ కి పూనకాలు తెప్పించేలా వుంది ఈ పాట.


భీమ్స్ సిసిరోలియో 'మాస్ రాజా' పాటని థియేటర్లు దద్దరిల్లేలా మాస్ డ్యాన్స్ నెంబర్ గా కంపోజ్ చేశారు. సాంగ్ వీడియోలో రవితేజ డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయాయి. తన గ్రేస్ ఫుల్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేశారు రవితేజ.


ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం మాస్ కి డబుల్ ఇంపాక్ట్ ని ఇచ్చింది.


♫ బడా ఎంటర్ టైన్మెంట్ వాలా ఆగయా

బిసి సెంటర్లో మోగాలి తాలియా

బాడీ లోకల్ .. మైండే గ్లోబల్

క్లాసు మాసు కాంబో మోడల్

బోలో ఎవ్రీ బాడీ ప్యార్ సే

బోలో ఎవ్రీ బాడీ జరా జోర్ సే

ఏతో మాస్ మాస్ రాజా.. జరా ఉఠాకే మార్ బ్యాండ్ బాజా♫


మాస్ మహారాజా ఇమేజ్ తగ్గట్టు సాగిన ఈ లిరిక్స్ మళ్ళీమళ్ళీ వినాలనిపించేలా వున్నాయి. నకాష్ అజీజ్ఈ పాటని ఫుల్ గ్రేస్ తో ఎనర్జీటిక్ గా పాడారు.


ఫస్ట్ సింగిల్ గా వచ్చిన 'జింతాక్‌' సాంగ్ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది. ఇప్పుడు మాస్ రాజా పాట కూడా మాస్ చార్ట్‌బస్టర్‌ హిట్ ని అందుకుంది.


పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజకు జోడిగా టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల సందడి చేయనుంది.


 నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ ఈ చిత్రం రూపొందుతోంది.


ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్.


తారాగణం: రవితేజ, శ్రీలీల

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: త్రినాధరావు నక్కిన

నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల

పీఆర్వో: వంశీ శేఖర్


Chaman Title Launched

యువతకి స్ఫూర్తినిచ్చే సినిమా "చమన్" (ఎడారి లో పుష్పం) టైటిల్ లాంచ్



దివంగత "శ్రీ చమన్ సాబ్ గారు" ఆయన జీవిత చరిత్రను అభిమానుల కోరిక మీద, సినిమాగా తీయాలనుకోవటం జరిగింది. ఆయన బ్రతికున్న రోజుల్లోనే సినిమా స్క్రిప్ట్ పూర్తి చేయడం జరిగింది. విధివశాత్తు "శ్రీ చమన్ గారు" కాలం చేయడంతో అయన మిత్రుడిగా ఆయన మీద అభిమానంతో సినిమాను రూపొందించాలనుకున్నాను. కరోనా కారణంగా ఇన్ని రోజులు ఆలస్యం అయ్యింది. అన్ని కుదుట పడడటంతో ముఖ్యంగా ఈ రోజు "శ్రీ చమన్" గారి కుమారుడైన "ఉమర్ ముక్తర్" కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆ మహనీయుడి జీవితం ఆదర్శప్రాయమైన ఆయన వ్యక్తిత్వం నేటి యువతకు తెలియ చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాని ఆ మహనీయుడికి  ఘనమైన నివాళిని తెలియ చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము.


శ్రీ చమన్ గారు దర్శకత్వ బాధ్యతల్ని "వెంకట్ సన్నిధి" చేత చేయించాలని భావించారు. ఆయనకు మాట ఇవ్వటంతో "వెంకట్ సన్నిధి" దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ "జి.వి. 9 ఎంటర్టైన్మెంట్" సంస్థ ద్వారా జివి చౌదరి గారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పేరు "చమన్" గా ఖరారు చేసారు. "సి రామ్ ప్రసాద్" డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పని చేస్తున్నారు.  త్వరలోనే సినిమా సాకేంతిక నిపుణులు, పూర్తి తారాగణం వెల్లడిస్తాం.

 

జి.వి. చౌదరి ప్రొడ్యూజర్ మాట్లాడుతూ: నేను ఎంతగానో అభిమానించే వ్యక్తి జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ "దూదేకుల చమన్‌ సాబ్". అయ్యన కుమారుడు "ఉమర్‌ ముక్తర్‌" బర్త్ డే కానుకగా, జి.వి. 9 ఎంటర్టైన్మెంట్ బ్యానర్ తో పాటు మూవీ టైటిల్ అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ లో ఫస్ట్ మూవీ గా తెరకెక్కుతున్న "శ్రీ చమన్" గారి బయోపిక్ సినిమా కి, "సి రామ్ ప్రసాద్" డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ చేయడం మాకు చాలా హ్యాపీ గా ఉంది. అదే విధంగా "వెంకట్ సన్నిధి" దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ, యుంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మా సినిమా టైటిల్ పేరు "చమన్" (ఎడారి లో పుష్పం) ఈ సినిమా అందరిని అలరించబోతుంది. త్వరలోనే అక్టోబర్ లో కాస్టింగ్ వివరాలు వెల్లడిస్తాము. నేను ఎన్నో సంవత్సరాలు నుంచి ఇండస్ట్రీ లో పని చేస్తూ బాగా ఇష్టపడే వ్యక్తుల్లో బాలయ్య బాబు ఒకరు.


వెంకట్ సన్నిధి డైరెక్టర్ మాట్లాడుతూ: ఒక మహనీయుడి జీవిత చరిత్ర మీద నేను డైరెక్ట్ చెయ్యబోతున్నందుకు నా అదృష్టం గా భావిస్తున్నాను. నేను ఇండస్ట్రీ లో ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తూ వచ్చాను కానీ, గత 14 సంవత్సరాలు గా నేను సినిమాలకి దూరంగా ఉన్నాను, కేవలం సినిమాలకి డైరెక్ట్ చేద్దామనే ఇష్టంతో, ఇప్పుడు నాకు ఈ సినిమాతో అవకాశం దక్కింది.


శ్రీ చమన్‌ సాబ్ గురించి చెప్పాలి అంటే తన కుటుంభ భవిషత్తు అన్నింటిని ఫలంగా పెట్టి ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఆయన జీవిత కథ ఆధారంగా కమర్షియల్ హంగులతో పాటు నిజాన్ని నిక్కచ్చిగా తెర మీద చూపించబోతున్నాం. ఆయన గురించి ఈ తరం యువత కి తేలియాలిసిన కధ ఇది. టెన్త్ క్ల్యాస్ కూడ పాస్ కానీ ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు పడి చిన్న స్థాయి నుంచి ఇండియా లోనే బెస్ట్ జెడ్పీ చైర్మన్‌గా అవార్డు రావడం గొప్ప విషయం. అంతే కాదు, కుల మత బేధాలు లేకుండా అందరిని సమానంగా చూసే ఏకైక వ్యక్తి  శ్రీ చమన్ గారు. అనంతపురం ఒక ఎడారి లాంటి జిల్లా ని మెరుగైన స్థాయి కి తీసుకురావడంతో ఈ సినిమాకి  "చమన్" (ఎడారి లో పుష్పం) అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా ఎవ్వరిని కించపరచని విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రొడ్యూజర్ గారితో ఎంతో అనుబంధం ఉంది. అలాగే, సి రామ్ ప్రసాద్" మా సినిమా కి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ పని చేయడం మా అదృష్టం. ఇండియా లో డీఓపీ గా గొప్ప స్థాయి కి వెళ్తారని బలంగా నమ్ముతున్నాను. ఈ సినిమా కి అయ్యన అన్ని ముందుండి మామ్మలందరిని సక్సెస్ బాటలో నడిపిస్తారని కోరుకుంటున్నాను.


"సి రామ్ ప్రసాద్" డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ మాట్లాడుతూ: డైరెక్టర్ వెంకట్ సన్నిధి నా చిరకాల మిత్రుడు, కథ చెప్పినప్పుడు నేను బాగా ఎక్సయిట్ అయ్యాను. ఈ సినిమా ఎవ్వరిని కించపరిచే విధంగా ఉండదని ప్రేక్షకుల అందరిని అలరించే విధంగా ఉంటుందని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమా ప్రొడ్యూసర్ జి.వి. చౌదరి గారిని కలిసింది ఒక్కసారే అయ్యిన, ఆయన ఎంతో ప్యాషినేటెడ్ గా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి తో నేను కోలాబ్రేట్ అవ్వడం చాలా హ్యాపీ గా ఉంది.  


 మోహిత్ రెహమాన్య మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడుతూ: నేను ఏ.ఆర్. రెహమాన్ శిష్యుణ్ణి అయ్యనంటే నాకెంతో గౌరవం. ఈ సినిమాకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడం ప్రొడ్యూజర్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాకి వర్క్ చెయ్యబోతున్నందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది. 

Akasam Teaser is Engaging

 ప్లెజెంట్‌.. బ్రీజీ విజువ‌ల్స్‌తో ఆక‌ట్టుకుంటోన్న ‘ఆకాశం’ టీజర్



వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్సటైల్ యాక్ట‌ర్ అశోక్ సెల్వ‌న్ హీరోగా.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఆకాశం’. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.


ఇప్ప‌టికే విడుద‌లైన హీరో అశోక్ సెల్వ‌న్ లుక్ పోస్ట‌ర్స్‌, ముగ్గురు హీరోయిన్స్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. కాగా.. శుక్ర‌వారం సినిమా టీజ‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ విడుద‌ల చేశారు. హీరోయిన్ వాయిస్‌తో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. మ‌న‌సు ఉల్లాసంగా ఉన్న‌ప్పుడు మ‌ర‌చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తొస్తాయి క‌దూ అంటుంది. అశోక్ సెల్వ‌న్ డిఫ‌రెంట్ లుక్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్స్‌.. వారి మ‌ధ్య రిలేష‌న్‌ను అంద‌మైన స‌న్నివేశాల‌తో చూపించారు. లీలావ‌తి కుమార్ సినిమాటోగ్ర‌ఫీ, గోపి సుంద‌ర్ సంగీతం ఈ స‌న్నివేశాల‌కు మ‌రింత అందాన్నిస్తున్నాయి. బ్యాగ్రౌండ్‌లో ఆకాశం అనే టైటిల్ పాట‌లాగా వినిపిస్తోంది.


ఆకాశం మంచి ప్రేమ క‌థా చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. దీంతో పాటు సినిమాలోని ఎమోష‌న్స్ సినిమాపై ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచుతున్నాయి. న‌వంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.


Shaakuntalam is all set to release on November 4

Samantha & Dev Mohan starrer Shaakuntalam is all set to release on November 4



The massively mounted film Shaakuntalam based on internationally acclaimed Kalidasa’s Sanskrit play ‘Abhijnana Shakuntalam’ is all set to release in Hindi, Telugu, Tamil, Malayalam & Kannada.  The story of Shaakuntalam revolves around the epic love story of Shakuntala and King Dushyant from Mahabharata, portrayed by Samantha and Dev Mohan.


The first poster of the film came out recently and the audiences were mesmerized and their enthusiasm elevated to the highest level to watch this upcoming mythological drama.


The film is helmed by supreme proficient, Director Gunasekhar and marks a whimsical tale of love set in the Kashyapa Kanumalu (Kashmir), the grandeur and splendour of Dushyant’s Puru Dynasty making the film extremely exceptional.


Along with an alluring storyline, the film also has an accomplished star cast consisting of Sachin Khedekar Kabir Bedi, Dr.M.Mohan Babu Prakash Raj, Madhubala, Gautami, Aditi Balan, Ananya Nagalla and Jisshu Sengupta in pivotal roles. Another added attraction to the star cast is icon Star Allu Arjun’s daughter Allu Arha portraying the role of Prince Bharata.


Presented by Dil Raju under Sri Venkateswara Creations in collaboration with Gunaa Teamworks, Produced by Neelima Guna, and Written & Directed by Gunasekhar, the film is all set to release on November 4, 2022.


Mathrudevobhava Releasing on September 24th

 మనసున్న ప్రతి ఒక్కరూ

మెచ్చే మంచి చిత్రం

మాతృదేవోభవ (ఓ అమ్మ కథ)

- డెబ్యూ డైరెక్టర్ కె.హరనాథ్ రెడ్డి



      సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా ప్రస్తుతం కొన్ని కుటుంబాల్లో జరుగుతున్న అవమానవీయ సంఘటనలను ప్రతిబింబిస్తూ తెరక్కించిన "మాతృదేవభవ" మనసున్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని అంటున్నారు చిత్ర దర్శకులు కె.హరనాథ్ రెడ్డి. కోడి రామకృష్ణ, రేలంగి నరసంహారావు, ఇవివి సత్యనారాయణల వద్ద దర్శకత్వ శాఖలో సుదీర్ఘకాలం పని చేసిన హరనాథ్ రెడ్డి "మాతృదేవోభవ" (ఓ అమ్మ కథ) చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీవాసవి మూవీస్ పతాకంపై ఎమ్.ఎస్.రెడ్డి సమర్పణలో చోడవరపు వెంకటేశ్వరరావు ఈచిత్రాన్ని నిర్మించారు. సీనియర్ నటీమణి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, పతంజలి శ్రీనివాస్, శ్రీహర్ష, అమృతా చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం నేడు విడుదల సందర్భంగా కె.హరనాథ్ రెడ్డి ప్రత్యేకంగా ముచ్చటించారు. 

      "కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె) రాసిన కథతో నిర్మాతలు నన్ను సంప్రదించారు. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఇంత మంచి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం నాకు చాలా గర్వంగా ఉంది. అందరూ మనీ (money) కోసం కాకుండా మనసు పెట్టి చేశారు. మా నిర్మాతలు ఈ చిత్రాన్ని ఇప్పటికే వందలాది మందికి చూపించారు. ప్రతి ఒక్కరూ చమర్చిన కళ్లతో మెచ్చుకున్నారు. సందేశానికి వినోదం జోడించి అద్భుతంగా తీశానని నన్ను అభినందించారు. ప్రేక్షకుల నుంచి కూడా అదే స్థాయిలో స్పదన వస్తుందని ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఈ చిత్రంలో సుధ గారి నటన అవార్డ్ విన్నింగ్ రేంజ్ లో ఉంటుంది. క్యాన్సర్ సోకిన తనను పిల్లలు కూడబలుక్కుని ఇంట్లోంచి గెంటేయాలని కుతంత్రాలు పన్నుతుండడం విని... తనే బయటకు వచ్చేసే సన్నివేశం అందరితో కంట తడి పెట్టిస్తుంది. జయసూర్య సంగీతం, మరుదూరి రాజా సంభాషణలు "మాతృదేవోభవ" చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. నా తదుపరి చిత్రం త్వరలోనే సెట్స్ కు వెళ్లనుంది!!

The promising actress Meenakshi Chaudary Sizzles in Saree

The promising actress Meenakshi Chaudary Sizzles in Saree



Meenakshi Chaudhary made her film debut in Ichata Vahanamulu Niluparadu, but it was her startling performance in Raviteja's khiladi that propelled her to fame. Meenakshi Chaudary is now in two films: Kolai in Tamil and HIT: The Second Case.


The Khiladi girl is a dentist who has acted in films as a result of her success in beauty pageants and her stunning appearance.


Meenakshi Chaudhary just made her film awards debut at SIIMA. She shared several images of herself from before she left for the event, in which she looked stunning in a saree.


The release date nearing for Hit: The Second Case, the impending Hit: The First Case sequel in Telugu, and Kolai in Tamil are all nearing release dates. She will begin shooting another film later this month.


The former beauty queen has already proven her mettle, and now that she has many offers and exciting projects in the works, she is destined to become a sensation in the south. The promising actress has always been active on social media, and with her breathtaking photos she occasionally enchants the youth. 

Allu Sirish & Geetha Arts project will hit the Big Screens on November 4

 Allu Sirish & Geetha Arts project will hit the Big Screens on November 4



Young hero Allu Sirish who made his debut 7 years back created unique mark for himself. In this career span he has done only 5 movies which are diverse and unique from each other.


Many have stroked off him in race but the fact is that Allu Sirish is preparing his ground work to make a strong comeback. He is currently in touch with 2 directors and is involving in script discussions as well.


Meanwhile, the actor's upcoming film under his home banner Geetha Arts is ready for release. According to sources, makers planning to announce the release date soon. Speculations rife that movie is going to release on November 4. The promotional activities will also kickstart soon.


Everyone is now intrigued with this news, and waiting for his return to the big screens which will happen soon.

Hot Topic in Cine Industry About Bandla Ganesh and Shivaji Raja

 సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా బండ్ల గణేష్, శివాజీ రాజాల మంచి మనసులు 

 


సినీ నటులు బండ్ల గణేష్, శివాజీ రాజా చేసిన పని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి 30 ఏళ్ల స్నేహం ఒక కుటుంబాన్ని నిలబెట్టింది. అదేమిటి అనుకుంటున్నారా అసలు విషయం ఏమిటంటే శివాజీ రాజా ప్రస్తుతం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. త్వరలో ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ కు ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఆయన మరోసారి వైస్ ప్రెసిడెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధం అయ్యారు. నిజానికి శివాజీ రాజా ప్రెసిడెంట్ గా ఈసారి బరిలోకి దిగాలని భావించారు. కానీ ప్రెసిడెంట్ గా ఆది శేషగిరి రావు  గారు బరిలో దిగుతున్నారని తెలుసుకొని ఆయన మీద గౌరవంతో తిరిగి వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే శివాజీ రాజా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్నారని భావించిన బండ్ల గణేష్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో శివాజీ రాజా, బండ్ల గణేష్ మధ్య ఉన్న స్నేహంతో బండ్ల గణేష్ శివాజీ రాజాను పోటీ నుంచి వైదొలగమని, మీరు ఒకసారి చేశారు కాబట్టి తాను ఒకసారి ప్రయత్నిస్తానని కోరారు. మన ఇద్దరిలో ఎవరున్నా అల్టిమేట్ గా ప్రజలకు మంచి జరగాలని పేర్కొన్న శివాజీ రాజా ఒకవేళ నేను తప్పుకుంటే నువ్వు అడిగిన ఏదైనా మంచి పని నేను చేస్తాను లేదా నేను తప్పుకుంటే నేను చేయాలనుకున్న ఒక మంచి పనికి నువ్వు సహాయపడాలి అని కోరారు. దానికి బండ్ల గణేష్ వెంటనే ఒప్పుకున్నారు. ఇద్దరికీ సన్నిహితులైన కొందరి మధ్య ఏదైనా ఒక మంచి పనికి 5 లక్షల పదహారు వేల రూపాయలు విరాళం ఇచ్చేలా బండ్ల గణేష్ మాట ఇచ్చారు. ఆ డబ్బు ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్న సమయంలో  20 ఏళ్ల ఆక్సిడెంట్ కి గురై కళ్ళు పోగొట్టుకొని తాజాగా కిడ్నీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న నరేష్ అనే డ్రైవర్ కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఎన్నికలంటే హోరాహోరీ ఆరోపణలు ప్రత్యేకరోపణలతో మీడియాకు ఎక్కుతున్న ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే పోటీ నుంచి వైదొలుగుతానని శివాజీ రాజా చెప్పడం వెంటనే దానికి బండ్ల గణేష్ కూడా మంచి పని అంటే నేనెందుకు చేయను అంటూ ఆయన కూడా సహాయం చేసేందుకు సిద్ధం కావడంతో శివాజీ రాజా సన్నిహితులు, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ సమక్షంలో నిర్ణయించి ఐదు లక్షల పదహారు వేల రూపాయల చెక్కును నరేష్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల్లో తాను బండ్ల గణేష్ కు మద్దతు ఇస్తున్నానని, ఇప్పటికే చాలా మంది హేమాహేమీలు వైఎస్ ప్రెసిడెంట్ గా పని చేశారు, ఇప్పుడు బండ్ల గణేష్ కు ఒక అవకాశం ఇచ్చి చూడాలని శివాజీ రాజా కోరారు. ఇక డాక్టర్ కే వెంకటేశ్వర రావు (కేవీఆర్), కరాటం రాంబాబు, బండ్ల గణేష్, శివాజీ రాజా, ఏడిద శ్రీ రామ్, ఎఫ్ఎన్సీసీ కమిటీ మెంబర్లు సుష్మ, శైలజ, సంతోషం సురేష్, రవిరాజా చేతుల మీదిగా డ్రైవర్ నరేష్ కు 5 లక్షల 16 వేల చెక్కును అందించారు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న బండ్ల గణేష్, శివాజీ రాజాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎన్నికలలో పోటీ అంటే మంచి చేయడం కోసం పోటీ చేయడమే అని ఈ సందర్భంగా నిరూపితమైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Director Kasi Vishwanath About RRR Oscars Nomination

 "ఆర్ఆర్ఆర్" సినిమాని ఆస్కార్ కి.. నామినేట్ చేయకపోవడం అన్యాయం.



తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు.. 

వై.కాశీ విశ్వనాథ్ 

 

"ఆర్ఆర్ఆర్" సినిమాని ఆస్కార్ కి.. నామినేట్ చేయకపోవడం అన్యాయమని సినీ దర్శకుడు, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు, సినీ నటుడు..

 వై. కాశీ విశ్వనాథ్ అన్నారు. 

ఒక దేశభక్తిని చాటి చెప్పే చిత్రాలు ఎన్నో వచ్చాయి. ఫిక్షన్ యాంగిల్ లో.. కల్పిత కధతో ఎంతో కష్టపడి.. ఎన్నో సంవత్సరాలు వెచ్చించి.. అద్భుతంగా తెరకెక్కించిన సినిమా.. "ఆర్ఆర్ఆర్". 'కంటెంట్' పరంగా గాని.. 'సందేశం' పరంగా గాని.. దేశ ఖ్యాతిని ఇనుమడింప జేసే సినిమా అని అన్నారు. "ఆర్ఆర్ఆర్ " చిత్రీకరణలో 'సీన్స్' రక్తి కట్టించడంలో గాని.. నటీనటుల నుంచి పెరఫార్మెన్స్ రాబట్టుకోవడంలో గాని.. దర్శకులు రాజమౌళి గారు ప్రాణం పెట్టి పని చేశారు. హీరోలు జూ. ఎన్టీఆర్ గారు గానీ.. రామ్ చరణ్ గాని.. పాత్రలలో జీవించారు. టెక్నీషియన్స్ ప్రతిభ అమోఘం. అలాంటి సినిమా ని ఆస్కార్ కి నామినేట్ చేయకుండా.. " చెల్లో షో" అనే గుజరాతీ సినిమాను నామినేట్ చేయడం.. తెలుగు చిత్రాన్ని పట్టించుకోకపోవడం.. శోచనీయం. దీన్ని ఖండిస్తూ.. తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా.. 

నా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నానని.. 

ఆయన పేర్కొన్నారు.

Chiranjeevi –Salman Khan’s GodFather 1st Single Thaar Maar Clocks 11 Million+ Views

 Chiranjeevi –Salman Khan’s GodFather 1st Single Thaar Maar Clocks 11 Million+ Views



Lyrical video of first single Thaar Maar Thakkar Maar from GodFather featuring megastars Chiranjeevi and Salman Khan has got tremendous response. The mass dance number that offered mega feast has clocked 11 Million+ views as of now. The song that showed Chiranjeevi and Salman Khan setting the dance floor on fire with their peerless style and mass hook step is still trending on YouTube.


The song that glorified the stardom of Salman Khan and Chiranjeevi was composed S Thaman and was choreographed by Prabhu Deva. Shreya Ghoshal lent vocals for the catchy foot-tapping number, whereas Anantha Sriram has penned the lyrics.


GodFather is the biggest action entertainer of all time. The most awaited movie is directed by Mohan Raja. Nayanthara, Satya Dev, Sunil and Samuthirakani are the prominent cast.


RB Choudary and NV Prasad are mounting the movie grandly under Konidela Productions and Super Good Films banners, while Konidela Surekha presents it. Nirav Shah has cranked the camera, while Suresh Selvarajan is the art director.


GodFather is scheduled for a grand release in Telugu and Hindi during Dasara, 2022 on October 5th.

Krishna Vrinda Vihari Grand US Premieres Today

 Krishna Vrinda Vihari Grand US Premieres Today



Handsome Hero Naga Shaurya's Krishna Vrinda Vihari is releasing tomorrow across the globe. The US Premieres of the film are going to happen in a few hours. Krishna Vrinda Vihari is going to be a clean and complete family entertainment like no other film in recent times.


The trailer has impressed big time. The mother track involving Radhika Sarathkumar will stir the emotions. The new girl Shirley Setia has driven the youth audience crazy. The conflict between Shaurya, Shirley, and Radhika especially the second half is going to be a rollercoaster ride with entertainment and emotions.


Naga Shaurya reportedly gave his career best performance in the role of a Brahmin Youth. We have got some hilarious entertainers in the past when the lead heroes played Brahmin characters. It will be the same this time as well.


The dialogues and music are added advantage to the film. The comedy by Vennela Kishore, Brahmaji, Rahul Ramakrishna, and Satya will leave the audience in splits, the makers confidently say.


Successful Overseas distribution house, Radhakrishna Entertainments, is distributing Krishna Vrinda Vihari in the United States. They are bringing the film to US audience in your nearby locations at reasonable pricing. 


The distributors welcome the Telugu audience to watch the light-hearted film in theaters this weekend with their families to enjoy the film that has fun elements and family emotions in equal proportion.