సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ ఈ నెల 2న రిలీజ్
సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కాంబినేషన్ లో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ నెల 2వ తేదీ సాయంత్రం 5.35 నిమిషాలకు ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ రివీల్ చేయబోతున్నారు. చాలా రోజుల తర్వాత ఈ చిత్రానికి మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందించడం ఈ సినిమా పై అంచనాలు రేకెత్తిస్తుంది. మనసును తాకే భావోద్వేగాలతో కూడిన ఓ సరికొత్త ప్రేమ కథను ఈ చిత్రంలో ప్రేక్షకులు చూడబోతున్నారు. "క" సినిమా లాంటి సూపర్ హిట్ కొట్టిన హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
Post a Comment