Telugu Film Industry Condemns Pahalgam Terror Attack and Organizes Candle Rally in Tribute

 ప్రెస్ నోట్

Dt; 28.04.2025


ఏప్రిల్ 22, 2025న బైసరన్ లోయలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను దారుణంగా చంపి, 20 మందికి పైగా గాయపరిచిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని మరియు విచారాన్ని వ్యక్తం చేస్తోందని ఇందుమూలంగా తెలియజేయడమైనది. ఈ దాడిని యావత్ దేశం ఖండించింది, తమ బాధను వ్యక్తం చేసింది మరియు దోషులను వెంటనే శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది మరియు ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వానికి తమ మద్దతు ఎల్లప్పుడు ఉంటుంది అని ప్రతిజ్ఞ చేసింది.

ప్రభుత్వానికి పూర్తి మద్దతును అందిస్తున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉగ్రవాద నిర్మూలనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న గట్టి ప్రయత్నాలు మరియు కఠినమైన చర్యలను గుర్తిస్తూ తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడు ప్రభుత్వానికి అండగా ఉంటుంది అని తెలియజేసింది.

పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ తమ విచారాన్ని వ్యక్తం పరుస్తూ మరియు బాధితులకు నివాళులు అర్పిస్తూ, ప్రభుత్వానికి మరియు బాధితుల కుటుంబాలకు తన మద్దతును తెలియజేయడానికి 2025 ఏప్రిల్ 29వ తేదీ మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు హైదరాబాద్లోని ఫిలిం నగర్ లోని రామానాయుడు కళామండపం నుండి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహిస్తుందని తెలియజేయడమైనది.

(టి. ప్రసన్న కుమార్)

గౌరవ కార్యదర్శి 


Post a Comment

Previous Post Next Post