'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అన్ ప్రిడిక్టబుల్ - డైరెక్టర్ రైటర్ మోహన్
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించిన డైరెక్టర్ రైటర్ మోహన్ మీడియాతో మాట్లాడారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి స్పందనను పొందాయి.
'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ఎలా ప్రారంభమైంది? వెన్నెల కిషోర్‌ను టైటిల్ రోల్ కోసం ఎందుకు ఎంచుకున్నారు?
ఈ కథ ఏడు వ్యక్తులకు సంబంధించినది. వెన్నెల కిషోర్ డిటెక్టివ్ పాత్రలో ఉన్నారు, ఇది రైల్ కు ఇంజిన్ లాంటి క్యారెక్టర్. మిగతా పాత్రలు కూడా ముఖ్యమైనవి, ప్రతి పాత్ర కథలో కీలకంగా ఉంటాయి. డిటెక్టివ్ పాత్రలో కొంత హాస్యం ఉంది, అందుకే వెన్నెల కిషోర్ ఆ పాత్రకు అద్భుతంగా సరిపోయారు. ఆయన ఉత్తరాంధ్ర యాసను నేర్చుకొని సాహసంగా నటించారు. కథలో క్రైమ్, కామెడీ, ఎమోషన్, థ్రిల్, లవ్ అన్నవి సరిఅయిన శ్రేణిలో ఉన్నాయి.
శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ ఎందుకు?
ఈ కథ 1991లో జరుగుతుంది. రాజీవ్ గాంధీ గారు వైజాగ్ పర్యటన ముగించుకొని శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు. ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు కొన్ని చిన్న సంఘటనలు ఎక్కువ గుర్తింపు పొందవు. ఈ రోజున జరిగిన ఇతర సంఘటనలతో సంబంధం ఏంటి అనే విషయాన్ని షెర్లాక్ హోమ్స్ వంటి ఫిక్షనల్ క్యారెక్టర్ ద్వారా ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. ఈ కథను ఎవరూ అంచనా వేయలేరు.
చంటబ్బాయ్ తాలూకా ట్యాగ్ పెట్టడానికి కారణం?
తెలుగులో డిటెక్టివ్ చిత్రాలంటే చిరంజీవి గారి చంటబ్బాయ్ గుర్తుకు వస్తుంది. షెర్లాక్ హోమ్స్ హాలీవుడ్ ఫిక్షనల్ క్యారెక్టర్, అందువల్ల అందరికీ కనెక్ట్ అయ్యేందుకు ఈ ట్యాగ్ ను వేసాం. 'తాలూకా' అనే పదం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
వంశీ నందిపాటి గురించి?
ఈ సినిమా వంశీ నందిపాటి గారికి నచ్చింది, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో అనేక థ్రిల్లింగ్ అంశాలు ఉన్నాయట. ఆయన సినిమా రిలీజ్ చేయడం ఎంతో సంతోషకరం. ఆయన సూచనలతో సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్లింది.
'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?
ఈ చిత్రంలో డిటెక్టివ్‌కు సహాయకులుగా అమ్మ (షర్మిల) మరియు నాన్న (లోకనాథ్) ఉన్నారు. ఈ మూడు పేర్ల మొదటి అక్షరాలతో షెర్లాక్ హోమ్స్ అనే పేరు వచ్చింది.
రైటర్ మోహన్ పేరు ఎలా వచ్చింది?
నా కెరీర్ ఈవివి గారి వద్ద ప్రారంభమైంది. పోసాని గారి వద్ద, రాజశేఖర్ గారి సినిమాల్లో కూడా పనిచేసాను. అందువల్ల రైటర్ మోహన్ అనే పేరు నేచురల్‌గా వచ్చిందని చెప్పవచ్చు.
మ్యూజిక్ గురించి?
సునీల్ కశ్యప్ పాటలు ఇచ్చారు, ప్రస్తుతం సాంగ్స్ వైరల్ అయ్యాయి. ఆర్ఆర్ జ్ఞాని చేసిన రేడియో మిక్స్ మస్త్ అద్భుతంగా వచ్చింది.
రైటర్‌గా మీ బలం ఏమిటి?
నేను కామెడీని బాగా చేస్తాను, ఇది ఈవివి గారి వద్ద నేర్చుకున్నాను. అనుభవం సాధించిన తర్వాతనే దర్శకుడిగా వ్యవహరించాలని అనుకుంటున్నాను.
మీ తదుపరి ప్రాజెక్టు?
నెక్స్ట్ ఎమోషనల్ జోనర్‌లో ఒక సినిమా చేయబోతున్నాను, స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది.
ఆల్ ది బెస్ట్!
థాంక్ యూ!
Post a Comment