Nara Rohit is Rowdy Fellow Details-Telugucinemas.in




1)    మూవీ మిల్స్ మరియు సినిమా 5 సంయుక్తంగా సమర్పిస్తూ, యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న “రౌడీ ఫెలో” ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అచిర కాలంలోనే,పాటల రచయితగా,టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ప్రఖ్యాత కెమెరామెన్ పి. సి. శ్రీరామ్ శిష్యుడైన అరవింద్ గాంధీ, ఈ చిత్రానికి కెమెరామెన్ గా పని చేస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ. ధూమ్3, బర్ఫీ, యే జవానీ హై దీవానీ, ఏజెంట్ వినోద్ లాంటి చిత్రాలకు సంగీతాన్నందించిన బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్తో పని చేసిన అనుభవం సన్నీకి ఉండడం, ఈ చిత్రానికి అసెట్ అని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో కుర్రకారుని ఊపేసిన, ఆషికీ 2 సినిమా పాటల ద్వారా సుపరిచితుడైన ఆర్జిత్ సింగ్ ఈ చిత్రానికి గాత్రం అందించడం విశేషం. ఇన్ని క్రేజీ పేర్లు వినిపిస్తున్నఈ చిత్రం, ఖచ్చితంగా అభిమానుల అంచనాలను అందుకుంటుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల అయి, ఘనవిజయం సాధిస్తుందని, సినిమా వర్గాలు చెబుతున్నాయి.

విశాఖ సింగ్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, పరుచూరి వెంకటేశ్వర రావు, తాళ్లూరి రామేశ్వరి, ఆహుతి ప్రసాద్, అజయ్, లాల్, ప్రవీణ్, సుప్రీత్, త్రిలోక్, సత్య మిగిలిన తారాగణం.


Movie Mills and 5 jointly producing the film,with Nara Rohit  Titled as Rowdy Fellow" is currently in shooting stage Lyricist krishna chaitanya Turned as Director with this movie Aravind Gandhi is handling Camera  
   Vishakha Singh, Rao Ramesh, Posani Krishna Murali, Paruchuri Venkateswara Rao, Talluri ramesvari Aahuthi Prasad, Ajay, Lal, Praveen, Supreeth,   the rest of the cast.  Movie will release in April 2014 

Post a Comment

Previous Post Next Post