Bhai Teaser Record-Telugucinemas.in





2 lakh 50 thousand hits within 24 hours for Bhai teaser
 Bhai teaser released recently in youtube and this teaser got record hits it has crossed 2 lakh 50 thousand hits within 24hrs this movie is directed by Veerabadhram and it is produced by Annapurna studious and Reliance entertainments Devi sri prasad is the music director for this film Audio launch on september 1st Richa gangopadhyaya is doing female lead role nathaliya Kaur, kamna jathmalani, hansanandini doing special roles. Bahmanandam, Paruchuri venkateshwararao, chalapatirao, jayaprakashreddy,MS , sonusood, shiyaji Shinde, Aishish vidhyardhi, Aditya Menon, Raghubabu, Ajay, naginidu, Geetanjali, and others are playing important roles in the movie dialogues Sandeep, ratnababu, cinematography sameer reddy Editing karthik srinivas art : Nagendra, executive producer: A s saibabu 
  24 గంటల్లో 2 లక్షల 50వేల హిట్స్ సాధించిన భాయ్ 
‘హైదరాబాద్‌కి రెండే ఫేమస్. ఒకటి ఇరానీ చాయ్. ఇంకోటి భాయ్’ ‘ఈ ఫీల్డ్‌లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే ఈ భాయేరా’ ‘ఎట్మాస్ఫియర్ అలర్ట్ అయ్యిందంటే భాయ్ ఎంటర్ అయినట్టే’ 
 ఇటీవల యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదలైన ‘భాయ్’ ప్రచార చిత్రంలో నాగార్జున ఆధునిక శైలిలో పలికిన సంభాషణలివి. విడుదల చేసిన 24 గంటల్లో రెండు లక్షల 50 వేల హిట్స్ ఈ ప్రచార చిత్రానికి లభించాయని ఈ చిత్రదర్శకుడు వీర భద్రం చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘అభిమానులే కాక, యావత్ తెలుగు ప్రేక్షకులందరినీ ఈ సంభాషణలు ఆనందింపజేస్తుండటం ఆనందంగా ఉంది. 
 అంచనాలకు ఈ సినిమా ఏ మాత్రం తగ్గదని నమ్మకంగా చెప్పగలను. దర్శకునిగా నా మూడో సినిమానే అగ్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడం, గొప్ప కథానాయకుడైన నాగార్జునకు నేను దర్శకత్వం వహించడం నా అదృష్టం. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను సెప్టెంబర్ 1, అదే నెలలో సినిమా కూడా విడుదల చేస్తాం’’ అన్నారు. రిచా గంగోపాథ్యాయ కధానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నథాలియా కౌర్, కామ్నా జఠ్మలాని, హంసానందిని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.
 బహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్, సోనూసూద్, సయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్, రఘుబాబు, అజయ్, నాగినీడు, గీతాంజలి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సందీప్, రత్నబాబు, ఛాయగ్రాహణం: సమీర్‌రెడ్డి, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: నాగేంద్ర, కార్యనిర్వాహక నిర్మాత: ఎన్.సాయిబాబు.


Previous Post Next Post