Hyderabad is the joint capital -Telugucinemas.in


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర విభజనను అధికారికంగా ప్రకటించినప్పటికీ.. హైదరాబాద్ ను మాత్రం 10 ఏళ్లు పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించనున్నట్లు కాంగ్రెస్ నేత అజయ మాకెన్ ప్రకటించారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే ప్రత్యేక రాష్ట్రాన్ని చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రాంతం మాత్రం ఆంధ్రప్రదేశ్‌గానే కొనసాగుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను కల్పించనున్నట్లు మాకెన్ తెలిపారు. నదీ జలాల పంపిణీకి ప్రత్యేక ఫార్ములాను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు
Previous Post Next Post