Review : The Attacks of 26/11 Must Watch Movie-Telugucinemas.in


విడుదల తేదీ :01/03/2013
TELUGUCINEMAS.IN రేటింగ్   : 4/5 
దర్శకుడు : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : పరాగ్ సంఘ్వి, గోపాల్ దల్వి
సంగీతం రూషిన్ దలాల్, అమర్ మొహిలే
నటీనటులు : నానా పటేకర్, సంజీవ్ జైస్వాల్, అతుల్ కులకర్ణి ,తదితరులు


రాంగోపాల్ వర్మ  కి సంచలనాలు సృష్టించడం కొత్త ఏమికాదు  మొన్న శివ నిన్న రక్తచరిత్ర నేడు 
 26/11 ఇండియాపై దాడి అయన ఏంచేసిన ఒక హైలైట్ అని ప్రత్యేకం గ చెప్పాల్సిన పని లేదు ఇక విషయానికి వస్తే 

వరుసగా పరాజయాలనుఎదురుకొన్న విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి  హిట్ వచ్చేసింది  రొటీన్ సినిమాలను పక్కన పెట్టి ఈ సారి నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో ’26/11 ఇండియాపై దాడి’సినిమా  తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ  2008 నవంబర్ 26న ముంబై లోని తాజ్ హోటల్, నరిమన్ హౌస్ మీద జరిగిన టెర్రరిస్టుల విద్వంస చర్యను ఆధారంగా తీసుకొని నానా పటేకర్, సంజయ్ జైస్వాల్ ప్రధాన పాత్రలతో ఈ ’26/11 ఇండియాపై దాడి’సినిమా ని తెరకెక్కించారు   166 మంది ప్రాణాలు కోల్పోయిన  ఆ సంఘటనను కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు రాము  . మార్చి 1న రిలీజ్  అయిన  ఈ సినిమా గురించి చెప్పే ముందు ఈ సంఘటనలో చనిపోయిన వారికి, బాధితులకు మా తెలుగుసినిమా తరుపున  సంతాపాన్ని తెలియజేస్తున్నాం. 
కథ :
ముంబై లో జరిగిన 26/11 దాడి ఎలా జరిగింది చేసినది ఎవరు ఎలా పధకం ప్రకారం చేసారు ఆ రోజు రాత్రి అసలు ఏం  జరిగింది ఆ దాడి జరిగిన సమయం లో పోలీసులు ఎలా ఆ సమస్యను ఎదురుకొన్నారు దాడి చేసిన తరవాత కసాబ్ ని ఉరి తీసే  వరకు ఎం జరిగింది అన్నది  కధ  
ప్లస్ పాయింట్స్ :
రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తెరకెక్కించిన విధానం చాల బాగుంది ఎప్పడు చిన్న చిన్న సెట్స్ లో సినిమా ను తీసే వర్మ ఈ సినిమా కోసం  తాజ్ హోటల్ భారి  సెట్టింగ్ వేయించారు ఆ సెట్ లో తీసిన ప్రతి సీన్ చాల బాగా వచ్చింది   
టెర్రరిస్ట్ లు దాడి చేసిన ప్రతి ప్రాంతం ని చాల చక్క గ చూపించారు కామెడీ ఐటెం సాంగ్ లేక పోయిన ఏమాత్రం బోర్ రాని విధం గ  సినిమా ని తెరకెక్కించడం అంటే మాములు విషయం కాదు ఈ విషయం లో దర్శకుడు విజయం సాధించారు 
నానా పటేకర్ నటన చాలా  బాగుంది ఇక కసబ్ పాత్ర పోషించిన సంజయ్ జైస్వాల్ కూడా  అద్భుతమైన నటనను కనబరిచాడు
ముఖ్యం గ కసబ్  ని పట్టుకున్నపుడు ఒక పోలీస్ ఆఫీసర్ అయన పేరు తెలియదు కానీ బులెట్ లు వంటి లో దిగుతున్న కసబ్  చొక్కా వదలకుండా పోలీస్ పవర్ ఏంటో చూపించిన అయన తిరు అద్భుతం ఇలా చెప్పాలి అంటే చాల వున్నాయి ఇది  ఒక మంచి సినిమా రామ్ గోపాల్ వర్మ సినిమా  లలో ఇది ఒక గొప్ప సినిమా అని చెప్పాలి   సంఘటన మన కళ్ళ ముందు జరుగుతోందా మనం అక్కేడే ఉన్నామా అనుకునే ల తెరకెక్కించారు RGV .
మైనస్ పాయింట్స్ :
ప్రతి సినిమా కి ఏదో మైనస్ వుంటుంది  ఈ సినిమాలో పెద్ద గ చెప్పుకునే  మైనస్ పాయింట్ లు ఎం లేవు  ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచం తగ్గింది అది ఒక్కటే మైనస్ 
సాంకేతిక విభాగం :
హర్షరాజ్ షరఫ్ సినిమాటోగ్రఫీ బాగుంది ,  సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు.   రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ బాగుంది.  . ఎడిటింగ్ కూడా పరవాలేదు  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది 
ఇక చివరి మాట 
26/11 ఇండియాపై దాడి’ ఒక అద్భుతం అని చెప్పక తప్పదు  రామ్ గోపాల్ వర్మ సాహసాన్ని అభినందించక తప్పదు  .ఈ సినిమా తప్పక చూడాల్సిన సినిమా  విజయం సాధించి తీరుతుంది రాము అండ్ టీం కి నా  అభినందనలు 

సందీప్ 
Previous Post Next Post