Huge Response For Kalamandir IPO-TeluguCinemas.in

 ప్రారంభమైన సాయిసిల్క్స్‌ కళామందిర్‌ ఐపీఓ

 సేఫ్టీ నెట్‌ ఆప్షన్‌తో ఐపీఓకు ఆసక్తి చూపుతోన్న ఇన్వెస్టర్లు 
 చిన్న ఇన్వెస్టర్లకు అన్ని విధాలా. ఈ ఐపీఓ అనుకూలమంటున్న మార్కెట్‌ ఎనలిస్ట్‌లు


 ఆంధ్రప్రదేశ్‌లో నెంబర్‌వన్ మహిళావస్త్ర రిటైలర్‌గా ఇమేజ్ సంపాదించుకున్న శ్రీ సాయి సిల్క్స్ ఐపిఒ ఇవాళ ప్రారంభం అయింది. 70 నుంచి 75 రూపాయిల ప్రైస్ బ్యాండ్‌‍లో ఆఫర్ చేస్తున్న ఈ ఐపిఒ చిన్న ఇన్వెస్టర్లకు అన్ని విధాలా అనుకూలంగా వుందని ఎనలిస్ట్స్ అభిప్రాయ పడుతున్నారు. ప్రధానంగా కంపెనీ చిన్న ఇన్వెస్టర్ల కోసం సేఫ్టీ నెట్ ఆప్షన్‌ను ఇష్యూ పొందుపరచడం ఆకర్షణీయమైన అంశంగా ఎనలిస్ట్స్ చెప్తున్నారు. కంపెనీ షేర్లు ఇన్వెస్టర్ డీమ్యాట్ ఖాతాకు క్రెడిట్ అయిన నాటినుంచి ఆరునెలలలోగా షేర్ ధర ఇష్యూధర కంటే తగ్గిన పక్షంలో, ఇన్వెస్టర్ల నుంచి ప్రమోటర్లు ఇష్యూధరకే షేర్లు తిరిగి కొనుగోలు చేస్తారు. సేఫ్టీ నెట్ ఆప్షన్‌ వల్ల ఇన్వెస్టర్లకు నష్టం నుంచి తప్పించుకునే సదుపాయమే కాక, ధరలో కాస్త పెరుగుదల వచ్చినా బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ రాబడి గిట్టుబాటు అవుతుందని ఎనలిస్ట్ కుటుంబరావు అంటున్నారు. ఈ రోజు ప్రారంభమైన  ఈ ఐపీఓ మంచి స్పందన లబిస్తోంది 

Post a Comment

Previous Post Next Post