Ullasamga Utsahamha Hero Yasho Sagar Passed Away in Road Accident-TeluguCinemas.in

 
ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంలో నటించిన యశోసాగర్ బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్నాటక రాష్ట్రం తుముకూరు జిల్లా బుక్కపట్నం, శిరా ప్రాంతంలో తెల్లవారు ఝామున 4 గంటలకు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ సినిమా డీల్ నిమిత్తం వీరు బెంగుళూరు నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. యశోసాగర్‌తో పాటు డ్రైవర్ విశ్వనాథ్, లోకేష్ అనే వ్యక్తి కారులో ఉన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు విశ్వనాథ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. పక్కనే యశోసాగర్ కూర్చున్నాడు. లోకేష్ వెనక సీటులో కూర్చున్నాడు. రాత్రి జర్నీ కావడంతో.... విశ్వనాథ్ నిద్రలోకి జారుకున్నాడు. దీంతో కారు అదుపుతప్పి వంతెనకు ఢీకొట్టింది. విశ్వనాథ్ కూడా ప్రమాదంలో మరణించగా, లోకేష్ అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యశో సాగర్ కన్నడ నిర్మాత సోము కుమారుడు. కరుణాకరణ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా' చిత్రంతో హీరోగా పరిచయం అయిన యశోసాగర్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని... మిస్టర్ ప్రేమికుడు, మరికొన్ని చిత్రాల్లో నటించాడు. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా' తర్వాత అతనికి హిట్లేమీ రాక పోవడంతో ఈ మధ్య అతని సినిమాలేవీ రాలేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంలో స్నేహా ఉల్లాల్ హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రం యశోసాగర్ తో పాటు, స్నేహా ఉల్లాల్ కు కూడా తొలి చిత్రమే

Post a Comment

Previous Post Next Post