Chamanthi Movie Latest Stills,Details-TeluguCinemas.in





ఓం శ్రీ గురు రాఘవేంద్ర క్రియేషన్స్‌ ప్రేమకథా చిత్రం ‘చామంతి’. జె.మోహన్‌కాంత్‌ దర్శకనిర్మాత. సంతోష్‌-సింధూజ, మేహష్‌-సృజన, కృష్ణమురళి-నీతు, అపేంద్ర-మనస్విని..జంటలు తెరకి పరిచయమవుతున్నారు. రామానాయుడు స్టూడియోలో ప్రస్తుతం పాట చిత్రీకరణ సాగుతోంది. దర్శకనిర్మాత మాట్లాడుతూ-‘‘చామంతిని స్వీయనిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్నా. ఇదో చక్కని ప్రేమకథా చిత్రం. కేరళ, తలకోన, రాజమండ్రి పరిసరాల్లో చిత్రీకరించాం. పోసాని ‘ఆపరేషన్‌ ఐపిఎస్‌’ తర్వాత దర్శకత్వం వహించిన చిత్రమిది. కొత్తనటీనటుల ప్రదర్శన బావుంది’’ అన్నారు. ప్రస్తుతం 5పాటల రికార్డింగ్‌ జరుగుతోందని సంగీతదర్శకుడు పద్మనాభన్‌ తెలిపారు. పి.డి.రాజు, కాశీ టి.పి.టి అక్బర్‌, దుర్గాప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు. కెమెరా: సమీ, మాటలు: చింతా శ్రీనివాస్‌, కథ-కథనం-నిర్మాత-దర్శకత్వం: జె.మోహన్‌కాంత్‌.

Post a Comment

Previous Post Next Post