'గబ్బర్ సింగ్' 100days ఎప్పుడు?ఎక్కడ
పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన 'గబ్బర్ సింగ్' సినిమా సరికొత్త రికార్డులతో శతదినోత్సవానికి చేరుకుంటోంది. ఈ నెల 17 తో వంద రోజుల ప్రదర్శన విజయవంతం గ పూర్తి చేసుకుంటోంది. మొత్తం 54 డైరెక్ట్ ధియేటర్లలో ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుని, పవన్ కల్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా రికార్డుల కెక్కింది. ఈ సినిమా విజయం ఇటు హీరోగా పవన్ కల్యాణ్ స్టామినాను పెంచడమే కాకుండా... అటు కథానాయికగా శృతి హాసన్, దర్శకుడిగా హరీష్ శంకర్ సినీ జీవితాలకు మంచి పునాది వేసింది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం శతదినోత్సవాన్ని భారీ ఎత్తున నిర్వహించాలని నిర్మాత బండ్ల గణేష్ ప్లాన్ చేశాడు. 50 రోజుల వేడుక కానీ, 75 రోజుల వేడుక కానీ నిర్వహించకపోవడంతో, శత దినోత్సవం కచ్చితంగా ఉంటుందని అభిమానులు కూడా ఊహించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం పవన్ కల్యాణ్ ఈ వేడుకకు ఇంకా అంగీకారం తెలుపలేదని తెలుస్తోంది. అసలు శతదినోత్సవ వేడుక ఉంటుందా? ఉండదా? అన్న విషయం కూడా కచ్చితంగా తెలియడం లేదు. రెండు మూడు రోజుల్లో ఈ విషయంపై ఓ స్పష్టత వస్తుంది! మరో పక్క ఈ సినిమా 100రోజుల సంబరాలు మలేష్య లో అక్కడ అభిమానులు ఘనం గ జరుపు కునేందుకు అన్ని ఏర్పట్లు చేస్తున్నారు
Post a Comment