GOODNEWS TO PAWANKALYANFANS |CGCR SHOOT WITH FANS WILL START TOMMAROW AT RFC


FANS SHOOTING WITH PAWAN KALYAN WILL START FROM TOMMAROW
పవన్ కల్యాణ అభిమానులకు శుభవార్త మీరు ఎంత గానఎదురు చూస్తున్న పవన్ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాలో పవన్ తో కలిసి నటించే అవకాశం ఆయన అభిమానులకి ఇస్తానని పూరీ జగన్నాథ్ గతంలో మాటిచ్చారు. ఇటీవల ఓ రోజున ఆ అవకాశాన్ని కల్పించారుగానీ ... వర్షం కారణంగా షూటింగును కేన్సిల్ చేసుకున్నారు.
తాజాగా పూరీ ట్విట్టర్ ద్వారా పవన్ అభిమానులకు ఆహ్వానం పలికారు. అభిమానుల కాంబినేషన్లో పవన్ సన్నివేశాలను రేపటి (ఆగష్టు 9) నుంచి 12 వరకూ హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నట్టు చెప్పారు. ఈ నాలుగు రోజులు కూడా ఈ సినిమా షూటింగ్ అక్కడ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని అన్నారు. మొన్నామధ్య ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోలో ... హైదరాబాద్ లోని అభిమానులు మాత్రమే రావాలంటూ పిలుపునిచ్చిన పూరీ, ఈసారి అలాంటి విషయాలేమీ చెప్పకపోవడం గమనించదగిన విషయం.  

Post a Comment

Previous Post Next Post