she is not kathifame sanakhan ఆమె 'కత్తి' సనాఖాన్ కాదట!


వ్యభిచారం కేసులో ఈ రోజు బెంగళూరులో కథానాయిక సనాఖాన్ అరెస్టయిందన్న వార్త టాలీవుడ్ లో సంచలనం రేపింది. అయితే, ఆనక సావకాశంగా తేలిందేమిటంటే, మనమనుకుంటున్న ఈ సనాఖాన్ మన 'కత్తి' సినిమా హీరోయిన్ సనాఖాన్ కాదట! బెంగళూరు పోలీసులు తెలిపిన వివరాలలో గందరగోళం ఉండడంతో, మీడియా ఇలా తప్పుగా అర్ధం చేసుకుందని తెలుస్తోంది. ఇంతకీ, అరెస్టయిన ఆ సనాఖాన్ బాలీవుడ్ లో జూనియర్ ఆర్టిస్టని పోలీసులు సాయంకాలం తీరుబడిగా వివరణ ఇవ్వడంతో అవాక్కవడం అందరి వంతయింది. ఈలోగా... టీవీల్లో ఈ వార్త తెగ ప్రచారం కావడంతో అసలు సనాఖాన్ చాలా అప్సెట్ అయినట్టు చెబుతున్నారు. పేరు తెచ్చే తంటా ఇలా ఉంటుందన్న మాట!

Post a Comment

Previous Post Next Post