జెమినీ కిరణ్ చేతుల్లోకి నాగార్జున 'భాయ్'?
ఒక సినిమా ప్రభావం మరో సినిమా మీద పడుతుందనడానికి తాజా ఉదాహరణ ఇది. బాలకృష్ణతో 'అధినాయకుడు' చిత్రాన్ని నిర్మించిన కీర్తి కంబైన్స్ అధినేత ఎమ్మెల్ కుమార్ చౌదరి, ఆ సినిమా బడ్జెట్ పెరిగిపోయి, ఆర్ధిక ఇబ్బందుల్లో నిండా కూరుకుపోవడంతో, ఆయన మరో సినిమాని వదులుకోవాల్సి వస్తోంది. ఇటీవల 'పూలరంగడు' చిత్రాన్ని రూపొందించిన వీరభద్రం చౌదరి దర్శకత్వంలో నాగార్జున హీరోగా 'భాయ్' అనే చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ చిత్రాన్ని నిర్మించుకునే అవకాశాన్ని నాగార్జున మొదట్లో కుమార్ చోదరికి ఇచ్చారు. అయితే, ప్రస్తుతం ఆయన ఎదుర్కుంటున్న ఆర్ధిక సమస్యల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆయనకు చేయడానికి నాగ్ విముఖత చూపుతున్నాడట. దాంతో అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడీ ప్రాజక్టును జెమినీ కిరణ్ సొంతం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తమ ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై ఆయనీ చిత్రాన్ని నిర్మిస్తారట!
Post a Comment