రౌడీలతో పోరాడుతోన్న 'ఆటోనగర్ సూర్య'
నాగ చైతన్య హీరోగా 'ఆటోనగర్ సూర్య' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దేవ కట్టా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. తనని నమ్ముకున్న వారికి ఏ మాత్రం అన్యాయం జరిగినా సహించని సూర్య, అందుకు కారకులైన వారితో తలపడతాడు. ఇందుకు సంబంధించిన పోరాట సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఓ వైపున వర్షం కురుస్తుండగా ... డీజిల్ - గ్రీజ్ కలిసిన బురదలో కంపోజ్ చేసిన ఈ యాక్షన్ సీన్, సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని దర్శకుడు చెప్పాడు. నాగ చైతన్య - సమంతా జంటగా నటిస్తోన్న ఈ సినిమాని, మాక్స్ ఇండియా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Post a Comment