I had most horrible time working with sanjaydutt says rgv-telugucinemas

జన్మలో సంజయ్‌దత్ ముఖం చూడను: వర్మ



బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, దర్శకుడు రామ్‌గోపాల్ వర్మల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక జన్మలో తాను సంజయ్‌దత్ ముఖం చూడనని వర్మ ట్విట్టర్‌లో కామెంట్స్‌ను పోస్ట్ చేశారు. డిపార్ట్‌మెంట్ చిత్ర షూటింగ్ సమయంలో తనను సంజయ్ దత్ ప్రొడక్షన్ సీఈఓ ధరమ్ ఓబెరాయ్‌తోపాటు, దత్ కూడా వేధించారని వర్మ తెలిపాడు. 

షూటింగ్ సమయంలో స్క్రిప్ట్‌ను మార్పు చేయాల్సిందిగా, కంగనా రనౌత్‌ను తీసుకోవాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడని వర్మ ఆరోపణలు చేశాడు. సంజయ్ పనిచేయడం దారుణమైన అనుభవమని వర్మ మండిపడ్డాడు. 30 కోట్ల వ్యయంతో నిర్మించిన డిపార్ట్‌మెంట్ చిత్రం ఇప్పటి వరకు ఏడు కోట్ల రూపాయల్ని మాత్రమే వసూలు చేసింది. 

బాలీవుడ్ దిగ్గజం అమితాబ్, సంజయ్‌దత్, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, మధుశాలినిలు నటించిన డిపార్ట్‌మెంట్ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

Post a Comment

Previous Post Next Post