చిరంజీవి అల్లుడు ఇంటిలో 35కోట్ల నగదు !
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు విష్ణు ప్రసాద్ చెన్నై నివాసంలో ముప్పై ఐదు కోట్ల రూపాయల నగదును ఆదాయపన్ను శాఖ పట్టుకోవడం సంచలనంగానే ఉంది. నగదుతోపాటు,సుమారు ఐదు కోట్ల రూపాయల విలువైన పత్రాలు కూడా దొరికాయి. రెండు రోజుల క్రితం విష్ణుప్రసాద్ ఇంటిలో భారీ నగదు ఉందన్న సమాచారం ఆదాయపన్ను శాఖ కు అందడంతో వారు దాడులు చేసినప్పుడు ఈ మొత్తం దొరకడం విశేషం. అయితే ఇది పూర్తిగా విష్ణుప్రసాద్ తండ్రి వైపు ఉన్న ఆదాయమేనా? లేక చిరంజీవికి దీనికి లింకు పెట్టే అవకాశం ఉందా అన్నదానిపై చర్చ ఆరంభమవుతుంది.చిరంజీవి కుమార్తె ఇంటి వద్ద పట్టుబడ్డ నగదుకు ఎపిలో జరుగుతున్న ఉప ఎన్నికలకు సంబంధం పెట్టి చిరంజీవి ప్రత్యర్దులు ప్రచారం చేసే అవకాశం ఉంది. చెన్నైకి తిరుపతి సమీపంలో ఉండడం, కొద్దికాలం క్రితం వరకు ఆ నియోజకవర్గానికి ప్రాతినిద్యం వహిస్తూ రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లిన సందర్భంగా ఉప ఎన్నిక జరుగుతోంది.అయితే చిరంజీవి వియ్యంకుడు తాలూకు బందువులపై తొలుత దాడి జరిగిన సందర్భంగా చిరంజీవి అల్లుడు విష్ణుప్రసాద్ ఇంటిపై కూడా ఈ దాడి జరిగింది. ఇటీవలి క ఆలంలో ఇంత భారీగా నగదు పట్టుబడడం సంచలనం కలిగించే విషయమేనని చెప్పాలి.సాధారణంగా ఇంత పెద్ద మొత్తం లో నగదు ఎవరూ దాయరు. అలాంటిది బెడ్ రూమ్ లో అట్టపెట్టెలలో ఈ నగదు పెట్టి ఉంచారని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.ఇది సహజంగానే చిరంజీవికి కాస్త ఇబ్బంది కలిగించే అంశమే.
Post a Comment